Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరనే విషయం తెలిసిందే. ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి పక్కా సమయం కేటాయిస్తాడు. పిల్లలు, భార్యతో కలిసి అప్పుడప్పుడు వెకేషన్స్‌కి కూడా వెళుతుంటాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టాక ఎన్టీఆర్ మరింత బాధ్యత తీసుకుంటున్నాడు. అయితే కరోనా మహమ్మారి వలన ఎన్టీఆర్ ఫ్యామిలీకి దూరంగా కొద్ది రోజుల పాటు హోటల్ గదికే పరిమితం అయ్యాడట. అందుకు కారణం కరోనా విజృంభిస్తుండడం. త్రిబుల్ ఆర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కరోనా ఉధృతంగా ఉంది. సెకండ్ వేవ్‌లో అయితే ఎంతో మంది యువత చనిపోయారు. ఎన్టీఆర్‌కు ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో పాటు వయస్సు పైబడిన తల్లి కూడా ఉంది.
తన వల్ల వాళ్లు ఇబ్బంది పడడం ఇష్టంలేకే ఎన్టీఆర్ కరోనా తగ్గే వరకు కూడా హోటల్లోనే గడిపాడట.హోటల్ నుంచే షూటింగ్‌కు వెళ్లడం.. షూటింగ్ అయిపోయాక తిరిగి హోటల్‌కే వెళ్లిపోయేవాడట. ఆ టైంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కరోనా బారిన కూడా పడ్డారు. కాని తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన త్వరగానే కోలుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఈడేట్‌కి అయిన విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌తో ఓ సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఇది వరకు ఎప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవుతుందని విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపాయి. కాని చివరి క్షణంలో వాయిదా పడింది. కొరటాల శివతో చేయబోతున్న సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేశారంటున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తుంది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సినిమా రూపొందనుంది. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.