Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌ అంటే అంత ప్రాణ‌మా.. రాజ‌కీయాల్లోకి రావాలంటూ రూ.250కి.మీ పాద‌యాత్ర చేసిన అభిమాని

Authored By Sam C | The Telugu News | Published on: February 25, 2022, 6:30 pm

Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న‌కు ఉన్న క్రేజ్ మాములు కాదు. టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొర‌టాల సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఎన్టీఆర్ 30 త్వ‌ర‌లోనే లాంఛ‌నంగా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ బ‌స్తీ నుంచి చ‌దువుకుని మంచి మెరిట్ స్టూడెంట్‌గా ఎదుగుతారు. అయితే త‌ర్వాత రాజ‌కీయాలు, రాజ‌కీయ నాయ‌కులు వ‌ల్ల విద్యార్థుల చ‌దువుకు ఆటంకం ఏర్ప‌డుతుంది. అప్పుడు వారికి అండ‌గా ఎన్టీఆర్ నిల‌బ‌డి పోరాటం చేసేశాడ‌నేదే క‌థ అని టాక్‌.

ఈ సినిమాలో కొర‌టాల శివ ఎక్కువ‌గా పొలిటిక‌ల్ ట‌చ్ ఇస్తున్నార‌ని స‌మాచారం. ఇలా సినిమాలే కాకుండా రియ‌ల్ లైఫ్‌లో కూడా ఎన్టీఆర్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని అభిమానులు కోరుతున్నారు. ఆయ‌న రాజ‌కీయాల‌లోకి రావాలంటూ కోరుతున్నారు. అయితే తాజ‌గా నందమూరి అభిమాని శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామానికి చెందిన జె.సురేష్ గౌడ్ జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. గత 15ఏళ్లుగా ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాడు.ఎన్టీఆర్ కుమారుడి పేరు అభిరామ్ పేరును తన కుమారునికి పెట్టుకొని వీరాభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా తన అభిమాన హీరో ఆయురారోగ్యాలతో ఉండాలని

Jr ntr fan adventure 250 km padayatra seeking to get into politics

Jr ntr fan adventure 250 km padayatra seeking to get into politics

Jr NTR : ఎన్టీఆర్ అంటే అంత ప్రేమా..

, రాబోయే కాలంలో రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజలకు మంచి చేయాలని, తన తాత పేరు నిలబెట్టాలని గున్ముక్ల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టాడు. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ని కలవడమే తన జీవితాశయమని సురేష్ చెబుతున్నాడు. మ‌రి అత‌ని కోరిక నెర‌వేరి , ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావడం అనేది జ‌రుగుతుందా అనేది చూడాలి. ఎన్‌టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకా తాను నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాకపోయినా.. ఇప్పటికే జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ప్రతీ భాషా ప్రేక్షకుడికి దగ్గరయ్యాడు ఎన్‌టీఆర్. అందుకే కొరటాల శివ తన అప్‌కమింగ్ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.

Sam C

No bio available for this author.

  1. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  2. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  3. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  4. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  5. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  6. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  7. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp