
Tollywood : ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, చరణ్ వీళ్లంతా 4 ఏళ్ల దాకా బిజీ బిజీ..!
Tollywood : వరుస పాన్ ఇండియా సినిమాలు చేయడమే కాదు వాటితో పాన్ ఇండియా హిట్లు కూడా కొడుతున్నారు కాబట్టి మన స్టార్స్ అంతా కూడా ఒకదానికి మించి మరొకటి అన్న రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ ఎలాగు ఈమధ్యనే కల్కి తో వచ్చి అలరించాడు. ఈ సినిమాతో మరోసారి 1000 కోట్లు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న దేవర, పుష్ప 2, గేం చేంజర్ సినిమాలు తమ బాక్సాఫీస్ స్టామినా చూపించాల్సి ఉంది.ఇదిలాఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర 1 సెప్టెంబర్ 27న వస్తుంది. దీనితో పాటుగా వార్ 2, దేవర 2 చేస్తున్నాడు తారక్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది ఈ ఇయర్ ఎండింగ్ కు సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమా ఈ రెండు పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా 3 ఏళ్లు పైన పడుతుంది. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత త్రివిక్రం తో అదిరిపోయే కాన్సెప్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏడాదిన్నర దాకా తీసుకుంటున్నారట.
సో అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అది పూర్తయ్యే సరీ ఎలా లేదన్నా 4 ఏళ్లు పడుతుంది. మహేష్ రాజమౌళి సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. తప్పకుండా మహేష్ కు హాలీవుడ్ రేంజ్ సినిమా అవుతుందని అంటున్నారు. ఈ సినిమా కూడా 3, 4 ఏళ్లు పట్టేలా ఉంది. చరణ్ కూడా బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాతో భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడు.
Tollywood : ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, చరణ్ వీళ్లంతా 4 ఏళ్ల దాకా బిజీ బిజీ..!
ఇలా ప్రతి హీరో తమ సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు ఇచ్చేస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, చరణ్ వీరితో పాటు ప్రభాస్ ఈ హీరోలంతా కూడా వారు ఇప్పుడు కంటైన సినిమాలు చేయాలంటే ఎలా లేదన్నా 4 ఏళ్ల దాకా టైం పట్టేలా ఉంది. సో వారు కొత్త సినిమా ఓకే చేయాలంటే 4 ఏళ్ల తర్వాతే అన్నమాట.
Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…
Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…
Brahmamudi Today Episode Jan 30 : బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ (BrahmaMudi) రోజుకో కొత్త మలుపు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
This website uses cookies.