Tollywood : ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, చరణ్ వీళ్లంతా 4 ఏళ్ల దాకా బిజీ బిజీ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 July 2024, 10:00 am
  •  ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, చరణ్ వీళ్లంతా 4 ఏళ్ల దాకా బిజీ బిజీ..!

Tollywood : వరుస పాన్ ఇండియా సినిమాలు చేయడమే కాదు వాటితో పాన్ ఇండియా హిట్లు కూడా కొడుతున్నారు కాబట్టి మన స్టార్స్ అంతా కూడా ఒకదానికి మించి మరొకటి అన్న రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ ఎలాగు ఈమధ్యనే కల్కి తో వచ్చి అలరించాడు. ఈ సినిమాతో మరోసారి 1000 కోట్లు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న దేవర, పుష్ప 2, గేం చేంజర్ సినిమాలు తమ బాక్సాఫీస్ స్టామినా చూపించాల్సి ఉంది.ఇదిలాఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర 1 సెప్టెంబర్ 27న వస్తుంది. దీనితో పాటుగా వార్ 2, దేవర 2 చేస్తున్నాడు తారక్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది ఈ ఇయర్ ఎండింగ్ కు సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమా ఈ రెండు పూర్తి చేయాలంటే ఎలా లేదన్నా 3 ఏళ్లు పైన పడుతుంది. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత త్రివిక్రం తో అదిరిపోయే కాన్సెప్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏడాదిన్నర దాకా తీసుకుంటున్నారట.

Tollywood బుచ్చి బాబుతో భారీ ప్లానింగ్ లో చరణ్..

సో అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అది పూర్తయ్యే సరీ ఎలా లేదన్నా 4 ఏళ్లు పడుతుంది. మహేష్ రాజమౌళి సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. తప్పకుండా మహేష్ కు హాలీవుడ్ రేంజ్ సినిమా అవుతుందని అంటున్నారు. ఈ సినిమా కూడా 3, 4 ఏళ్లు పట్టేలా ఉంది. చరణ్ కూడా బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాతో భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడు.

Tollywood : ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, చరణ్ వీళ్లంతా 4 ఏళ్ల దాకా బిజీ బిజీ..!

Tollywood : ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, చరణ్ వీళ్లంతా 4 ఏళ్ల దాకా బిజీ బిజీ..!

ఇలా ప్రతి హీరో తమ సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు ఇచ్చేస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, చరణ్ వీరితో పాటు ప్రభాస్ ఈ హీరోలంతా కూడా వారు ఇప్పుడు కంటైన సినిమాలు చేయాలంటే ఎలా లేదన్నా 4 ఏళ్ల దాకా టైం పట్టేలా ఉంది. సో వారు కొత్త సినిమా ఓకే చేయాలంటే 4 ఏళ్ల తర్వాతే అన్నమాట.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp