Samantha : జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబినేషన్‌లో మరో మూవీ..? ఫుల్లు ఖుషీలో ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబినేషన్‌లో మరో మూవీ..? ఫుల్లు ఖుషీలో ఫ్యాన్స్

 Authored By mallesh | The Telugu News | Updated on :28 December 2021,4:20 pm

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనేది చాలా అరుదు. ఒకే హీరోహీరోయిన్ కలిసి నటించిన సినిమాలు ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. మిగతావి డిజాస్టర్లుగా నిలిచాయి. సామ్, తారక్ విషయంలోనూ అదే ఫార్ములా రిపీట్ అయ్యింది. కానీ గతంలో మాత్రం చిరు, వెంకీ, నాగ్ మాత్రం విషయంలో హిట్ పెయిర్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సీనియర్ నటి మీనా, విక్టరీ వెంకటేశ్ కలిసి చేసిన మూవీలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదిలాఉండగా తారక్, సమంత మరోసారి స్క్రీన్ కనిపించనున్నట్టు వార్తలు జోరుగా వస్తున్నాయి.

గతంలో సమంత, ఎన్టీఆర్ కలిసి బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు చేశారు. ఆ నాలుగింటిలో రెండు సూపర్ హిట్ అవ్వగా మిగతావి వీరిద్దరి కెరీర్‌లో డిజాస్టర్స్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ చాలా హ్యపీగా ఫీలవతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. జనవరి 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆ తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో తారక్ కొత్త మూవీని ప్రారంభించనున్నారు.

JR NTR Samantha combination another movie

JR NTR Samantha combination another movie

Samantha : జూనియర్ ఎన్టీఆర్ మూవీలో సమంత..

ఇందులో మెయిన్ లీడ్‌గా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌ను తీసుకున్నట్టు తెలిసింది.అయితే, సెకండ్ హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందట. దీనిపై ఇప్పటికే సమంతను సంప్రదించినట్టు తెలుస్తోంది. సామ్ కూడా తారక్ మూవీలో చేసేందుకు పాజిటివ్ గానే ఉందట.. అన్ని కుదిరితే మరోసారి తారక్ , సమంత మరోసారి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టనున్నారు. అయితే, ఈ చిత్రంలో సామ్ నెగెటిల్ రోల్ లీడ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందనేది మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది