Junior NTR Hero so all These Movies have been hits
Jr NTR : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించబోతున్నాడు. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇందులో కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరిస్, చెర్రీకి జోడిగా అలియా భట్ సందడి చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడిన తరుణంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా చెర్రీతో తనకున్న అనుబంధాన్ని బయపెట్టాడు తారక్.’మేమిద్దం చాలా మంచి ఫ్రెండ్స్. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా,
అలా మేమిద్దరం కలిసిపోయాం. మార్చి 26న నా భార్య లక్ష్మీప్రణతి బర్త్‌డే. మార్చి 27న చరణ్ బర్త్‌డే. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి. ఎవరికీ తెలియని విషయమేంటంటే.. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు నేను గేటు దగ్గర ఉండేవాడిని, చరణ్ కారు రాగానే అందులో ఎక్కేసి వెళ్లిపోయేవాడిని. ప్రణతి ఫోన్ చేసి ‘నా బర్త్‌డే, నువ్వెక్కడున్నావ్?’ అంటే పన్నెండు దాటింది, నీ బర్త్‌డే అయిపోయింది అని చెప్పేవాడిని’ అంటూ చరణ్ పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకునేవారో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఇక ఎన్టీఆర్ తన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. మొదటి సినిమాకి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు 45 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.
Jr NTR says about her remuneration
బాల రామాయణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో బాలనటుడిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. తనపై మొహమాటం లేకుండా బాహాటంగా విమర్శలు చేసేవారు ఇద్దరు మాత్రమే ఉన్నారని ఎన్టీఆర్ తెలిపారు. వారిలో ఒకరు తన తండ్రి హరికృష్ణ కాగా మరొకరు రాజమౌళి అని వెల్లడించాడు. ఇక ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో మొత్తం నాలుగు సినిమాలు రూపొందాయి. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెరకెక్కాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ , జక్కన్న కాంబినేషన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం అని అంటున్నారు.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.