Jr NTR : ఆ ఇద్ద‌రే న‌న్ను విమ‌ర్శించేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైర‌ల్‌

Authored By Sam C | The Telugu News | Published on: March 18, 2022, 6:00 pm

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ త‌న స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు రెడీగా ఉంది. ఈ సారి మాత్రం గురి తప్పేలాలేదు. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ క్ర‌మంలో అనేక విష‌యాలు తెలియ‌జేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. యూట్యబర్లతో ఇంటర్వ్యూ, అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూలు ఇలా బాగానే ప్లాన్ చేశాడు రాజమౌళి. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.

ఇంట‌ర్వ్యూల‌లో తమ స్నేహం ఎలా మొదలైందో.. ఎందుకు ఇంత ఘాడంగా మారిందో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ ఎంతో కామ్‌గా ఉంటాడు.. అగ్నిపర్వతం బద్దలువుతున్నా కూడా చరణ్ ఎంతో సెటిల్డ్‌గా, కామ్‌గా ఉంటాడు. నేను అలా ఉండలేను.. నాకు చరణ్ పూర్తిగా ఆపోజిట్. నేను అగ్రెసివ్. చరణ్ కామ్‌నెస్. ఇద్దరికీ అలా కుదిరింది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అలాగే చిత్ర పరిశ్రమలో తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరు? ఎవరితో ఎక్కువ స్నేహ బంధం ఉంది అనే విషయాలను తెలియజేస్తూ..

Jr NTR stunning comments viral

Jr NTR stunning comments viral

Jr NTR  : ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..

‘ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను విమర్శించే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు.వారిలో ఒకరు మానాన్న (హరికృష్ణ). రెండోది రాజమౌళి. నేను కెరీర్‌ పరంగా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం జక్కన్ననే’అని తారక్‌ ఎమోషనల్‌ అయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న చరణ్‌.. తారక్‌ కెరీర్‌లో భారీ విజయాలు సాధించిన సినిమాల్లో జక్కన్నవే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాగా, రాజమౌళి, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో స్టూడెంట్‌ నెం.1(2001), సింహాద్రి(2003), యమదొంగ(2007), ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp