Rajamouli : రాజమౌళి బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ధర ఎంతో తెలుసా..?? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rajamouli : రాజమౌళి బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ధర ఎంతో తెలుసా..??

Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే సొంతం. అయితే తాజాగా రాజమౌళి తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు. సినీ ప్రముఖులు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా హ్యాపీ బర్త్డే జక్కన్న అని విషెస్ తెలిపారు. షూటింగ్ స్పాట్లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 October 2023,7:00 pm

Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే సొంతం. అయితే తాజాగా రాజమౌళి తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు. సినీ ప్రముఖులు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా హ్యాపీ బర్త్డే జక్కన్న అని విషెస్ తెలిపారు. షూటింగ్ స్పాట్లో రాజమౌళితో కలిసి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో జత చేసి ట్వీట్ చేశారు. రాజమౌళి ఎన్టీఆర్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే.

‘ స్టూడెంట్ నెంబర్ వన్ ‘ సినిమాతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ‘ సింహాద్రి ‘ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ గా మారారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ‘ యమదొంగ ‘ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గేలా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని రాజమౌళి సరికొత్తగా చూపించారు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం అందరికీ తెలిసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Junior ntr birthday wishes to Rajamouli

#image_title

వరుసగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక తర్వాత నాలుగోసారి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా ఏకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ వరల్డ్ వైడ్ హీరోలుగా మారారు. అయితే అక్టోబర్ 10న రాజమౌళి బర్త్డే కావడంతో ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే జక్కన్న అంటూ ట్విట్టర్ ద్వారా తమ విషెస్ తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజమౌళికి బర్త్ డే విషెస్ తెలిపారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది