Home » Entertainment » Junior Ntr Takes Key Decision Over Prashanth Neel Movie
Entertainment

Junior NTR : ఎన్టీఆర్ ఏంటి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ప్రశాంత్ నీల్ దానికి ఒప్పుకుంటాడా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 29, 2022, 11:00 am
Advertisement

Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ కు ఎంత పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ తనలోని అసలైన నటుడిని ఈ సినిమాలో అందరికీ పరిచయం చేశాడు. నిజానికి.. అరవింద సమేత సినిమా తర్వాత చాలా ఏళ్ల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మాత్రమే ఎన్టీఆర్ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు చాలా నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే…

Advertisement

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి చాలా నెలలు అయినా కూడా కొరటాల శివ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కొరటాల శివ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అసలే.. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అయితే.. ఎన్టీఆర్ సినిమా హిట్ కొడితే గానీ కొరటాల మళ్లీ ట్రాక్ లోకి రాడు. అందుకే..ఈ సినిమాను కథ పరంగా మరింత బలంగా తయారు చేస్తున్నాడు కొరటాల.

junior ntr takes key decision over prashanth neel movie

Advertisement

Junior NTR : వచ్చే సమ్మర్ లో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీదకు

ఏది ఏమైనా వచ్చే సంవత్సరం సమ్మర్ నుంచి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీదికి రానున్నట్టు తెలుస్తోంది. సమ్మర్ లోపే కొరటాల ఎన్టీఆర్ మూవీ షూటింగ్ పూర్తవ్వాలి. అయితే.. కొరటాల శివ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. వెంటే ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేయాలని.. ఏ మాత్రం గ్యాప్ తీసుకోవద్దని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట. వచ్చే సంవత్సరం పూర్తయ్యేలోపు ప్రశాంత్ నీల్ సినిమా కూడా పూర్తవ్వాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడట. మరి.. ప్రశాంత్ నీల్ అందుకు సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియదు కానీ.. ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయంపై ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి