jwala gets into fight with shoba in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 23 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1358 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్ కు నచ్చజెప్పాలని చూస్తుంది స్వప్న. తను ప్రేమ పేరుతో ఎలా మోసపోయిందో.. తన జీవితం గురించి చెబుతుంది స్వప్న. సత్యం తనను ఎలా మోసం చేశాడో చెబుతుంది. మొత్తానికి తనను హిమ మాయ నుంచి తప్పించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుంది. దీంతో నిరుపమ్ కూడా కాస్త కుదుట పడతాడు. మరోవైపు శోభ.. కారులో పేషెంట్ ను చూసేందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో మధ్యలో ఒక కారు ఆగి ఉంటుంది. దీంతో ఆ కారులో జ్వాల, హిమ ఇద్దరూ ఉంటారు.
jwala gets into fight with shoba in karthika deepam
నిజానికి కారు ఆగిపోతుంది. కారు రోడ్డు మధ్యలో ఆగి అస్సలు స్టార్ట్ అవ్వదు. ఇంతలో అక్కడికి కారులో వచ్చిన శోభ.. హిమ బయటికి రమ్మంటుంది. కారు దిగగానే రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ తనపై చేయి చేసుకుంటుంది. హిమపై చేయి చేసుకుందన్న కోపంతో జ్వాల.. శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఒక్కసారి కాదు.. రెండు సార్లు శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో హిమ టెన్షన్ పడుతుంది. శోభకు కోపం వస్తుంది. నేనెవరో తెలుసా అంటూ సీరియస్ అవుతుంది. కారు ఊరికే రోడ్డు మీద ఆగలేదు. కారు సడెన్ గా రోడ్డు మీద ఆగి స్టార్ట్ అవడం లేదంటూ చెబుతుంది జ్వాల.
ఆ తర్వాత శోభతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపిస్తుంది జ్వాల. ఇంతలో కారులో వెళ్తున్న శోభకు స్వప్న ఫోన్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దీంతో కారులో ఉన్నా అంటుంది. ఒకసారి ఇంటికిరా అని పిలుస్తుంది స్వప్న. దీంతో సరే ఆంటి అంటుంది శోభ.
కారు చెడిపోవడంతో ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ పార్కుకు వెళ్తారు. అక్కడ నిరుపమ్ గురించి మాట్లాడుతుంది జ్వాల. డాక్టర్ సాబ్ అందంగా ఉంటారు కదా. మీకు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా తింగరి అంటుంది జ్వాల. దీంతో హిమకు ఏం చెప్పాలో అర్థం కాదు.
డాక్టర్ సాబ్ కన్నా మంచోడు నీకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అని అడుగుతుంది. దీంతో నాకు మీ డాక్టర్ సాబ్ నచ్చలేదు అంటుంది హిమ. ఎందుకు నచ్చలేదో ఒక కారణం చెప్పు అంటుంది జ్వాల. ఆ కారణం నేను నీకు చెప్పలేను శౌర్య అని మనసులో అనుకుంటుంది హిమ.
నా మనసులో మీ డాక్టర్ సాబ్ కు చోటు లేదు అంటుంది హిమ. కానీ.. నా మనసులో డాక్టర్ సాబ్ కు చోటు ఉంది అంటుంది జ్వాల. నేను డాక్టర్ సాబ్ ను ప్రేమిస్తున్నా అంటుంది జ్వాల. దీంతో సరే అంటుంది. నువ్వే డాక్టర్ సాబ్ ను, నన్ను కలపాలి.. నాకు సపోర్ట్ చేయి అని అడుగుతుంది జ్వాల.
దీంతో తప్పకుండా అది నా బాధ్యత కూడా అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.