YouTube: నచ్చిన వీడియో చూడాలంటే యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే.. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూడకుండా ఉండలేరు. ఎంతో మంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి, టైంపాస్ చేయడానికి యూట్యూబ్ ని విపరీతంగా వాడుతుంటారు. అలాగే చిన్నపిల్లలు కూడా యూట్యూబ్ లో పలు గేమ్స్, కథలకు సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చూస్తుంటారు. ఇందులో కొన్ని బిలియన్ల వీడియోలు ఉంటాయి. గూగుల్ తర్వాత అతిపెద్ద సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. అందుకే ఏది సెర్చ్ చేసినా వీడియోల రూపంలో అందిస్తుంది. రోజుకు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఒక వీడియో చూడగానే దానికి రిలేటివ్ వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి.
షార్ట్ ఫిలింమ్స్ కి మంచి వేదిక యూట్యూబ్. అంతే కాదు నచ్చిన సినిమాలు.. నచ్చిన విడియోస్.. ఇష్టమైన షోస్, సాంగ్స్.. కామెడీ.. జంతువులు, పక్షుల వీడియోలు, వైరల్ వీడియోలు ఇలా ఎన్నెన్నో దర్శమిస్తుంటాయి. అయితే యూట్యూబ్ వివర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అప్డేట్ చేస్తుంటారు. ఎలాంటి ఇబ్బందిలేకుండా పలు మార్పులు చేపడుతుంటారు. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ని అందుబాటులోకి తెచ్చిన యూట్యూబ్ ప్రస్తుతం మరో ఫీచర్ తో మరింత సులువ చేయనుంది.
అయితే యూట్యూబ్ లో ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోలు చూడాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంటుంది. మరి నచ్చిన సీన్ చూడాలంటే వీడియో మొత్తం చూడాలి. దీంతో చాలా సమయం వృథా అవుతుంది. అందుకే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియోలో ఇంట్రెస్టింగ్ సీన్.. నచ్చిన సీన్ ఎక్కడుందో గుర్తించేలా చేస్తోంది.
ఇప్పటికే ప్రిమియమ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మనం చూసే వీడియోలో ఎక్కువగా ప్లే చేసిన పార్ట్ ను స్పెషల్ గా చూపించనుంది. ఇది గుర్తించడానికి యూట్యూబ్ ప్లేయర్ లో ఓ గ్రాఫ్ పాపులర్ పార్ట్ వద్ద హైగా ఉంటుంది. దీంతో వెంటనే ఆ పార్ట్ కు వెళ్లి చూడవచ్చు. అలాగే ఒకే వీడియోని ఎక్కువసార్లు చూడాలనుకునే వారి కోసం సింగిల్ లూప్ వీడియో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.