Kajal agarwal : కాజల్ అగర్వాల్ నుంచి వరసగా సర్‌ప్రైజెస్ .. పెళ్ళి తర్వాత జోరు బాగా పెంచింది..!

Authored By vamana sai | The Telugu News | Published on: February 23, 2021, 7:34 am

Kajal agarwal : కాజల్ అగర్వాల్ నుంచి వరసగా సర్‌ప్రైజెస్ రాబోతున్నాయి. పెళ్ళికి ముందు కమిటయిన సినిమాలే కాదు పెళ్ళి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ తన జోరు ని కంటిన్యూ చేస్తోంది. సినిమా కెరీర్ కి ఏమాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. భర్త గౌతం కిచ్లు తో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఇటు సినిమా కెరీర్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కాజల్ మాదిరిగా ఏ హీరోయిన్ ఇలా కెరీర్ పట్ల ఇంత ప్లానింగ్ తో లేరని చెప్పాలి. ఇలా పెళ్ళి చేసుకుంటారో లేదో అలా సినిమాలకి బ్రేక్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి కాజల్ కంప్లీట్ గా వేరే అనిపిస్తోంది.

kajal-agarwal-gives continuous surprises

kajal-agarwal-gives continuous surprises

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150 లో నటించి హిట్ అందుకున్న కాజల్ మరోసారి ఆచార్య సినిమాలో మెగాస్టార్ కి జంటగా నటిస్తుండటం గొప్ప విషయం. కాగా ఆచార్య సినిమా తో కాజల్ అగర్వాల్ మే 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అందుకుంటుందని చాలా నమ్మకంగా ఉంది కాజల్ అగర్వాల్. కాగా ఆచార్య సినిమా కంటే ముందే కాజల్ నటించిన సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే కాజల్ నటించిన హింది సినిమా ముంబై సాగా షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది.

Kajal agarwal : కాజల్ అగర్వాల్ చాలాకాలంగా హిందీలో సాలీడ్ హిట్ కోసం ట్రై చేస్తోంది.

కాగా ముంబై సాగా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. మార్చ్ 19 న ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయబొతున్నారు. ఇక ఈ సినిమాలో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించారు. చాలాకాలంగా హిందీలో సాలీడ్ హిట్ కోసం ట్రై చేస్తోంద్ కాజల్. ఆ సాలీడ్ హిట్ ముంబై సాగా తో దక్కబోతోందని చాలా నమ్మకంగా ఉంది. ఇక మంచి విష్ణు తో నటించిన మోసగాళ్ళు సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp