kajal aggarwal ad video viral
Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తగ్గేదే లే అంటుంది. పెళ్లికి ముందు తెగ సందడి చేసిన కాజల్ పెళ్లి తర్వాత కూడా అదరగొట్టింది. ఇక ప్రస్తుతం గర్భవతి అయిన కూడా నెటిజన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు చేస్తున్న రచ్చ మాములుగా లేదు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది కాజల్. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో ఈమె మెయిన్ హీరోయిన్. ఘోస్ట్‌లో కూడా ఈ ముద్దుగుమ్మని ఎంపిక చేయగా, చివరి నిమిషంలో తప్పుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇంటికే పరిమితం అయింది.
ప్రెగ్నెన్సీ వలన సినిమాలన్నీ పక్కన పెట్టేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాతోనే సందడి చేస్తుంది. రీసెంట్‌గా బేబి బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ తాజాగా తన మేనల్లుడితో తెగ రచ్చ చేస్తుంది. నేను నా మేనల్లుడు ఇషాన్ తో కలిసి ఓరియో డబుల్ స్టఫ్ లిక్ రేస్ ప్రయత్నించాను. అతను నన్ను రేసులో వెనక్కి నెట్టేసినా ఆటను ఆస్వాధించాను. మీరు ఓరియోను ఆస్వాధించే రేసు లో పాల్గొనండి. అది కూడా డబుల్ స్టఫ్! ఇది చాలా సరదాగా ఉంటుంది. మీరు దీన్ని మీ ప్రియమైన వారితో కలిసి ప్రయత్నించండి.అంటూ ఓరియోకి పబ్లిసిటీ చేస్తుంది కాజల్.
kajal aggarwal ad video viral
గతంలో చాలా మంది కథానాయికలు ప్రెగ్నెన్సీ సమయంలో యాడ్స్ చేశారు. కరీనా కపూర్ ఖాన్.. అనుష్క శర్మ సహా పలువురు నాయికలు వాణిజ్య ప్రకటనల్లో నటించి భారీ ప్యాకేజీలు అందుకున్నారు. ఇప్పుడు ఓరియో బ్రాండ్ పబ్లిసిటీతో కాజల్ ప్యాకేజీ ఎంతో తెలియాల్సి ఉంది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్య మహిళా ప్రధాన ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తున్నారు కాజల్. అందులో భాగంగా కాజల్ అగర్వాల్ ‘ఉమ’ అనే పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా తనకు జీవితకాలపు అందనుభవాన్ని మిగిల్చిందని, ఈ సినిమా ఇచ్చిన కిక్ నుంచి ఇంకా బయటపడలేక పోతున్నానని కాజల్ అగర్వాల్ పేర్కోన్నారు
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.