the director who insulted Kajal Aggarwal
Kajal Aggarwal : బడా చిత్రాల లిస్ట్‌లో ఉన్న మరో చిత్రం ఆచార్య. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీకి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, డైరెక్టర్ మెహర్ రమేష్, చిత్రబృందంతో పాటు పూజాహెగ్డే కూడా హాజరయ్యింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ వేడుకలో అసలు కాజల్ ఊసే లేదు. వేదికపై మాట్లాడిన చిరు కానీ, చెర్రీ కానీ, డైరెక్టర్ కొరటాల, నిర్మాతలు… ఇలా ఒక్కటి నోటి వెంట కూడా కాజల్ పేరు వినిపించలేదు.
ఆచార్య ట్రైలర్‌లో కాజల్ కనిపించకపోవడంతో అందరిలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో కన్షర్మేషన్ వచ్చింది. కాజల్‌తో ఆచార్య చిత్ర బృందంకి ఏదో జరిగినట్టు అర్దమవుతుంది. చిరంజీవి పూజాహెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నవ్వు బాగుంటుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కానీ కాజల్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సినిమాలో విలన్ గా నటించిన సోనూసూద్ పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వారిద్దరిపై తెగ పొగడ్తలు కురిపించిన టీం ఇప్పుడు ప్రస్తావించకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆసక్తికర చర్చ నడుస్తుంది.
Kajal Aggarwal name not mentioned in acharya pre release event
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి.. ప్రభాస్, యష్, అల్లు అర్జున్ గురించి కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అందరి కంటే ముందు ప్రభాస్.. యష్, ప్రశాంత్ నీల్ చేసిన కె.జి.యఫ్, ట్రిపుల్ ఆర్‌లో చేసిన తారక్, రామ్ చరణ్.. పుష్పలో చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు. . మణిరత్నంగారు, శంకర్‌గారు వావ్ అనిపించేలా సినిమాలు చేశారు. ఇప్పుడు అవన్నీ సర్దుకున్నాయి. తారతమ్యాలు లేవు. ఏ సినిమా అయినా ప్రతీది కూడా ఇండియన్ సినిమా అనే భావన రావాలి. వచ్చింది కూడా. ఇందులో భాగమైన అందరికీ థాంక్స్. ఎందుకంటే ఆరోజు నేను ఎంతో బాధపడ్డాను. నేను మాత్రమే ఈరోజు గర్వానికి లోను అవగలను. మరోసారి రాజమౌళికి థాంక్స్ చెబుతున్నాను అన్నారు చిరు.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.