
will soundarya know about sourya details in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్ 24 ఏప్రిల్ 2022, సోమవారం 1335 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాఫీ తాగుదాం పదా అని ప్రేమ్.. హిమను కాఫీ షాప్ నకు తీసుకెళ్తాడు. నిజానికి.. ప్రేమ్ తనకు ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. కానీ.. తనను చూసి ప్రపోజ్ చేయలేకపోతాడు. చివరకు ఎలాగోలా కాఫీ షాప్ నకు తీసుకెళ్తాడు. రెండు కాఫీలు ఆర్డర్ ఇస్తాడు. తన మనసులోని మాటలు చెప్పాలనుకుంటాడు కానీ.. చెప్పలేకపోతాడు. ఎంత ధైర్యం తెచ్చుకున్నా.. చివరకు హిమ ఏమనుకుంటుందో అని భయపడతాడు.
will soundarya know about sourya details in karthika deepam
మరోవైపు ఆనందరావు, సౌందర్య.. ఇద్దరూ జ్వాల ఆటో ఎక్కుతారు. ఇప్పటికైనా తన శత్రువు అడ్రస్ తెలుసుకోవచ్చని జ్వాల అనుకుంటుంది. కానీ.. వాళ్లు తన ఫ్రెండ్ జగన్నాథరావు ఇంటికి ఆటోను తీసుకెళ్లమంటారు. దీంతో తన శత్రువు జాడ తెలియడం మిస్ అయింది అని అనుకుంటుంది జ్వాల. ఆటో నడుపుతూ తన శత్రువు గురించి వివరాలు లాగే ప్రయత్నం చేస్తుంది. హిమకు పెళ్లి కాలేదని తెలుసుకుంటుంది.
నువ్వు ఇచ్చే కాఫీలో ఒక కప్పుకు హార్ట్ షేప్ వచ్చేలా చూడు అని బేరర్ కు పర్సనల్ గా చెబుతాడు ప్రేమ్. కాఫీ ఇచ్చి తనకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు ప్రేమ్. వెదర్ బాగుంది కదా.. లైటింగ్ కూడా బాగుంది అంటూ ఏదేదో మాట్లాడుతుంటాడు ప్రేమ్. దీంతో హిమకు ఏం అర్థం కాదు.
హిమను ప్రేమిస్తున్నాను అని చెప్పే విషయంలో నా మైండ్ బ్లాంక్ అయినట్టుంది అని అనుకుంటాడు ప్రేమ్. ఆహా.. ఎంత అందంగా ఉందో.. ఎలాగైనా ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు హిమకు ఐలవ్యూ చెప్పేయాలి అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు జ్వాల.. నిరుపమ్ దగ్గరికి వెళ్తుంది.
నిరుపమ్ రావాలి అని పిలవడంతో తను అర్జెంట్ గా వెళ్తుంది హాస్పిటల్ కు. ఏమైందో అని కంగారు పడుతుంది. డాక్టర్ సాబ్ నమస్తే అంటుంది. హేయ్ రౌడీ బేబీ కమ్ కమ్ అంటాడు నిరుపమ్. ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. ఏంలేదు.. మీ చిరునవ్వు బాగుంటుందని మనసులో అనుకున్నాను అంటుంది జ్వాల.
ఎందుకు రమ్మన్నారు అంటుంది. దీంతో ముసలమ్మ బాగుంది అని డిశ్చార్జ్ చేశాం అంటాడు. ముసలమ్మకు నేను రాసిచ్చిన మందులు తీసుకో అంటాడు నిరుపమ్. మీరు మందులు రాసిచ్చారు కదా.. మళ్లీ మందులు ఇవ్వడం ఏంటి అంటుంది. నేను ఇస్తే తీసుకోవా నువ్వు అంటాడు.
దీంతో.. తీసుకుంటుంది. అవి కాస్ట్ లీ మందులు. అవి నీకు కొనాలంటే ఇబ్బంది కదా అని నేను కొన్నాను అంటాడు. ఈ మందుల కోసం నేను వెళ్లి అడిగాను కానీ.. 6 వేలు అవుతాయి అన్నారు. అందుకే కొనలేదు. నా మనసు తెలుసుకొని పిలిచి మరీ మందులు ఇచ్చారు డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల.
కట్ చేస్తే.. సౌందర్య.. గీత దగ్గరికి వెళ్లి.. శౌర్య చిన్నప్పటి ఫోటోను ఇచ్చి తను ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించి బొమ్మ గీయించడానికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయానికి గీత దగ్గరికి శౌర్య వస్తుంది. సౌందర్య చేస్తున్న పనిని చూసి.. హిమ చిన్నప్పటి ఫోటోను కూడా గీయించాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.