
Devara Movie : దేవర సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ..!
Devara Movie : వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘ డెవిల్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ దేవర సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా గురించి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు.
దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అందుకే కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి తెలిపారు. తమ్ముడు సినిమా దేవర కోసం చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నామని, త్వరలోనే గ్లింప్స్ రాబోతుందని అన్నారు. త్రిబుల్ ఆర్ వంటి సినిమా చేసిన తర్వాత ఒక యాక్టర్ కి, డైరెక్టర్ కి, ప్రొడక్షన్ హౌస్ కి ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగిన ఎవరు ఊరుకోరు. తెలిసి తప్పు చేయము, బాధ్యతగా తీసుకొని ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. రేపు థియేటర్స్ లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని , మీకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం అని, అందుకోసం కాస్త సమయం పడుతుంది అని, దయచేసి ఓపిక పట్టండి అని, త్వరలోనే ఈ సినిమా డేట్ కూడా అనౌన్స్ చేస్తామంటూ దేవర టీజర్ గురించి కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక డెవిల్ సినిమా డిసెంబర్ 29న విడుదల అవుతుందని అన్నారు. మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి దానికి తగ్గ టీం వర్క్ చేసినప్పుడు ఆడియన్స్ థియేటర్ కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను దాని మీరు నిజం చేశారు. అదే కోవాలో డెఫినెట్గా డెవిల్ మంచి కథ కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయో ట్రైలర్ లో మీరు చూశారు. 1940 బ్యాక్ డ్రాప్ లో చేయాల్సిన సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేశాం. డెవిల్ సినిమా చాలా బాగుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కొత్త కథతో ఉంటుంది. బింబిసార 2 వచ్చే ఏడాది ఏప్రిల్ లో లేదా మేలో మొదలు పెడతాం అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
This website uses cookies.