Nandamuri Chaitanya Krishna : బాలయ్య బాబాయ్ ది అంత వల్గర్ క్యారెక్టర్ కాదు.. తప్పు చేస్తే బాలయ్య అయినా బజారుకు గుంజండి - నందమూరి చైతన్య కృష్ణ
Nandamuri Chaitanya Krishna : తెలుగు పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఎటువంటి గుర్తింపు వుందో అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతుంది. ఆయన కుటుంబం నుంచి రెండో తరంలో హరికృష్ణ, బాలకృష్ణ హీరోలు అయ్యారు. ఇక మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలు అయ్యారు. ఇక ఇటీవల మరో వారసుడు నందమూరి చైతన్య కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ‘ బ్రీత్ ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బసవతారకం క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి జయకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక తాజాగా చైతన్య కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాబాయ్ బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ తన బాబాయ్ పై వచ్చిన రూమర్స్ గురించి చైతన్య కృష్ణను అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన వల్గర్ గా ఉండరని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలా రూమర్స్ పుట్టిస్తున్నారు అని, ఆయన వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇమేజ్ ను డామేజ్ చేయడానికి కొందరు చూస్తున్నారు అని, ఇలాంటి రూమర్స్ ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎవరో కావాలనే రూమర్స్ పుట్టిస్తున్నారని, ఆయన రాజకీయాలలో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఆయన ఇమేజ్ను డామేజ్ చేయాలని చూస్తున్నారు, అలా ఎవరు చేసారో త్వరలోనే భయపడుతుంది, కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఆయన తప్పు చేస్తే తప్పు చేశానని చెబుతాం, ఆయన ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడుతారు తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయరు అని కృష్ణ చైతన్య అన్నారు.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనే మహిళలు ధైర్యంగా బయటికి చెప్పాలని, తప్పు చేసేది చిన్నవాడైనా పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టొద్దు అని, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి స్పై కెమెరాలను ఉపయోగించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టండి. దీనివలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ల బండారం బయటపడుతుంది. వాళ్లు కూడా భయపడతారు అని ఆయన అన్నారు. మనకు తెలిసిందే ఇటీవల తమిళ నటి విచిత్ర బాలకృష్ణ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఆమె తమిళ బిగ్బాస్ లో పాల్గొన్నారు. ఓ ఎపిసోడ్లో భాగంగా తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా బాలకృష్ణ ఆమెను కమిట్మెంట్ అడిగాడని, ఒప్పుకోకపోతే చంప పగలగొట్టాడని ఆమె చెప్పారు. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై నందమూరి చైతన్య కృష్ణ బాలకృష్ణ అలాంటివారు కాదని క్లారిటీ ఇచ్చారు.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.