
karthika deepam 04 october 2022 full episode
Karthika Deepam 04 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1474 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మౌనిత కార్తీక్ తనపై అనుమాన పడుతున్నాడని తనకి జరిగింది చెప్పాలి అని తన దగ్గరికి వెళ్లి చెప్తూ ఉంటే. కార్తీక్ ని నేను ఏమి అడగలేదు నువ్వు ఎందుకు అతను గురించి చెప్తున్నావ్. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాల తడుముకున్నట్లుగా ఎందుకు భయపడుతున్నావ్ ఏ తప్పు చేయకుండా. తప్పు చేసిన వాళ్ళే భయపడుతూ ఉంటారు.. అయినా అసలు ఆ దుర్గ ఎవరు అతను అలా చేస్తున్న నువ్వేమీ ఎందుకు అనట్లేదు అని అనగానే.. అదంతా నేను తర్వాత చెప్తా కార్తిక్ కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. అని ఏడుస్తూ నేను ఏ తప్పు చేయలేదు కార్తీక్ అని అంటూ ఉండగా.. కార్తీక్ తనకి గతంలో దీప అన్నమాటలు గుర్తుకొచ్చి ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను కాదు అని బలవంతంగా గతం గుర్తు చేసుకోవాలని ట్రై చేస్తూ ఉండగా…
అదంతా చూస్తున్న దీప ఈయన గతం బలవంతంగా గుర్తు చేసుకుంటున్నాడు డాక్టర్ అలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం ఆన్నాడు కదా.. అని అక్కడ ఉన్న బట్టలు రాక్ ని కింద పడేస్తుంది. అప్పుడు కార్తీక్ ఒక్కసారిగా గతంలో నుంచి బయటికి వస్తాడు. ఇక అప్పుడు మౌనిత కార్తీక్ రిలాక్స్ అవ్వు అని తనని లోపలికి పంపిస్తుంది. ఇక దీప అక్కడ నుంచి దుర్గ దగ్గర వచ్చి అక్కడ జరిగిందంతా చెబుతుంది. అప్పుడు నువ్వు అలా ఎందుకు చేసావు దీపమ్మ తనకి గతం గుర్తొచ్చేదే కదా అని అంటుండగా.. దీప అలా బలవంతంగా గుర్తు చేసుకుంటే డాక్టర్ ప్రాణాలకు ప్రమాదం అన్నారు. దుర్గ అని అంటుంది. అప్పుడు దుర్గ మనం బలవంతంగా ట్రై చేరుకోవడదు కానీ తను గుర్తు చేసుకోవచ్చు కదా… నువ్వు అలా ఎందుకు చేసావ్ దీపమ్మ అని అంటాడు. అప్పుడు దీప మౌనిత దానంతట అదే బయటకు పోవాలి అని అనగానే.. దుర్గ వెళ్తుంది వెళ్ళక ఏం చేస్తుంది. మనం చేస్తున్న ప్లాన్ కి నేను చేస్తున్నది తప్పు కాదు అని నిరూపించుకోవడానికి కార్తీక్ తో నేను నీ భార్యను కాదు అని చెప్తుంది అని దుర్గా అంటాడు.
karthika deepam 04 october 2022 full episode
అప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని దీప దుర్గకి ప్లాన్ అంతా చెబుతుంది. ఇక సూపర్ దీపమ్మ అంటూ ఉంటాడు. మౌనిత కార్తీక్ గతమంతా గుర్తుకొచ్చి తనని తిట్టి చంపేయాలి. అని గొంతు పట్టుకొని నిలుముతూ ఉన్నట్టుగా మౌనిత కలకంటుంది.అప్పుడు మౌనిత అలా జరగకూడదు అలా జరగనివ్వను గట్టిగా మోత్తుకోవడంతో కార్తీక్ అక్కడికి వచ్చి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావ్ అని అంటాడు. ఏం లేదు కార్తీక్ ఏదో పీడకల వచ్చింది అనగానే.. ఏది నిజమో ఏది అబద్దమో నాకు అర్థం కావడం లేదు. కానీ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి నీకన్నా బాగా ఎవరూ చెప్పరు అని కోప్పడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇక మౌనిత ఈ దుర్గా గాడి ఎఫెక్ట్ మామూలుగా పడలేదు. వాని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయాలి అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే దీప తులసి కోటకి పూజ చేస్తూ నా భర్తకి తొందరలో గతం గుర్తుకొచ్చేలా అనిపిస్తుంది. అని సంతోష పడుతూ ఉంటుంది. ఇక దుర్గా అంతలో సరుకులు తీసుకొచ్చి దీపమ్మ నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను అని చెప్తాడు. అప్పుడు దీప సంతోషిస్తూ నేను పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు అయ్యాయి అనుకునే సమయంలో నువ్వు వచ్చావు నేను చేస్తున్న ప్రయత్నానికి నా వెంటే ఉంటున్నావు ఆ దేవుడు లాగా వచ్చావు అని దుర్గాన్ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గ సీతమ్మవారికి ఆంజనేయుడు ఎలాగో నీకు నేను కూడా అలాగే అని అంటూ ఉంటాడు. ఇక మోనిత కి ఒక్క క్షణం కూడా దానికి రిలాక్స్ అవ్వనివ్వకూడదు అందుకే తన దగ్గరికి వెళ్లి ఒక డోస్ ఇచ్చి వస్తా అని అంటాడు. కట్ చేస్తే మౌనిత పకోడీ చేసుకుని తీసుకువచ్చి కార్తీక్ ఇచ్చి తినమని చెప్తుంది. అప్పుడు ఓ పకోడీలా వర్షంలో పకోడీ మస్తు కాంబినేషన్ అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత అప్పుడు కూడా అంతే మనం వర్షం పడగానే సైకిల్ మీద వెళ్లి పకోడీ తినే వాళ్ళం అని చెప్పు ఉండగా.. కార్తీక్ అప్పుడు గతం గుర్తు చేసుకుంటూ సైకిల్ మీద నేను ఒక్కడినే ఉన్నాను. నువ్వు లేవు మౌనిత అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత నువ్వు గతాన్ని అలా బలవంతంగా గుర్తు చేసుకోవద్దు. కార్తీక్ డాక్టర్ చెప్పాడు కదా అని అంటుంది.
అప్పుడు కార్తీక్ నేనేమీ బలవంతంగా గుర్తు చేసుకోవడం లేదు నువ్వు చెప్పగానే ఆ సైకిల్ మీద వెళుతున్నట్లుగా గుర్తుకొస్తుంది కానీ అందులో నువ్వు లేవు అని చెప్తూ ఉండగా.. అంతలో దుర్గ వచ్చి వర్షం పడుతుంది పకోడీ చేసి పెడతాను రమ్మని చెప్పి కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి కార్తీక్ బాబుకి పెట్టేస్తావా అని అనగానే… కార్తీక్ మౌనిత ను కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత నేను పిలవలేదు కార్తీక్ అని కార్తీక్ కి చెప్తూ ఉంటుంది. అప్పుడు దుర్గ ఇందాక ఫోన్ చేశావు కదా.. అని తన ఫోన్ కాల్స్ చూపిస్తాడు. అప్పుడు మౌనిత నేను చేయలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు చేయకపోతే నీ ఫోన్ నుంచి కాల్ ఎలా వెళ్తుంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దుర్గ అలా అడగండి సార్.. అయినా సార్ ఏం అనుకోరులే మోని అని అంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో దీప వచ్చి కార్తిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నా పుట్టినరోజు కనీసం విషెస్ కూడా చెప్పలేదు అని మౌనిత అని అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే..
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
This website uses cookies.