karthika deepam 10 january 2023 full episode
Karthika Deepam 10 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 జనవరి 2023, మంగళవారం ఎపిసోడ్ 1558 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొంగొడి దగ్గర ఉన్న తమ డబ్బులను లాక్కుంటుండగా హిమ, శౌర్య ఇద్దరూ కింద పడబోతుండగా కార్తీక్ పట్టుకుంటాడు. తమను పట్టుకుంది కార్తీక్ అని తెలుసుకొని హిమ, శౌర్య షాక్ అవుతారు. నాన్న నువ్వు ఇక్కడే ఉండి మమ్మల్ని ఇన్ని రోజులు కలుసుకోలేదా? అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అమ్మ ఎక్కడ ఉంది. అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లు నాన్న అంటారు పిల్లలు. ఏం చేయాలో అర్థం కాదు కార్తీక్ కు. దీంతో పిల్లలను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్. మరోవైపు దీపను తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది సౌందర్య. కానీ.. ముందు మీతో ఒక విషయం చెప్పాలి ఆ తర్వాత మిమ్మల్ని డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్తా అంటుంది దీప. ఏదైనా హోటల్ కు వెళ్లి మనం అక్కడ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటుంది దీప.
karthika deepam 10 january 2023 full episode
ఇంతలో సౌందర్య, దీప.. కార్తీక్, పిల్లల కంట పడతారు. దీపను చూసి పిల్లలు పరవశించి పోతారు. తనను హత్తుకుంటారు. కార్తీక్ ను చూసి సౌందర్య కూడా ఆనందిస్తుంది. అసలు ఏం జరిగింది చెప్పండి. ఇన్నాళ్లు మాకు తెలియకుండా ఎందుకు దాక్కున్నారు. అసలు ఏమైంది అని అడుగుతుంది సౌందర్య. దీంతో అమ్మ.. మీకు అన్నీ తర్వాత చెబుతా. ముందు నువ్వు వెళ్లిపో. పిల్లలను తీసుకొని వెళ్లు అంటాడు కార్తీక్. దీంతో వద్దు అంటారు పిల్లలు. అమ్మానాన్నలను అస్సలు వదలకు నానమ్మ అంటారు. అసలు మీరు ఎక్కడుంటున్నారు. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లు అంటుంది సౌందర్య. ఏంటి అలా చూస్తున్నారు. ఎలా తప్పించుకుందామన్నా. ఇక మీకు ఆ అవకాశం ఇవ్వను.. అంటుంది సౌందర్య.
కట్ చేస్తే కార్తీక్ ఇంటికి వెళ్తుంది మోనిత. చూస్తే తాళం వేసి ఉంటుంది. ఏం చేయాలి. ఎక్కడికి వెళ్లారు వీళ్లు అనుకుంటుంది. తాళం వేసి ఉంటే ఏంటి.. తాళం పగులగొట్టి ఇంట్లో కూర్చొంటా అని తాళం పగులగొట్టి లోపలికి వెళ్తుంది. ఆకలి అవుతోందని అనుకొని కిచెన్ లోకి వెళ్లి దోశ వేస్తూ ఉంటుంది.
ఇంతలో కార్తీక్, దీప, సౌందర్య, పిల్లలు అందరూ కలిసి అప్పుడే ఇంటికి వస్తారు. ఈ ఇల్లా.. నేను, అంజి కలిసి ఈ ఇంటికి వచ్చాం. తాళం వేసి ఉంది అంటుంది సౌందర్య. అసలు మీరు అప్పుడు నన్ను చూశారా? నన్ను చూసి దాక్కోవాల్సిన కర్మ మీకేంటి అంటుంది సౌందర్య.
ముందు మీరు లోపలికి రండి అంటుంది దీప. ఇంతలో తలుపు తీసి ఉండటం చూసి అనుమానంతో ఇంట్లోకి వెళ్తారు. తాళం పగులగొట్టి ఉంది. దొంగలు దూరినట్టున్నారు అనుకొని లోపలికి వెళ్తారు. తీరా చూస్తే.. అక్కడ మోనిత ఉంటుంది. మోనితను చూసి అందరూ షాక్ అవుతారు.
రా కార్తీక్.. రా దీప.. హలో ఆంటి ఎలా ఉన్నారు. హాయ్ కిడ్స్. ఏంటి అందరూ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. తాళం పగులగొట్టి ఉంటే దొంగలు పడ్డారేమో అనుకున్నారా? నేనే.. వచ్చేసరికి ఆకలి అయింది. అందుకే తాళం పగులగొట్టి దోశలు వేసుకొని తింటున్నా అంటుంది మోనిత.
అసలు నువ్వు ఎందుకు వచ్చావే.. నడవవే బయటికి అంటుంది దీప. అసలు ఇది ఇక్కడ ఎందుకు ఉంది. అంటే నా కొడుకు, కోడలు ఇక్కడ ఉన్నారని నీకు ముందే తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు. ఇన్నాళ్లు నా కొడుకు, కోడలు మా దగ్గరికి రాకపోవడానికి నువ్వేనా కారణం అంటుంది సౌందర్య.
నువ్వే వాళ్లను ఆపావు కదా. లేదంటే వాళ్లు మాకు దూరంగా ఉండరు. ఎందుకే ఇలా చేశావు అని తన జుట్టు పట్టుకుంటుంది సౌందర్య. దీంతో అబ్బా వదలండి ఆంటి. జుట్టు మొత్తం చెదిరిపోతుంది. ఇప్పటికే మీ కొడుకు నా వైపు చూడటం లేదు. జుట్టు చెదిరిపోతే అస్సలు చూడడు.
అయినా ఏం జరిగిందో మీ కొడుకు, కోడలు చెప్పే ఉంటారు కదా. ఇంకా నన్ను అడుగుతారేంటి అని అంటుంది మోనిత. చివరకు అందరినీ తీసుకొని హైదరాబాద్ కు వెళ్లిపోతుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
This website uses cookies.