Intinti Gruhalakshmi 10 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 జనవరి 2023, మంగళవారం ఎపిసోడ్ 838 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు మీద సరస్వతి సీరియస్ అవుతుంది. నా కొడుకు చంప నువ్వు పగులగొట్టావు. మరి అది అరుస్తుంటే దాని చెంప పగుల గొట్టాలా వద్దా అని దీపక్.. దాని చెంప పగులగొట్టరా? ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అంటుంది సరస్వతి. దీంతో దీపక్.. వెళ్లి కొట్టబోతాడు కానీ.. వద్దులే అని ఆపుతుంది సరస్వతి. మాకు చేతులు లేవక కాదు.. అంటుంది. సామ్రాట్ చేసిన తప్పేంటి. ట్రీట్ మెంట్ కు లేట్ అవుతుందని భర్త స్థానంలో తను సైన్ చేశాడు. దాంట్లో తప్పేముంది. లాస్య గురించి అందరికీ తెలుసు. కానీ.. నువ్వు లాస్యతో పాతికేళ్లు కాపురం చేశావు కదా.. తులసి గురించి నీకు తెలియదా? అంటూ నందు మీద సీరియస్ అవుతుంది సరస్వతి.
తులసి కళ్లు తెరిచాక మీరు తన కళ్ల ముందు కనిపించడానికి వీలు లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది సరస్వతి. దీంతో నందు, లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది సరస్వతి. తనకు ఏం చేయాలో అర్థం కాదు.. బాధపడకండి వదిన అంటుంది అనసూయ. నా కూతురు నిప్పులాంటిదమ్మా. తన మీద నిందలు వేయొద్దను అంటుంది సరస్వతి. ఒక తండ్రిగా నేను అనలేని మాటలు నువ్వు అన్నావు. ఇప్పుడు తృప్తిగా ఉందమ్మా అంటాడు పరందామయ్య. మా తులసికి బంధాలు ముఖ్యం. కుటుంబం అంతా ఒక దగ్గర ఉండాలి. అందుకే మా వాడి ఆగడాలను భరిస్తోంది అంటుంది అనసూయ. మరోవైపు అక్కడే కూర్చొని తులసి గురించి అందరూ బాధపడుతూ ఉంటారు.
దేవుడు వీళ్లిద్దరినీ ఎందుకు కలిపాడు. ఆయనకే తెలియాలి. ఇంత పవిత్రమైన స్నేహం నేను ఎక్కడా చూడలేదు. పాపం అతడు మాత్రం రాత్రంతా మెళుకవతోనే ఉండి తులసిని చూసుకుంటున్నాడు.. అని అనుకుంటుంది సరస్వతి. ఆంటి ఆ కన్నీళ్లు ఎందుకు.. తులసి గారికి ప్రమాదం తిప్పినట్టే అని డాక్టర్ గారు చెప్పారు కదా అంటాడు సామ్రాట్.
దీంతో మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఆరాటపడుతున్నావు అని అంటుంది సరస్వతి. నేను తల్లిగా తులసికి జన్మనిస్తే.. స్నేహితుడిగా నువ్వు పునర్జన్మనిచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు అంటుంది సరస్వతి. ఒక స్నేహితుడిగా తులసి గారు నా బాధ్యత. మా రిలేషన్ తనకు బరువు కాకూడదు. అందుకే మీ గొడవలోనూ నేను దూరలేదు అంటాడు సామ్రాట్.
తులసి గారికి స్పృహ వచ్చింది. మీరంతా వెళ్లి చూడొచ్చు.. అని డాక్టర్ చెబుతుంది. దీంతో తనను చూడటానికి అందరూ లోపలికి వెళ్తారు. కానీ.. సామ్రాట్ కోసం చూస్తుంది. సామ్రాట్ మాత్రం తనను చూడకుండా బయటే ఉండిపోతాడు. మీకు కొంచెం దూరంగా ఉండటమే బెటర్ అనిపిస్తోంది అని అనుకుంటాడు.
మరోవైపు ప్రేమ్, అభి, అంకిత, శృతి.. నలుగురు తప్పు చేశాం అని తులసి కాళ్లు పట్టుకుంటారు. మొబైల్ డిస్టర్బ్ గా ఉంటుందని సైలెంట్ మోడ్ లో పెట్టి దూరంగా ఉంచాం. ఇంత జరుగుతుందని మేము అనకోలేదు. ఇంకెప్పుడు అలా చేయం. మమ్మల్ని క్షమించండి అని అంటారు.
మామయ్య మమ్మల్ని బాగా తిట్టారు అంటాడు ప్రేమ్. దీంతో ఏరా నా పిల్లలను తిట్టావా అంటుంది తులసి. ఇప్పుడు టెన్షన్ తగ్గిందా అంటుంది. తన వాళ్లందరూ పక్కనే ఉన్నారు. ఇక నా అవసరం ఏంటి అని అనుకుంటాడు సామ్రాట్. కట్ చేస్తే లాస్య, నందు ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు.
నందుకు ఎనలేని కోపం వస్తుంటుంది. మా అమ్మ, నాన్న, నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు అందరూ నా చుట్టూ ఉన్నారు కానీ.. నాకు సపోర్ట్ ఇవ్వాల్సిన సమయంలో ఏ ఒక్కరూ ఇవ్వలేదు అంటాడు నందు. దీంతో మనం ఒక పని చేద్దాం నందు. నా పేరు తులసి, నీ పేరు సామ్రాట్ గా మార్చుకుందాం. అప్పుడు ఎంత తప్పు చేసినా వాళ్లు ఏమనరు అంటుంది లాస్య.
మనం ఏం చేసినా వాళ్లకు నచ్చడం లేదు నందు అంటుంది లాస్య. దీంతో అర్జెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం లాస్య అంటాడు నందు. కానీ.. ఏం చేస్తాం. బిజినెస్ కోసం హాండ్ లోన్ ఇస్తా అన్న నా ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది అంటుంది లాస్య. దీంతో ఎలా అని అనుకుంటాడు నందు.
ఇప్పుడెలా.. అందరి ముందు ఎంతో గొప్పగా చెప్పాను. ఇప్పుడు నా పరువు పోయినట్టే కదా అంటాడు నందు. దీంతో నువ్వు ఓకే అంటే నీకు ఒక సొల్యూషన్ చెబుతాను. ఈ ఇంటిని తాకట్టు పెట్టడం అంటుంది లాస్య. నేను అమ్ముదామని అనలేదు కదా.. సంవత్సరం లోపు అప్పు తీర్చుకోవచ్చు అంటుంది.
ఇల్లు ఎలాగూ నా పేరు మీదనే ఉంది కదా. ఈ ఇంటి మీద హక్కు మనమీదే ఉంది అంటుంది లాస్య. ఈ బిజినెస్ కూడా వదులుకుంటే నీకు అసలు ఎలాంటి విలువ ఉండదు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నువ్వే నిర్ణయించుకో అంటుంది లాస్య. దీంతో ఈ ఇల్లు తాకట్టు పెడదాం లాస్య అంటాడు నందు.
దీంతో లాస్య కూడా సంతోషిస్తుంది. కట్ చేస్తే తులసిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఆంటీ కోసం కాఫీ తీసుకొచ్చా అంటుంది శృతి. దీంతో తులసిని నిద్ర లేపుతారు. తులసి మెల్లగా లేస్తుంది. మీరంతా పనులు మానుకొని నా చుట్టూ ఎందుకు ఉండాల్సిన అవసరం ఏముంది అంటుంది తులసి.
దీంతో మాకు ఏదైనా అయితే.. నువ్వు కూడా పనులు మానుకొని కూర్చొంటావు కదా అంటారు అందరూ. సరే అయితే నేను ఆఫీసుకు వెళ్తాను అంటుంది తులసి. మీరంతా ఎవరి డ్యూటీలకు వారు వెళ్లండి. లేకపోతే నేను ఆఫీస్ కు వెళ్లాల్సి వస్తుంది అంటుంది తులసి.
ఇంతలో నేను మీకు, దీపక్ కు సారీ చెప్పాలి అంటాడు సామ్రాట్. కన్సెంట్ ఫామ్ లో తులసి గారికి భర్తగా నేను సైన్ చేశాను. ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు అంటాడు సామ్రాట్. గొడవ చేయాలనుకున్న వాళ్లు ఎలాగైనా చేస్తారు అంటాడు దీపక్. కల్మషం నిండిన మనుషులకు ఎప్పుడు అలాంటి ఆలోచనలే ఉంటాయి అని చెబుతుంది తులసి.
కన్సెంట్ ఫామ్ లో మీరు భర్తగా నా పేరు రాస్తే.. మీకు నేను ఎప్పుడో భార్యను అయిపోయాను అంటుంది తులసి. యాక్సిడెంట్ అయి హనీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీలాగే నేను తల్లి సైన్ చేశాను. అప్పుడెవ్వరూ అడగలేదు కదా. నా మనసుకు తెలుసు నేను ఎంత పవిత్రమో. నా మనసుకు తెలుసు.. హద్దులు దాటని మన స్నేహం గురించి అంటుంది తులసి.
దేవుడు మాకు గొప్ప బహుమతి ఇచ్చాడమ్మా. నీ కడుపున పుట్టేలా చేయడం అంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
This website uses cookies.