Karthika Deepam 12 March Today Episode : బతికే ఉన్న హిమ.. హిమపై కక్ష పెంచుకున్న శౌర్య.. కారు లోయలో పడుతుండగా హిమను బయటికి నెట్టేసిన దీప

Karthika Deepam 12 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 1298 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, నా మధ్య బంధం చాలా పవిత్రమైనది. ఆ బంధానికి ఆస్తులు, అంతస్తులు ఏవీ అవసరం లేదు అంటుంది. ప్రేమకు ప్రేమ తోడుంటే చాలు అంటుంది. అంతకుమించి ప్రేమ్ ఎప్పుడూ ఏమీ కోరుకోదు. కార్తీక్ మీద నాకున్న ప్రేమ్ ఈరోజు తను లేడు కదా అని కరిగిపోదు. నాతోనే ఉంటుంది. నేను చచ్చేంతవరకు నాతోనే ఉంటుంది. చివరిగా ఒక్కమాట. కార్తీక్ ను నాతోనే ఉండనిచ్చి ఉంటే.. ఈరోజు అలా ఫోటోలో కాకుండా నా గుండెల్లో భద్రంగా క్షేమంగా ఉండేవాడు అంటుంది మోనిత. దీపతో ఉన్నాడు కాబట్టే.. ఇదిగో ఇలా దీపం ముందు ఫోటోలో మిగిలిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

karthika deepam 12 march 2022 full episode

కట్ చేస్తే.. ఇంద్రుడు ఆసుపత్రికి వెళ్తాడు. డాక్టర్ దగ్గర చెకప్ చేయిస్తాడు. మందులు ఇస్తాడు డాక్టర్. దీంతో వాటికి ఎంతవుతుంది అని అడిగితే వెయ్యి అవుతుంది అంటాడు. మళ్లీ ఇప్పుడు వెయ్యి రూపాయల కోసం ఎవరి జేబు కొట్టాలా అని ఆలోచిస్తాడు. చంద్రమ్మ మళ్లీ దొంగతనం చేస్తావా అంటుంది. ఇంతలో ఓ వ్యక్తి దగ్గర డబ్బులు చూస్తాడు ఇంద్రుడు. వెంటనే అక్కడికి వెళ్తాడు. సార్.. ఎండలు బాగా మండుతున్నాయి కదా సార్ అంటాడు. మాట మార్చే ప్రయత్నం చేస్తాడు. ఎండాకాలం ఎండలు కొట్టక ఇంకేం కొడతాయి అంటాడు. మీరు భలే జోక్ చేస్తారు సార్ అంటూనే జేబులోని పర్సును కొట్టేస్తాడు. ఆ తర్వాత అందులోనుంచి వెయ్యి రూపాయలు తీసుకొని పర్సును కింద పడేస్తాడు.

మరోవైపు శౌర్య.. ఇంట్లో ఉన్న హిమ ఫోటోలను అన్నింటినీ పడేస్తుంది. తన పుస్తకాలను, వస్తువులను అన్నింటినీ పడేస్తుంది. తన వస్తువులు ఏవీ ఈ ఇంట్లో ఉండకూడదు అంటుంది శౌర్య. దీంతో హిమ ఏం తప్పు చేసింది అని అడుగుతారు.

హిమ.. అమ్మానాన్నను చంపేసింది అంటుంది శౌర్య. దీంతో హిమ చంపేయడం ఏంటి అని షాక్ అవుతారు కుటుంబ సభ్యులు. అవును నానమ్మ హిమ మొండిగా తయారైంది అంటుంది శౌర్య. నేను డ్రైవింగ్ చేస్తా అంటూ తను డ్రైవింగ్ చేసింది కాబట్టే ఈరోజు అమ్మానాన్న నాకు లేకుండా పోయారు అని అంటుంది శౌర్య.

దాని మొండితనమే అమ్మానాన్నల ప్రాణం తీసింది అంటుంది శౌర్య. అది డ్రైవింగ్ చేయకపోతే ఈరోజు ఎంత బాగుండేది అని అంటుంది శౌర్య. హిమ చేసిన పనికి ఈరోజు నేను అమ్మానాన్న లేని అనాథను అయ్యాను అంటుంది. దీంతో అది కాదురా రౌడీ అని సౌందర్య అన్నా వినదు.

Karthika Deepam 12 March Today Episode : కళ్లు తెరిచిన హిమ

నన్ను ఇక నుంచి రౌడీ అని ఎవ్వరూ పిలవద్దు.. నా అల్లరైనా.. నేను రౌడీని అయినా అమ్మానాన్న ఉన్నంత వరకే. అమ్మానాన్నలతో పాటే ఆ శౌర్య చచ్చిపోయింది. అమ్మనాన్న లేరు.. ఎప్పటికీ రారు అనే నిజాన్ని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నానమ్మ అంటుంది శౌర్య.

ఏడవకురా అంటుంది సౌందర్య. అన్నీ మరిచిపోయి మారిపోవాలి అంటుంది. నువ్వెప్పుడూ రౌడీ లాగే ఉండాలి అంటుంది. దీంతో నా వల్ల కాదు నానమ్మ. ఇక నేను ఎప్పటికీ అలా కాలేను అంటుంది రౌడీ. నా కళ్లారా చూశాను నానమ్మ అంటుంది శౌర్య.

అమ్మను, నాన్నను కారులోనే బూడిద చేసేసింది అది అంటుంది శౌర్య. చనిపోయింది అమ్మానాన్న మాత్రమే కాదమ్మా.. హిమ కూడా అంటాడు ఆనంద రావు. దీంతో ఉంది తాతయ్య.. హిమ బతికే ఉంది అంటుంది శౌర్య. దీంతో వాళ్లు షాక్ అవుతారు.

ఉంది అని ఎలా చెబుతున్నావే అంటుంది సౌందర్య. హిమ బతికే ఉంటుందని నా నమ్మకం అని అంటుంది శౌర్య. హిమ కూడా కారులోనే ఉందిగా అని ఆదిత్య అంటే.. ఉన్నా చనిపోదు అంటుంది శౌర్య. అమ్మానాన్న చావుకు కారణమై తను పెద్ద తప్పు చేసింది. ఆ పాపం ఊరికే పోతుందా అంటుంది శౌర్య.

పాపి చిరాయువు అని అంటారు కదా. అదే నా నమ్మకం. అది ఎక్కడో బతికే ఉంటుంది అంటుంది శౌర్య. ఇంతలో హిమ కళ్లు తెరుస్తుంది. కారు లోయలో పడిపోవడం గుర్తుకు తెచ్చుకుంటంది. అప్పుడే తనను దీప కారులో నుంచి బయటికి నెట్టేస్తుంది. హిమ.. శౌర్య జాగ్రత్త అమ్మ అని కార్తీక్, దీప ఇద్దరూ చెప్పడం గుర్తు చేసుకుంటుంది.

అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంద్రుడు, చంద్రమ్మ తన దగ్గరికి వస్తారు. అమ్మానాన్న అంటూ ఉండటం చూసి సంతోషిస్తారు. దేవుడి దయ వల్ల బిడ్డ కళ్లు తెరిచిందయ్యా అంటుంది చంద్రమ్మ. అవును చంద్రమ్మ బిడ్డకు ఏమైందోనని భయపడ్డాను అంటాడు ఇంద్రుడు.

నేను ఎక్కడున్నాను. శౌర్య ఎక్కడ.. అమ్మానాన్న ఎక్కడున్నారు అంటుంది హిమ. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. మా అమ్మ ఏది.. మా నాన్న ఏడి.. మా శౌర్య ఏది అని అడుగుతుంది. దీంతో నువ్వు మాకు లోయలో చెట్టుకు చిక్కుకొని కనిపించావమ్మా అంటాడు ఇంద్రుడు.

అవునమ్మ… రంగు రాళ్ల కోసం అని మేము అక్కడికి వెళ్తే నువ్వు మాకు కనిపించావు అని చెబుతుంది ఇంద్రమ్మ. దీంతో ఆ సంఘటనను గుర్తు చేసుకుంటుంది హిమ. నువ్వు అలా కనిపించేసరికి మా గుండెలు ఆగిపోయాయమ్మా. దేవుడి దయవల్ల కళ్లు తెరిచావు. అసలు ఏమైందమ్మా అని అడుగుతుంది చంద్రమ్మ.

దీంతో మొత్తం చెబుతుంది హిమ. దీంతో ఇంద్రుడు, చంద్రమ్మ షాక్ అవుతారు. తర్వాత తనకు అన్నం తీసుకొచ్చి తినిపించబోతుంది చంద్రమ్మ కానీ.. హిమ తినదు… ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

4 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

4 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

6 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

7 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

8 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

9 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

10 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

10 hours ago