Karthika Deepam 12 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1195 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు నా బతుకు ఏంది. నేనేంటి. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. నేను ఎవరికీ అవసరం లేదు.. అని రోడ్డు మీద నడుచుకుంటూ దీప ఏడుస్తూ అనుకుంటుంది. ఇంతలో తనకు పిల్లలు గుర్తుకు వస్తారు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. వాళ్లకు అయినా అందరూ ఉన్నారు. వాళ్లకు నాతో పనేంటి.. అని అనుకుంటుంది దీప.ఇంతలో ఓ చెట్టు కింద కూర్చొని మోనిత గురించి ఆలోచిస్తుంటుంది దీప. అవును.. ఇదే కరెక్ట్ అని అనుకుంటుంది. ఎక్కడికో బయలుదేరుతుంది. ఆటోను ఆపి ఓ చోటుకు తీసుకెళ్లు అని చెబుతుంది దీప.
కట్ చేస్తే మోనిత ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ప్రియమణి.. నేను గెలిచాను. అంతా అయిపోయింది. ఇంకా కొసరు మాత్రమే మిగిలి ఉంది. విజయోస్తు మోనిత.. విజయోస్తు. ఎక్కడ మొదలైన కథ.. ఎన్ని మలుపులు తిరిగింది. నా ప్రేమ కథ చాలా గొప్పది ప్రియమణి.. అంటుంది మోనిత. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది అంటుంది మోనిత.దీప ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం.. నేను ఆ ఇంట్లోకి కాళ్లు పెట్టడం.. అంతే ఇక మిగిలింది అని ప్రియమణితో మోనిత అంటుండగానే.. దీప అక్కడికి వస్తుంది. దీపను చూసి మోనిత షాక్ అవుతుంది. ప్రియమణి.. దీప నిజంగానే ఇక్కడికి వచ్చిందా. నేను నమ్మలేకుండా ఉన్నానే అని అనుకొని ఆశ్చర్యపోతుంది. ఇది నిజమేనా అనుకుంటుంది. చేతిని గిల్లి చూసుకుంటుంది.
వెల్ కమ్, స్వాగతం అని చెప్పడానికి రెడ్ కార్పెట్ లేదు. బ్యాండ్ బారత్ లు అరెంజ్ చేయడానికి అంత సమయం లేదు. సారీ దీపక్క ఏమీ అనుకోకు అంటుంది మోనిత. అవును దీపక్క ఏంటి ఇలా వచ్చావు. రణమా? రాయబారమా? అంటూ హేళన చేస్తుంది. నాకు తెలుసు దీపక్కా నువ్వు వస్తావని. అన్ని దిక్కులు మూసుకుపోయి.. ఏ దిక్కూ లేక ఈ చెల్లి దగ్గరికి వచ్చావా అక్క… కొంపదీసి కాళ్లబేరానికి వచ్చావా? అనగానే మోనిత ఒళ్లు దగ్గర పెట్టుకో అంటుంది దీప.కార్తీక్ కోసం నేను పిచ్చిదానిలా తిరిగా. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఏమైంది దీపక్క.ఏం తిట్టావు దీపక్కా. ఎంత హింస పెట్టావు. ఎందుకు.. నీకు మొగుడు ఉన్నాడు. నాకు లేడని అంతే కదా. ఇప్పుడు ఏమైంది దీపక్క. సీన్ సితార అయింది కదా…
అంతా తారుమారు అయిపోలా. కార్తీక్ తో బిడ్డను కన్నాను. పేగు మెడలో వేసుకొని పుట్టినందుకు పూజ చేయించాను. దోష నివారణ పూజ చేయించాను అంటుంది మోనిత.దీంతో నా దోషాలు కూడా పోయాయి. నా కార్తీక్ తో అత్తగారి సమక్షంలో పూజ జరిగింది. ఇంకేముంది దీపక్క నీకు. క్లోజ్. అంతా క్లోజ్ అంటుంది. జైలుకు వెళ్లేముందు ఏం చెప్పానో గుర్తుందా దీపక్కా.. అంటూ జైలుకు వెళ్లేముందు చెప్పింది గుర్తుకు తెస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ అయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అవుతోంది. ఆల్ మోస్ట్ అయిపోయింది. నా సినిమాకు శుభం కార్డు పడబోతోంది అంటుంది మోనిత.నీ సినిమా ప్లాఫ్ దీపక్కా. మోనిత, కార్తీక్ ల ప్రేమాయణం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తావు అక్క. ఏ నుయ్యో.. గొయ్యో అనబోతుండగానే.. మోనిత అంటూ సీరియస్ అవుతుంది దీప. ఇప్పుడు నువ్వు అరిచి పెడబొబ్బలు పెట్టినా ఏం చేయలేవు. అసలు నీకు మాట్లాడటానికి ఏం మిగిలిందని. నీకు బలం లేదు. బలాన్ని, బలగాన్ని నేను లాగేసుకుంటున్నాను అంటుంది మోనిత.
అసలు నీ ప్లాన్ ఏంటి దీపక్క. నీ ఫ్యూచర్ ఏంటి. ఎక్కడికి వెళ్తావు. ఏం చేసి బతుకుతావు. అయినా నువ్వు వంటలక్కవు కదా. మళ్లీ పాత జీవితాన్ని మొదలు పెడుతావా? అని దీపను హేళన చేస్తుంది మోనిత. మిక్సర్ గ్రైండర్ కు నేను హెల్ప్ చేస్తానులే. ఎంతైనా అక్కవు కదా. ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా అంటుంది మోనిత.వాళ్లకు తెలియకుండా ఫోటోలు తీశావు కదా ప్రియమణి.. అంటుంది. ఏంటి దీపక్కా.. వచ్చి ఇంతసేపు అయింది. నేను వాగుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. కొంపదీసి షాక్ అయ్యావా? నీ కథ కంచికే ఇక. నేను కార్తీక్ ఇంటికి. శుభం కార్డు పడింది దీపక్క అంటుంది మోనిత.దీంతో మోనితను పక్కకు నెట్టి.. కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది దీప.
పర్లేదు.. ఇల్లు బాగానే సర్దుకున్నావు. జైలు కూడు నీకు బాగానే వంటబట్టినట్టుంది. ఇంతసేపు ఆగకుండా బాగానే మాట్లాడావు. అరిచి అరిచి గొంతు ఎండిపోయిందేమో పాపం.. ప్రియమణి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు.. అంటుంది దీప.ఇంకేంటి సంగతులు మోనిత. నీ ఆరోగ్యం బాగానే ఉందా? బాగానే కనిపిస్తున్నావులే. ఏంటలా చూస్తున్నావు మోనిత. నేనే కదా నీ దీపక్కను. నువ్వే అన్నావు కదా.. దేవుడు ఇచ్చిన అక్క అని కూర్చో. కూర్చో మోనిత… నా ముందు అలా నిలుచొని గౌరవం ఇవ్వాల్సిన పని లేదు కూర్చో అంటుంది దీప.ఇందాక ఏదో కథ కంచికి అన్నావు కదా. దాని గురించి తర్వాత కానీ.. ముందు నీకు ఒక పిట్ట కథ చెబుతాను వినవా. నువ్వు కూడా విను ప్రియమణి. నీకు కూడా ఉపయోగపడుతుంది అంటుంది దీప.
అనగనగా ఒక రాజు.. వేటకు వెళ్తున్నాడట. దారిలో ఒక వ్యక్తి వచ్చి రాజా రాజా ఈరోజు బాగా వర్షం కురుస్తుంది వేటకు వెళ్లొద్దు అన్నాడట. ఇది వర్షాకాలం ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతాయి. తప్పుకో అని చెప్పి వేటకు వెళ్లాడట.రాజు గారు వేటకు వెళ్లేసరికి బాగా వర్షం పడిందట. దీంతో రెండు రోజులు రాజు గారు అడవిలోనే ఉండాల్సి వచ్చిందట. వర్షం తగ్గిన తర్వాత రాజు గారు తన రాజ్యానికి వచ్చి వర్షం పడుతుందని ముందే చెప్పిన వ్యక్తిని పిలిపించాడట. ఒరేయ్ వర్షం కురుస్తుందని నీకు ఎలా తెలుసు అని అడిగాడట. రాజా.. నా దగ్గర ఒక గాడిద ఉంది. దాని చెవులు టపటపా కొట్టుకుంటే వర్షం వస్తుంది. ఆరోజు కూడా అలాగే గాడిద చెవులు టపటపా కొట్టుకుంది. అందుకే మీకు చెప్పాను అన్నాడట. ఇంకేముంది. రాజుగారికి ఆ గాడిద నచ్చింది.
దాంతో ఆ గాడిదను తన మంత్రిగా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ రాజ్యంలో ప్రతి గాడిద మంత్రి కావాలని ఆశపడిందట. ఆశ పడటానికి అడ్డగాడిదలకు అడ్డూఅదుపు ఏముంటుంది చెప్పు. నువ్వూ ఆశపడుతున్నావు కదా. ఏంటి మోనిత లేచి నిలుచుకున్నావు. కథ బాగా అర్థం అయినట్టుంది. నీ కథ కంచికి చేరిందని నువ్వు అనుకోగానే సరిపోదు దేవుడు ఇచ్చిన చెల్లెమ్మ.. నేను అనాలి. శుభం కార్డు పడలేదు పడదు కూడా.. అంటుంది దీప. దిక్కు లేదని…. దారులు మూసుకుపోయాయని అన్నావు కదా. ఏం చేసి బతుకుతావు.. వంట చేసుకుంటావా? వంటలక్క అన్నావు కదా. అవును నేను వంటలక్కనే. ఏ వంటలో ఎంత మసాలా వేయాలి. ఎంత ఉప్పుకారం సరిపోతుందో నాకు బాగా తెలుసు మోనిత. జీవితంలో ఎవరికి ఎంత ఇవ్వాలో.. ఎవరికి ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు.. అని మోనితకు వార్నింగ్ ఇస్తుంది దీప.
Uttam Kumar Reddy : తెలంగాణ Telangana నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
turmeric : పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. వివిధ రకాల వంటకాలలో, చర్మానికి సంబంధించిన సౌందర్య టిప్స్ లో పసుపుని…
Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో andhra pradesh చంద్రబాబు రాజకీయ వారసత్వం గురించి జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు…
M Parameshwar Reddy : దావోస్ davos పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న CM Revanth reddy సీఎం రేవంత్…
Nutmeg Water : మనం ఆరోగ్యం విషయంలో ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటాం. అలాగే ఆయుర్వేదంలో మూలికలు ఎన్నో ఉన్నాయి.…
Minister kondapalli Srinivas : టిడిపి TDP యువనేత IT Minister Nara Lokesh ఐటి శాఖ మంత్రి నారా…
Silk Smitha : సినీ నటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సిల్క్ స్మిత Silk Smitha…
This website uses cookies.