karthika deepam 13 october 2021 full episode
Karthika Deepam 13 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 13 అక్టోబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 1169 లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను తాకొద్దు అంటోంది. నా మాట కూడా వినడం లేదు.. అంటూ కార్తీక్ బాధపడతాడు. మరోవైపు హిమ, శౌర్య.. ఇద్దరూ తమ రూమ్ లో కూర్చొని బాధపడుతుంటారు. హిమ.. ఒక్కోసారి మనం అనుకున్నదే కరెక్ట్ కాకపోవచ్చు కదా. నాన్న గురించి మనం అనుకునేది కరెక్ట్ కావాలని ఏమున్నది చెప్పు అంటుంది శౌర్య. అయ్యో శౌర్య.. నేను ఆసుపత్రిలో విన్నదంతా నీకు చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నేను హాస్పిటల్ కు వెళ్లినప్పుడు వాళ్లు నన్ను చూడలేదు.
karthika deepam 13 october 2021 full episode
నన్ను ఎవ్వరూ చూడలేదు అంటే అది నిజం అన్నట్టే కదా. మరి.. మోనిత ఆంటి అన్నేసి మాటలు అంటుంటే ఎందుకు మీ నాన్న ఒక్క మాట అనలేదు అంటుంది. ఏయ్.. మా నాన్న ఏంటి మా నాన్న.. మన నాన్న కదా అని అంటుంది శౌర్య.నాకు నాన్నా అని పిలవాలని లేదు అంటుంది హిమ. హాస్పిటల్ లో మాట్లాడుకున్న మాటలను బట్టి అమ్మను మోసం చేశాడని అర్థం అయింది. అమ్మ గురించి కూడా ఒకసారి ఆలోచించు. పాపం.. అమ్మ మళ్లీ వంటలక్కగా మారుతుందేమో.
నేను ఎక్కువ ఏడుస్తానేమో కానీ అనవసరంగా ఏడవను శౌర్య. ఇది నిజం కాబట్టి బాధేస్తోంది. ఏడుపు వచ్చేస్తుంది. మోనిత ఆంటి జైలు నుంచి వచ్చాక అమ్మను కాదని తనను పెళ్లి చేసుకుంటే అప్పుడు మళ్లీ మనం ఎప్పటిలాగే విజయవాడలోనో.. విజయనగరంలోనో ఉండాలా? ఇవన్నీ నువ్వు ఆలోచించలేదు కదా.. అనగానే హిమ ఆలోచిస్తేనే భయమేస్తుంది అంటుంది హిమ. అసలు.. అమ్మ మీద నాన్నకు ప్రేమ ఉందో లేదో.. అంటుంది హిమ.
కార్తీక్.. అమెరికా వెళ్తున్నాడని తెలుసుకున్న మోనిత అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. అమెరికా వెళ్తారా? ఎలా వెళ్తారు.. అస్సలు వెళ్లనివ్వను అని అంటుంది. అలా ఎలా వెళ్తారు సుకన్య అని అడుగుతుంది మోనిత. ఒకవేళ మీరు అమెరికా వెళ్దామన్నా మీకు వీసా రాదు.. అనుమతులు కూడా ఉండవు మేడమ్ అంటుంది సుకన్య. అవును అదే వాళ్ల ధైర్యం.. ఏం చేయాలి.. ఏదో ఒకటి చేసి వాళ్లను ఆపేయాలి.. ఇంతకీ ఆ అమెరికా ఐడియా ఎవరు ఇచ్చారట అనగానే ఆదిత్య అంట మేడమ్ అంటుంది. ఒకవేళ వాళ్లు అమెరికా వెళ్తే నన్ను కార్తీక్ మరిచిపోతాడు. వాళ్లను సిటీ దాటనివ్వకూడదు. దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తుంటుంది మోనిత.
karthika deepam 13 october 2021 full episode
దీప.. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుండగానే అక్కడికి హిమ, శౌర్య.. ఇద్దరూ బ్యాగులు సర్దుకొని అక్కడికి వస్తారు. ఏంటి.. బ్యాగులు పట్టుకొని వచ్చారు అని అడుగుతుంది. పిల్లలు ఏదేదో వాగుతుంటారు. దీంతో పిల్లల మీద సీరియస్ అవుతుంది దీప. వేలడంత లేరు కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు అమ్మా. నువ్వు వంటలక్కగానే బాగున్నావు. ఈ డాడీ మాకొద్దు అమ్మ అని చెబుతుంది. పదా అమ్మా.. వెళ్లిపోదాం అంటారు పిల్లలు. ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు.
బ్యాగులు సర్దుకొని వెళ్లిపోతున్నారా? నాన్న మీకు వద్దా.. మీకు దండం పెడతాను అనగానే దీప కోపంతో పిల్లలను ఇంట్లోకి లాక్కెళుతుంది. ఇంతలో ఆదిత్య వచ్చి.. ఎందుకు అన్నయ్య ఇవన్నీ బాధలు.. ముందు యూఎస్ వెళ్లిపోండి అని చెబుతాడు. అక్కడే డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకో అని చెబుతాడు ఆదిత్య. ఇంతలో హిమకు చాలా జ్వరం వస్తుంది. ప్రియమణి.. తనకు సేవలు చేస్తున్నట్టుగా చేస్తూ ఏదో ప్లాన్ చేస్తుంది. మోనిత, డాడీ ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా. వాళ్ల గురించి నీకెందుకు అమ్మా.. అంటూ అనబోతుండగానే అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.