Karthika Deepam 14 Feb Today Episode : మళ్లీ డాక్టర్ గా కార్తీక్.. తన లైసెన్స్ కోసం కష్టపడ్డ మోనిత.. కార్తీక్ ఇంట్లో తన కొడుకు ఆనంద్ ను మోనిత చూస్తుందా?

Karthika Deepam 14 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1275 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, దీప ఇద్దరూ పెళ్లి కొడుకు, పెళ్లికూతురులా రెడీ అవుతారు. దీప, కార్తీక్ ఇద్దరూ సిగ్గుపడతారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు వంటలక్క అంటాడు కార్తీక్. అమ్మ.. నువ్వు నాన్నకు శుభాకాంక్షలు చెప్పవా అని అడుగుతారు పిల్లలు. దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు డాక్టర్ బాబు అంటుంది దీప. అందరూ సంతోషంగా ఉంటారు. ఇద్దరికీ పెళ్లి బొట్లను పెడుతారు సౌందర్య, శ్రావ్య. పిన్ని బాబాయికి కూడా పెట్టు అంటుంది శ్రావ్య. ఇంతలో ముహూర్తానికి సమయం మించిపోతోంది అంటాడు పంతులు. దీంతో ఇద్దరినీ పీటల మీద కూర్చోబెడతారు.

karthika deepam 14 february 2022 full episode

మరోవైపు కార్తీక్ నీకు తెలుసా అని మహేశ్ ను మోనిత అడుగుతుంది. దీంతో ఏం చెప్పడు మోనిత. ముందు చెప్పు అంటుంది. తెలిస్తే తెలియకపోతే మీకెందుకు చెప్పాలి అంటాడు మహేశ్. తెలుసా అంటే తెలియదు. తెలియదు అంటే తెలుసు అంటాడు. దీంతో మోనితకు కోపం వస్తుంది. చెప్పు.. ఎక్కడైనా చూశావా అని అడుగుతుంది మోనిత. ఒరేయ్ చెబుతావా లేదా అని బెదిరిస్తుంది మోనిత. ఈ సార్ ఫోన్ పడేసుకోవడం నేను చూశాను మేడమ్. అప్పటి నుంచి మొదలైంది మేడమ్ నాకు డబ్బుల వర్షం అంటాడు. దీంతో తనకు అన్నీ గుర్తొస్తాయి. నువ్వు మహేశ్ వి కదా. నీకు అకౌంట్ లోకి డబ్బులు పంపించింది నేనే అంటుంది మోనిత. మీరేనా.. మేడమ్ మీరు దేవత అంటాడు. ఇంకో దేవత కూడా ఉంది మేడమ్. పెద్ద దేవత అని చెప్పి.. సౌందర్య గురించి చెబుతాడు మహేశ్.

సార్ వాళ్లు వాళ్ల ఇంటికి వచ్చేశారని పెద్ద మేడమ్ నాకు ఫోన్ చేసి చెప్పారు అంటాడు మహేశ్. దీంతో మోనిత ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఒరేయ్ నువ్వు నిజమే చెబుతున్నావా అని అంటుంది మోనిత. అవును మేడమ్ నిజం.. అంటాడు మహేశ్.

దీంతో మోనిత తబ్బిఉబ్బిబ్బైపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. కార్తీక్ ను చూసి ఎన్ని రోజులు అయింది. నేను మంచిగా రెడీ అయి వెళ్తా అని అనుకుంటుంది మోనిత. మరోవైపు భారతి, తన భర్త.. ఇద్దరూ కారులో వెళ్తుంటారు. అంజలి ఫంక్షన్ ఎలా జరిగింది అని అడుగుతాడు రవి.

బాగానే జరిగింది. మోనిత వచ్చింది నాతోటి అంటుంది భారతి. మోనిత నిన్నేమన్నా ఇబ్బంది పెట్టిందా అని అడుగుతాడు రవి. అవును.. నువ్వు ఏదో గుడ్ న్యూస్ చెబుతా అన్నావు కదా అంటుంది భారతి. గుడ్ న్యూస్ కానీ.. ఇప్పుడు చెప్పలేను అది. తర్వాత చెబుతా అంటాడు రవి.

Karthika Deepam 14 Feb Today Episode : కార్తీక్, దీప పెళ్లి జరుగుతుండగా మోనిత ఎంట్రీ

మరోవైపు బంధువులు అందరూ వస్తారు. అంగరంగ వైభవంగా.. కార్తీక్, దీప పెళ్లిని ఘనంగా జరిపిస్తుంది సౌందర్య. కార్తీక్ దీప మెడలో తాళి కడతాడు. అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడే మోనిత ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్, దీప పెళ్లికి భారతి, రవి కూడా వస్తారు.

మోనిత వాళ్లను చూసి చప్పట్లు కొడుతుంది. మోనిత చప్పట్లు కొట్టడం అందరూ చూసి షాక్ అవుతారు. కానీ.. మోనిత ఏం మాట్లాడదు. తర్వాత కార్తీక్, దీప.. సౌందర్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. చల్లగా ఉండండి అని దీవిస్తుంది సౌందర్య.

అందరూ ఆశీర్వదించండి అని అందరికీ అక్షింతలు ఇస్తుంది సౌందర్య. పిల్లలు అందరినీ భోజనానికి తీసుకెళ్లండి అని చెబుతుంది సౌందర్య. అందరూ భోజనానికి వెళ్లండి అని అంటుంది సౌందర్య. పంతులు గారు మీరు కూడా భోజనం చేసి రండి అంటుంది సౌందర్య.

భారతి, రవి ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు. కార్తీక్.. మీ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఒక గిఫ్ట్ అంటాడు రవి. కార్తీక్.. ఈ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈరోజు కార్తీక్.. మళ్లీ డాక్టర్ కార్తీక్ అవుతాడు అని చెబుతాడు రవి. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు.

డాక్టర్ గా నువ్వు మళ్లీ ప్రాక్టీస్ చేయొచ్చంటూ ఇస్తున్న ఆర్డర్ అంటాడు రవి. నిజమా రవి అంటాడు కార్తీక్. దీంతో అవును కార్తీక్ అంటాడు. ఆ లెటర్ చూసి కార్తీక్ చాలా సంతోషం వ్యక్తం చేస్తాడు. ఇంతలో మోనిత మాట్లాడటం ప్రారంభిస్తుంది.

నేను నీకు పెళ్లి రోజు శుభాకంక్షలు అస్సలు చెప్పను. ఒకటి రెండు సార్లు నువ్వు దీప మెడలో తాళి కట్టినా నేను ఫీల్ అవను. ఒక్కసారి కాదు.. 200 సార్లు దీప మెడలో తాళి కట్టినా నా ప్రేమ తగ్గదు. మరింత పెరుగుతుంది. ఏంటి రవి.. కార్తీక్ లైసెన్స్ తిరిగి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో చెప్పవా అంటుంది మోనిత.

దీంతో చెప్పాను కదా.. నిజం కార్తీక్.. పాపం తను చాలా కష్టపడింది. ఈ విషయం అయ్యేదాకా ఎవరికీ చెప్పొద్దని చెప్పింది అంటాడు రవి. అన్ని దారులు మూసుకుపోయాక ఇదో కొత్త నాటకం మొదలైందా రవి గారు అని దీప అంటుంది.

నేను నిజాయితీగా కార్తీక్ మంచికోసమే కష్టపడ్డాను అంటుంది మోనిత. అవునా.. క్రూర మృగం నిజాయితీ గురించి మాట్లాడినట్టు ఉంది అంటుంది దీప. పెళ్లి రోజుకు వచ్చినందుకు భోం చేసి వెళ్లు అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

1 minute ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

1 hour ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

2 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

3 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

4 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

5 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

6 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

7 hours ago