anasuya looks stunning in her latest post
Anasuya : ఒకవైపు బుల్లితెర మరోవైపు వెండితెర ఇంకోవైపు సోషల్ మీడియాని చెడుగుడు ఆడుతుంది అనసూయ. ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్ర బాగా క్లిక్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అందులో భాగంగానే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప అనే సినిమాలో కూడా సునీల్ భార్య దాక్షాయణి అనే పాత్రలో నటించిన ఆమె మరింత క్రేజ్ సంపాదించింది.ఇప్పుడు ఖిలాడీ చిత్రంలోను అద్దిరిపోయే పాత్ర చేసింది. ఇవే కాక అనసూయ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి.
సినిమాలు, పలు టీవీ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో షేక్ ఆడిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్‌లో కన్నుగీటుతూ ముద్దులు ఇస్తూ నానా రచ్చ చేస్తుంది. అనసూయని ఇలా చూసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు.
anasuya looks stunning in her latest post
కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. గ్లామరస్ ఫోటో షూట్లతో తన ఫోటోలతో ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ను కూడా ఆమె అభిమానుల కోసం అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా ఆమె ఫోటోల మీద నెగటివ్ కామెంట్లు పెడితే వారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తూ ఆమె మీద కామెంట్ చేయటం కంటే ఆమె ఫోటోలు చూసి సైలెంట్గా ఉండి పోవడమే బెటర్ అనిపించేలా చేస్తుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.