Karthika Deepam 15 June Today Episode : హిమ క్యాన్సర్ నాటకాన్ని కనిపెట్టిన శోభ.. ఈ విషయాన్ని నిరుపమ్ కు చెబుతుందా? నిరుపమ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు?

Karthika Deepam 15 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 1379 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు.. జ్వాలకు ఎవరు ఫోన్ చేశారు.. అని టెన్షన్ పడుతుంది హిమ. పాపం శౌర్య అని అనుకుంటుంది. ఎంత ఫీల్ అయిందో ఏమో.. అసలే శత్రువు.. శత్రువు అని నన్ను వెతుకుతున్న శౌర్యకు హిమ అని ఎవరో ఫోన్ చేస్తే ఇంకా బాగా డిస్టర్బ్ అవుతుంది అని అనుకుంటుంది హిమ. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు.. ఏదైతే అది అయింది. నేనే హిమను అని శౌర్యకు చెప్పేస్తాను. మహా అయితే కోపంగా అరుస్తుందేమో.. అంతకంటే ఇంకేం చేయలేదు కదా అని అనుకుంటుంది హిమ. మరోవైపు వద్దులే ఇప్పుడు నేను హిమను అని చెబితే నేను అనుకున్న పని నెరవేరదు అని అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్ ఎందుకు పెట్టిందో.. ఆ లోన్ ఎందుకు తీసుకున్నానో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది శోభ.

karthika deepam 15 june 2022 full episode

ఇంతలో ఓ పేషెంట్ వస్తుంది. ఏంటి ప్రాబ్లమ్ అంటే.. రక్తం తక్కువైంది అంటుంది. దీంతో ఇదివరకు మీకు బ్లడ్ ఎవరు ఇచ్చారు అంటుంది. అది రేర్ బ్లడ్ గ్రూప్ అంటుంది. దీంతో ఆదిత్య ఆసుపత్రిలో ఒక డాక్టర్ ఇచ్చారు అంటుంది. ఎవరా డాక్టర్ అంటుంది. దీంతో హిమ అని చెబుతుంది పేషెంట్. దీంతో షాక్ అవుతుంది శోభ. అసలు తనకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంటే బ్లడ్ ఎలా ఇచ్చింది అని అనుమానపడుతుంది శోభ. మరోవైపు హిమ అంటూ తనకు ఫోన్ చేసిన నెంబర్ కు ఫోన్ చేస్తుంది జ్వాల. కానీ.. ఆ నెంబర్ కలవదు. మరోవైపు డాక్టర్ సాబ్ ను ఎలాగైనా కలవాలి అని అనుకొని నిరుపమ్ ను కలవడం కోసం వెళ్తుంది జ్వాల. మరోవైపు హిమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శోభ. నేను అనుకున్నదే నిజం అయితే.. హిమ ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటుంది శోభ. దీంతో నిజంగానే హిమ అక్కడికి వస్తుంది.

దొరికావే అని అనుకుంటుంది శోభ. హిమకు క్యాన్సర్ లేదని తీర్మానించుకుంటుంది శోభ. మరోవైపు నిరుపమ్ ను కలవడానికి ఆసుపత్రికి వెళ్తుంది జ్వాల. తను ఫోన్ లో మాట్లాడుతుండగా జ్వాల రావడంతో ఫోన్ తర్వాత చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

నేను చెప్పకుండా వెళ్లినందుకు డాక్టర్ సాబ్ కు కోపం వచ్చిందేమో. సారీ చెప్పాలా. సారీ చెబితే కోపం పోతుందా అని అనుకుంటుంది జ్వాల. డాక్టర్ సాబ్.. తింగరి కనిపించడం లేదు అంటుంది. దీంతో బయటికి వెళ్లింది అంటాడు. ఏంటో ఫస్ట్ టైమ్ డాక్టర్ సాబ్ తో మాట్లాడాలంటే భయం వేస్తోంది అని అనుకుంటుంది జ్వాల.

Karthika Deepam 15 June Today Episode : డాక్టర్ సాబ్ కు ఐలవ్యూ చెప్పేసిన జ్వాల.. కానీ?

డాక్టర్ సాబ్.. అసలు జరిగింది ఏంటంటే.. అనుకోకుండా ఒక ఫోన్ వచ్చింది. అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది.. సారీ అంటుంది జ్వాల. డాక్టర్ సాబ్ అసలు నేను వచ్చిందే నీకో విషయం చెప్పడానికి. కానీ.. చెప్పడం కుదరలేదు. మీరు ఆరోజు నాకు ఐలవ్యూ చెప్పారు. ఎంత సంతోషించానో అంటుంది జ్వాల.

మీకు నేను నచ్చడం నా అదృష్టం. నాకు మీరంటే చాలా ఇష్టం. ఈ మాట ఎప్పుడో చెప్పాలనుకున్నాను. ఆ తింగరే ఇది టైమ్ కాదంటూ నన్ను ఆపేసింది. ఇక నావల్ల కాదు డాక్టర్ సాబ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు చాలా ప్రేమ అంటూ తన మనసులో మాట చెబుతుంది జ్వాల.

మీరంటే ప్రాణం.. ఐలవ్యూ డాక్టర్ సాబ్ అంటుంది. కానీ.. చైర్ లో నిరుపమ్ ఉండడు. నిరుపమ్ లేడని తెలుసుకొని షాక్ అవుతుంది జ్వాల. మరోవైపు హిమ బ్లడ్ ఇచ్చి వస్తుంది. శోభ ఎదురు పడుతుంది. తనను చూసి షాక్ అవుతుంది హిమ. హలో హిమ అంటుంది శోభ.

నువ్వేంటి ఇక్కడ డాక్టర్ హిమ అంటుంది. దీంతో చిన్నపని ఉండి వచ్చాను అంటుంది. డాక్టర్ షణ్ముఖ్ రావు గారు స్పెషలిస్టు కదా. తనను ఒకసారి కలుద్దామని వచ్చాను అంటుంది హిమ. ఎంత బాగా నటిస్తున్నావు హిమ అని అంటుంది. ఇంతలో తను బ్లడ్ ఇచ్చిన వాళ్లు వచ్చి నమస్కారం అమ్మా.. మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారమ్మ  అంటుంది ఆ పేషెంట్.

దీంతో ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. నీకు జ్వాల ఎవరో తెలుసు కానీ.. ఇంట్లో చెప్పవు. ఎంగేజ్ మెంట్ దాకా వచ్చిన నిరుపమ్ సంబంధాన్ని వద్దనుకున్నావు. నిరుపమ్ ను తీసుకెళ్లి జ్వాలతో పెళ్లి చేయాలని అనుకుంటున్నావు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు హిమ. నీ నాటకాలకు నేను తెర తీస్తాను.

నిరుపమ్ ఎక్కడికీ వెళ్లడు. నా దగ్గరే ఉంటాడు. నిరుపమ్ నాకే సొంతం. నీ క్యాన్సర్ సంగతి నాటకం, నీ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం నాటకం.. జ్వాలను తీసుకెళ్లి నిరుపమ్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం మరో నాటకం అని అనుకుంటుంది శోభ.

నిరుపమ్ బావకు, శౌర్యను ఇచ్చి పెళ్లి చేయడం కోసం నాకు క్యాన్సర్ అని నాటకం ఆడాల్సి వచ్చింది. కానీ.. నాకు క్యాన్సర్ అని తెలిసినా కూడా ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు బావ. నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఒకవేళ నేను బావను పెళ్లి చేసుకున్నాక నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

1 hour ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

2 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

3 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

4 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

5 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

6 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

7 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

8 hours ago