Karthika Deepam 17 Dec Today Episode : కోటేశ్ ఎత్తుకొచ్చిన కొడుకు ఎవరో కార్తీక్ కనిపెట్టాడా? మోనిత కొడుకే అని గుర్తుపట్టాడా?

Karthika Deepam 17 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1225 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాన్నా స్కూల్ కు వెళ్తున్నాం అన్నట్టే కానీ.. బ్యాగ్స్, బుక్స్ ఏం లేవు అంటుంది శౌర్య. అన్ని కొనుక్కున్నాక.. సోమవారం నుంచి స్కూల్ కు వెళ్లండి అంటాడు కార్తీక్. దీంతో కనీసం వెళ్లి స్కూల్ అయినా చూసి వస్తాం అంటుంది హిమ. దీంతో వద్దమ్మా.. అంటాడు కార్తీక్. ఇంతలో హిమ ఉండి.. నాన్న సంక్రాంతి పండక్కి నానమ్మ ఇంటికి వెళ్దామా అంటుంది హిమ. దీంతో కార్తీక్ ఏం మాట్లాడడు. వద్దులే హిమ.. ఈసారి పండక్కి ఇక్కడే ఉందాం అంటుంది శౌర్య. ఇంతలో దీప వస్తుంది. ఈరోజు మంచిరోజు కాదంట.. తర్వాత వెళ్దురు కానీలే అని దీప కూడా చెబుతుంది. సరే.. అమ్మ స్కూల్ కు జాయిన్ అయిన కొన్ని రోజులకే సంక్రాంతి సెలబ్రేషన్స్ వస్తాయి.. అంటుంది శౌర్య.

karthika deepam 17 december 2021 full episode

అమ్మ.. పల్లెల్లోనే సంక్రాంతి బాగా చేస్తారట కదా అంటుంది హిమ. అవును అమ్మా.. ఊళ్లలోనే బాగా చేస్తారు అంటుంది దీప. అయితే.. మాకు పట్టు పరికిణీలు కుట్టించాలి అంటుంది హిమ. సరే.. చూద్దాంలే అమ్మా మీరు బయటికి వెళ్లి ఆడుకోండి అంటుంది. తర్వాత కార్తీక్.. వెళ్లిన పని ఏమైంది అని అడుగుతాడు కార్తీక్. ఆరుద్రాణి.. మన మీద కోపం పెంచుకుంది. నన్ను పనిలోకి తీసుకోవద్దని హెడ్ మాస్టర్ కు చెప్పిందట అంటుంది దీప. నువ్వే కాదు.. నేను కూడా ఆమె మనుషులను కొట్టాను అని చెబుతాడు కార్తీక్. మీరెందుకు వాళ్ల జోలికి వెళ్లారు అంటుంది దీప. ఏం కాదులే.. రుద్రాణి వ్యక్తిత్వమే అటువంటిది కదా అని అంటాడు కార్తీక్. మరోవైపు మోనిత.. చేతుల్లో ఒక ఫోటోను పట్టుకొని వస్తుంది. అది ప్యాక్ చేసి ఉంటుంది. ఇది ఏంటో చెప్పుకోండి చూద్దాం అని అందరు కుటుంబ సభ్యులను అడుగుతుంది. వెంటనే ఓపెన్ చేసి చూపిస్తుంది. అది శాంతి పూజ సమయంలో కార్తీక్, మోనిత కలిసి ఉన్న ఫోటో.

ఆ ఫోటోను చూసి అందరూ షాక్ అవుతారు. మమ్మీ ఏం జరుగుతోంది ఈ ఇంట్లో. మన ఇంట్లోకి వచ్చి ఈ పిచ్చి వేషాలు ఏంటి అంటాడు ఆదిత్య. ఆ ఆదిత్య.. కొంచెం కోపం తగ్గించుకో అంటుంది మోనిత. ఆ ఫోటోను హాల్ లో అక్కడ పెడుతుంది. ఆదిత్య దాన్ని తీసి కింద పడేయబోతాడు. దీంతో మోనిత హెచ్చరిస్తుంది.

నువ్వు దాన్ని నేలకేసి కొడితే.. నేను ఇంటి ముందు.. 10 ఫ్లెక్సీలు పెట్టిస్తాను. అప్పుడు ఏం చేస్తావు. ఇప్పుడు మనం మాత్రమే చూస్తున్నాం. లేదంటే.. వీధిలో 10 మంది చూస్తారు అంటుంది మోనిత. ఏయ్.. ఎక్కువ చేస్తున్నావు అంటుంది సౌందర్య.

మోనిత ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోరు. ప్రియమణి.. ఏంటలా చూస్తున్నావు. అరిచి అరిచి గొంతు పోతోంది ప్రియమణి. కొంచెం అల్లం టీ ఇస్తావా? ఆంటి మీరు కూడా తాగుతారా.. అని చెప్పి ఇంటి సభ్యులకు ఒక ముఖ్య గమనిక. ఫోటో తీసేయాలని ఎవ్వరూ ప్రయత్నించకండి.. అలాంటి ప్రయత్నాలు చేసినచో.. వీధిలో నేను పెట్టే ఫ్లెక్సీల సంఖ్య మరింత పెరుగుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది.

Karthika Deepam 17 Dec Today Episode : శ్రీవల్లి, కోటేశ్ కు స్వాగతం పలికిన కార్తీక్, దీప

కట్ చేస్తే శ్రీవల్లి, కోటేశ్.. తన ఇంటి దగ్గరికి వస్తారు. తమ సామాన్లు ఏవని చూస్తాడు. వల్లీ మన సామాన్లు ఏమయ్యాయి అంటాడు కోటేశ్. నాకేం తెలుసు అండి.. అంటుంది శ్రీవల్లి. ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్లారేమో అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. మీ సామాన్లు ఇంట్లో భద్రంగా ఉన్నాయి అంటాడు కార్తీక్.

అయ్యో మీకు ఆ రుద్రాణి గురించి తెలియదు అంటాడు కోటేశ్. ఏం కాదు మీరు రండి.. అని ఇంట్లోకి తీసుకెళ్తాడు కార్తీక్. దీప.. శ్రీవల్లికి హారతి పడుతుంది. లోపలికి వచ్చి కూర్చో అంటుంది. శ్రీవల్లికి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది దీప. మీ ఇంట్లో మీకు నేను మర్యాదలు చేస్తున్నాను అంటుంది దీప.

మొత్తానికి డెలివరీ బాగానే జరిగినట్టుంది సంతోషం అని అనుకుంటాడు కార్తీక్. అక్క అని పిలిచావు.. కష్టమో సుఖమో అందరం కలిసే ఉందాం అంటుంది దీప. దీంతో అక్కా మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అందరం కలిసే ఉందాం అంటుంది శ్రీవల్లి. ఇది మా పూర్వీకుల ఇల్లు.. మీరు మాకోసం చాలా చేశారు.. మీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడ ఉండండి అంటాడు కోటేశ్. ఇదంతా రుద్రాణి మనిషి చూసి వెళ్లి రుద్రాణికి చెబుతాడు.

ఇంతలో బాబును ఎత్తుకుంటుంది దీప. కార్తీక్ బాబును చూసి.. ఈ బాబు రోజుల బిడ్డలా లేడు. నెలల బిడ్డలా ఉన్నాడు అంటాడు. దీంతో కోటేశ్ భయపడతాడు. దీప కూడా అదే అడుగుతుంది. కోటేశ్.. ఈ బిడ్డ ఎవరు అని అడుగుతుంది. దీంతో షాక్ అవుతాడు కోటేశ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

41 minutes ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

2 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

3 hours ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

4 hours ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

5 hours ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

6 hours ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

7 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

8 hours ago