karthika deepam 18 november 2021 today episode
Karthika Deepam 18 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 1200 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ వైపు దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోనిత.. నా కార్తీక్ తో ఎప్పుడు దీపావళి వేడుకల్లో పాల్గొంటానో అంటూ అనుకుంటుంది. నేను బయటికి వెళ్తున్నాను. ఆనంద రావును జాగ్రత్తగా చూసుకో అని ప్రియమణికి చెబుతుంది మోనిత. కార్తీక్ దగ్గరికి వెళ్లి ఓసారి కలిసి వస్తాను అంటుంది.
karthika deepam 18 november 2021 today episode
మరోవైపు కార్తీక్ ఇంట్లో కూడా దీపావళి వేడుకలు జరుగుతుంటాయి. కానీ.. కార్తీక్ మాత్రం ఆ వేడుకల్లో పాల్గొనడు. దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు దీపకు ఏమైంది.. కావాలనే అంటుందా.. లేక క్యాజువల్ గా అంటుందా అని అనుకుంటాడు. గుడిలో పూజ చూసి కూడా ఆ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. నా దగ్గరికి వచ్చి దీప నన్ను తిట్టినా బాగుండు. పూజ చూసి ఏం చూడనట్టు.. ఏం జరగనట్టు ఉంటుంది. అప్పటి నుంచి మరీ ఉత్సాహంగా ఉంటోంది. దీప మనసులో ఏముంది.. ఏదైనా నిర్ణయం తీసుకుందా.. దేవుడా నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు కార్తీక్.
ఇంతలో కార్తీక్ కు ఫోన్ వస్తుంది. ఏదో ప్రైవేటు నంబర్. చూస్తే.. మోనిత. కారులో ఉండి కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. హలో.. డాక్టర్ కార్తీక్ గారా అండి. నేను డాక్టర్ మోనిత అండి అంటుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి కార్తీక్ ఫోన్ చూసుకుంటున్నావా? ఇది కొత్త నెంబర్ లే. ఏం చేయాలి చెప్పు కార్తీక్. నువ్వు నా ఫోన్ కట్ చేస్తున్నావు. అందుకే కొత్త నెంబర్స్ తీసుకున్నాను.. అంటుంది.
ఎందుకు ఫోన్ చేశావు అంటాడు. ఇదేం ప్రశ్న.. పెళ్లాం మొగుడికి ఎందుకు ఫోన్ చేస్తుంది అంటుంది. దీనితో ఏంటి మాటలు అని అనుకొని ఫోన్ కట్ చేయబోతాడు. ఒక్కసారి కలవండి.. లేదంటే నేను మీ ఇంటికి వస్తాను అని బెదిరిస్తుంది మోనిత.
దీంతో ఎందుకు బాధ అనుకొని మోనితను కలవడానికి వెళ్లాలని ప్రయత్నిస్తాడు కార్తీక్. ఇంతలో దీప వచ్చి ఏంటండి.. ఎక్కడికి వెళ్తున్నారు.. అంటుంది. ఎక్కడికి లేదు దీప అంటాడు కార్తీక్. ఏమైంది డాక్టర్ బాబు అంటుంది. ఎందుకంత కంగారుగా ఉన్నారు అంటుంది.
ఇంతలో మళ్లీ ఫోన్ వస్తుంది. మోనిత ఫోన్ చేస్తుంది. డాక్టర్ బాబు గుడికి వెళ్దామా.. అంటుంది. సరే వెళ్దాం అంటాడు. ఇంతలోనే మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంటుంది మోనిత. చాలా రోజులకు దీప కూల్ గా మాట్లాడుతుంటే మోనిత మాత్రం ఇరిటేట్ చేస్తుంటుంది. దీంతో కార్తీక్ కు ఏం చేయాలో అర్థం కాదు.
కార్తీక్ ఫోన్ తీయకపోయేసరికి.. డైరెక్ట్ గా వాళ్ల ఇంటికే బయలు దేరుతుంది మోనిత. దీంతో మోనిత ఎక్కడ వస్తుందోనని.. నేను ఇప్పుడే వస్తాను అని దీపతో చెబుతాడు. పిల్లలను రెడీ చేయ్.. పిల్లలు రెడీ అయ్యేలోగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు కార్తీక్.
దీప కారు వస్తుండగా.. తన కారును చూసి ఆపుతాడు కార్తీక్. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బెదిరిస్తున్నావా? అంటాడు కార్తీక్. దీపావళి శుభాకాంక్షలు కార్తీక్. నాకు పండుగ స్వీట్స్ ఏవి.. గిఫ్ట్ ఏది. ఖాళీ చేతులతో వచ్చావా.. అంటూ అడుగుతుంది మోనిత.
దీనితో ఇక మాటలు ఏంటి అనుకొని వెళ్లబోతుంటాడు కార్తీక్. ఇంతలో కొందరు అక్కడికి వస్తారు. ఎవరు వీళ్లు.. అని కార్తీక్ అనుకునేలోపే నేనే రమ్మన్నాను అంటుంది. వాళ్లు వచ్చి హాయ్ సర్.. మేము మీ ఫ్యాన్స్ సర్.. అంటారు. ఫోటోలు దిగబోతారు. దీంతో జస్ట్ షట్ అప్ అంటాడు.
ఎవరు వీళ్లు అంటే.. వీళ్లంతా నా ఆసుపత్రి స్టాఫ్ అని చెబుతుంది మోనిత. వీళ్లు నా ఫ్యాన్స్ అంటుంది. దీంతో కార్తీక్ కు చిర్రెత్తుకొస్తుంది. వీళ్లతో ఏంటి గొడవ అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.