Karthika Deepam 18 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు అంటే 18 సెప్టెంబర్ 2021, శనివారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1148 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకు గెలికించుకొని మరీ తిట్టించుకోవడం అలవాటా… అంటూ ఏసీపీ కూడా మోనితను తిడుతుంది. ఇక్కడికి వచ్చి కూడా తిట్టించుకోవాలా? నేను పెట్టిన గడ్డి సరిపోలేదా.. అని ఏసీపీ రోషిణి కోర్టులో మోనితను తిడుతుంది. సౌందర్య కూడా మోనితపై సీరియస్ అవుతుంది. కాకి మెడ వేసుకొని చూసింది చాలు.. వెళ్లు.. అంటూ దీప అనేసరికి.. చిచ్చుబుడ్డులు, పటాసుల వెలుగులు నిమిషాలే.. తర్వాత ఆరిపోతాయి. మళ్లీ వెలగవు. ఇప్పుడు మీ మొహాల్లో కనిపించే ఆనందం కూడా అటువంటిదే. నేను పెట్టబోయే చిచ్చు ముందు ఈ చిచ్చుబుడ్లు దేనికీ గొరకావు.. అని చెప్పి మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే ఆదిత్య ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇంతలో అక్కడికి శ్రావ్య వస్తుంది. ఆ మోనితకు ఎంత శిక్ష పడుతుందో ఎవరినైనా లాయర్ ను కనుక్కొని చెప్పు.. అని అంటుంది. దానికి లాయర్ ను కనుక్కోవాల్సిన అవసరం ఏంటి.. నేనే చెప్తా అంటాడు. కనీసం 10 ఏళ్లు అయినా శిక్ష పడుతుంది తనకు అంటాడు ఆదిత్య. ఆడదేనా అది.. ఎన్ని దారుణాలు చేసింది.. మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఎన్ని కుట్రలు చేసింది. దాన్ని అస్సలు వదలొద్దు. దానికి ఉరి శిక్ష పడాల్సిందే. దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఇన్ని పాపాలు చేసిన దాన్ని నేను ఎక్కడా చూడలేదు. అని శ్రావ్య అంటుంది. అవును.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. ఆ మోనితకు ఉరి శిక్ష పడటమే కరెక్ట్.. అని అంటాడు ఆదిత్య.
కట్ చేస్తే కోర్టు ప్రారంభం అవుతుంది. జడ్జి రాగానే… పబ్లిక్ ప్రాసిక్యూటర్.. బోనులో ఉన్న నిందితురాలు మోనిత ఇన్ని రోజులు బయటికి రాకుండా దాక్కొని ఉండి ఇప్పుడు బయటికి వచ్చి తను చేసిన నేరాలను ఒప్పుకోవడంతో.. దానిపై విచారణ చేయడానికి అనుమతించాలని కోర్టును కోరుతాడు. ఎస్.. గ్రాంటెడ్ అంటాడు జడ్జి.
ఆ తర్వాత కోర్టు సిబ్బంది భగవద్గీతను తీసుకెళ్లి.. మోనితకు చూపించి.. దేవుడి మీద ఒట్టు వేసి.. అని అనేసరికి.. క్షమించాలి.. నా దేవుడు కార్తీక్.. అని అంటుంది మోనిత. ఇప్పటి దాకా నాకు ఒక్క వరం ఇవ్వకపోయినా.. నా దృష్టిలో నా కార్తీక్ దేవుడు. నాకీ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆత్మీయులు. అత్యంత ఇష్టమైన వాళ్లు.. ఒకరు కార్తీక్ అయితే.. రెండో వ్యక్తి అతడి భార్య దీప.. దీపక్క.. వంటలక్క అని చెబుతుంది మోనిత. మా దీపక్క మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పనే చెప్పను.. అని అంటుంది మోనిత.
మీ పేరు అని లాయర్ అడుగుతాడు. దీంతో మోనితా కార్తీక్ అని అంటుంది. విన్నారా యువర్ ఆనర్.. ముద్దాయి కార్తీక్ ను పెళ్లి చేసుకోకపోయినా తన పేరును తగిలించుకుంది. పెళ్లయిన మగాడి వెంట పడి.. పెళ్లి చేసుకోవాలంటూ ప్రాదేయపడి.. వినకపోతే తను చనిపోయినట్టు.. కార్తీక్ చంపినట్టు అందరూ అనుమానించేలా చేసి అతడిని జైలుకు పంపించాలని ప్లాన్ వేసింది. కార్తీక్ కాదనేసరికి తట్టుకోలేక ఇన్ని నేరాలు చేసింది. చివరకు.. కార్తీక్ భార్యకు అడ్డంగా దొరికిపోయి.. చేసేది లేక కోర్టుకు వచ్చి లొంగిపోయింది. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని చంపించింది. కార్తీక్ ఫ్యామిలీని కిడ్నాప్ చేయించింది.. అని చెబుతాడు లాయర్.
ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తి సభ్యసమాజంలో ఉంటే మరిన్ని నేరాలు చేయగలదని అర్థం అవుతుంది. కాబట్టి.. కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.. అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవిస్తాడు.
నీ తరుపున వాధించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? అని అడుగుతాడు జడ్జి. దీంతో లేరు యువర్ ఆనర్.. నా తరుపున ఇంకొకరు చెప్పడం కంటే నేనే చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకే.. నా కేసును నేనే వాధించుకుంటాను. మీరు అనుమతిస్తే నా గురించి నేను చెప్పుకుంటాను.. అంటుంది మోనిత. జడ్జి పర్మిషన్ ఇవ్వడంతో.. తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది మోనిత.
నేను పెళ్లయిన మగవాడిని ప్రేమించానని అంటున్నారు. లేదు.. నేను ప్రేమించేనాటికి నా కార్తీక్ కు ఇంకా పెళ్లి కాలేదు. అతడు.. మా దీపక్కను పెళ్లి చేసుకున్నాడు. కానీ.. నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అతడే నా భర్త అని ప్రేమించినప్పుడే అనుకున్నాను. ఎప్పుడైతే మనసు ఇచ్చానో అప్పుడే భర్తగా డిసైడ్ అయ్యాను.. అని మోనిత అనగానే.. నీకు ప్రేమించే హక్కు ఉండొచ్చు కానీ.. పెళ్లి చేసుకోమని.. అతడిని అడిగే అధికారం నీకు లేదు కదా.. అని ప్రశ్నిస్తాడు జడ్జి. పైగా కార్తీక్ ను సొంతం చేసుకోవడానికి ఆమె ప్రేమించిన అమ్మాయి అడ్డుగా ఉందని ఆ అమ్మాయిని కూడా చంపించింది యువర్ ఆనర్.. అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పగానే.. యువర్ ఆనర్ అది హత్య కాదు.. యాక్సిడెంట్ అని చెబుతుంది మోనిత.
కార్తీక్ ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది.. అని మోనిత అనగానే.. ఎక్స్ క్యూస్ మీ మిలార్డ్.. అది యాక్సిడెంట్ కాదు.. తనే హత్య చేయించినట్టు స్వయంగా ఒప్పుకున్న వీడియో ఉంది.. అని చెబుతుంది ఏసీపీ రోషిణి. సాక్షాత్తూ కార్తీక భార్య దీపే ఆ వీడియో తీసింది.. అని చెబుతుంది. దీంతో ఉంటే చూపించమనండి.. అని అంటుంది మోనిత.
దీంతో దీప.. ఆ వీడియో తీసుకురా.. అని అడుగుతుంది ఏసీపీ. దీంతో ఫోన్ లో ఆ వీడియోను చెక్ చేస్తుంది దీప. కానీ.. తనకు ఆ వీడియో కనిపించదు. ఫోన్ లో ఎంత వెతికినా కనిపించదు. ఏమైంది దీప.. అనగానే డిలీట్ అయిపోయింది మేడమ్ అంటుంది దీప. దీంతో కార్తీక్ సెల్ ఫోన్ లో ఉందన్నావు కదా.. అంటుంది. దీంతో కార్తీక్ తన సెల్ ఫోన్ లో చెక్ చేస్తాడు. ఇందులో కూడా డిలీట్ అయి ఉంది మేడమ్ అంటాడు కార్తీక్. మనం హ్యాడ్ ఓవర్ చేసుకున్నాక సీల్ కవర్ లోనే ఉంచి.. అలాగే ఫోన్ ఇచ్చేశాం కదా మేడమ్ అంటుంది రత్నసీత.
యువర్ ఆనర్.. అభియోగం మోపే ముందు తగిన సాక్ష్యాలు ఉండాలి కదా.. అంటుంది మోనిత. నన్ను ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. యువర్ ఆనర్.. ఇందాక నేను.. ప్రియమైన నా అక్క మీద ప్రమాణం చేసి చెప్పాను కాబట్టి ఏ అబద్ధం చెప్పదల్చుకోలేదు. ఈ హత్య నేను చేయలేదు. ఇక.. కార్తీక్ అత్తగారిని కిడ్నాప్ చేశానని అన్నారు. ఆమె నన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే.. నా రక్షణ కోసం నేను కిడ్నాప్ చేశాను తప్పితే.. నాకా ఉద్దేశం లేదు.. అంటుంది మోనిత.
దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి.. యువర్ ఆనర్.. ఇలా ఏకపక్షంగా మోనిత చేసే ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకుండా.. భార్యాభర్తలు.. దీప, కార్తీక్ వాంగ్మూలం కూడా తీసుకోవాలని కోరుతున్నాను.. అని అంటాడు. దీంతో ఎస్.. ప్రొసీడ్ అంటాడు జడ్జి.
దీంతో కార్తీక్, దీప.. ఇద్దరూ బోన్ లోకి వస్తారు. నమస్కారం పెడతారు జడ్జికి. దీంతో ఆహా.. నన్ను జైలుకు పంపించడానికి ఆదర్శ దంపతుల్లా వచ్చారు.. అంటుంది మోనిత. మీరు ప్రేమించిన అమ్మాయిది హత్యా.. ఆత్మహత్యా అని అడుగుతాడు లాయర్. దీంతో ముమ్మాటికీ హత్యే. ఆ రోజు నేను, ఆమె కారులో వెళ్తుంటే ఈ మోనితే.. అంజి అనే డ్రైవర్ ద్వారా లారీతో డ్యాష్ ఇచ్చి చంపించాలని చూసింది. ఆ యాక్సిడెంట్ లో నేను ప్రాణాలతో బయటపడ్డాను.. ఆ అమ్మాయి చనిపోయింది.
ఆ మాటలు అంజికి చెబుతుంటే నేను స్వయంగా రికార్డు చేశాను. ఆ విషయం తెలిసే ఆయన కోపంగా తన దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ వీడియో నా ఫోన్ తో పాటు కార్తీక్ ఫోన్ లో కూడా ఉండాలి కానీ.. ఆ వీడియో ఎలా డిలీట్ అయిందో అర్థం కావడం లేదు.. అని చెబుతుంది దీప.
దీపక్క చెప్పినట్టు, నా దేవుడు కార్తీక్ చెప్పినట్టు.. నేను హిమను యాక్సిడెంట్ చేసి చంపించాలని చూస్తే.. కార్తీక్ ఆ కారులో ఉండగా ఎలా చంపిస్తాను.. అని చెబుతుంది మోనిత. దీంతో ఇంతలో లాయర్ ఉండి.. హిమ ఎవరు అని అడుగుతాడు. దీంతో కార్తీక్ ప్రేమించిన అమ్మాయి గురించి తనకు ముందే తెలుసు. అందుకే.. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిన నిర్దాక్షిణ్యంగా చంపించింది.. అని అంటాడు లాయర్.
దీంతో లేదు.. లేదు.. లేదు.. అంటుంది మోనిత. నేను కార్తీక్ ను ప్రేమించిన మాట వాస్తవం కానీ.. నేను ప్రేమించినవాడు హిమతో పాటు ఉండగా ఎలా చంపిస్తాను. అడ్డుగా ఉన్న హిమను చంపించాలి అని అనుకుంటే.. కార్తీక్ పక్కనుండగా ఎలా చేస్తాను. పైగా అంజి అనే డ్రైవర్ ద్వారా లారీతో యాక్సిడెంట్ చేయించాను అంటున్నారు.. అదే నిజం అయితే ఆ అంజిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించమనండి.. అంటుంది మోనిత. దీంతో ఖచ్చితంగా ఆ అంజిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను అంటుంది దీప. దీంతో తప్పకుండా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి.. అంటుంది మోనిత.
ఇందాక వీడియో చూపిస్తాం అన్నారు చూపించలేదు. అంజిని తీసుకొస్తా అన్నారు తీసుకురాలేరు.. ఎందుకంటే అంజి అనే వాడు వీళ్లు కల్పించిన కల్పిత పాత్ర అంటుంది మోనిత. దీంతో అందరూ షాక్ అవుతారు. మీరిప్పుడు గర్భవతి అని నివేదికలో ఉంది నిజమేనా.. అని అడుగుతాడు లాయర్. దీంతో నిజమే అంటుంది మోనిత. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని అడుగుతాడు లాయర్. కార్తీక్ అని చెబుతుంది. దీంతో అబద్ధం.. నాకేం సంబంధం లేదు అంటాడు కార్తీక్.
నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. ఈ బిడ్డకు తండ్రి కార్తీకే అంటుంది మోనిత. దీంతో కార్తీక్ మళ్లీ బోనులోకి వచ్చి.. మోనిత అసలు స్వరూపం మొత్తం చెప్పేస్తాడు. ప్రతి సారి నా జీవితంలోకి చొచ్చుకురావడానికి మోనిత ప్రయత్నించింది. నేను మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్న విషయం ఒక్కటే. మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాదు కాదు కాదు అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.