Karthika Deepam 2 Serial Today Episode : జ్యోత్స్న కొత్త ప్లాన్.. దీపకు యావజ్జీవ శిక్షే అన్న శ్రీధర్
Karthika Deepam -2 Serial Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 16) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప జైలు నుంచి బయటికి రాకుండా చేయాలని సుమిత్ర శివన్నారాయణతో అనగా దాని బతుకు జైలులోని గడిచిపోవాలని అంటుంది పారిజాతం. జరగబోయేది అదే, తాతా పోదాం పదా అని జ్యోత్స్న అంటుంది. అప్పటికే దశరథ్ బతకడం కష్టమే అని డాక్టర్ చెప్పడంతో నేను ఎక్కడికీ రాలేను కొడుకు దగ్గరే ఉంటానని ఏడుస్తాడు శివన్నారాయణ. దాంతో మమ్మీని చూసుకో నాకు బయట చిన్న పని ఉంది. అది చూసుకుని ఎస్‍ఐను కలిసి వస్తా అని పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. తన ప్లాన్‍ను తాత శివన్నారాయణకు చెబుతుంది. సరేనమ్మా నువ్వే కలువు, నేను ఫోన్ చేసి మాట్లాడతానని అంటాడు శివన్నారాయణ.దశరథ్ స్పృహలోకి వచ్చారా అని కానిస్టేబుల్‍ను అడుగుతుంది జైలులో ఉన్న దీప. ఇంకా స్పృహలోకి రాలేదని కానిస్టేబుల్ చెబుతుంది. మరోవైపు మా అన్నయ్యకు ఏమీ కాకూడదు, మా అన్నయ్య బతకాలి అంటూ దశరథ్ పరిస్థితి తలుచుకుని ఏడుస్తుంటుంది కాంచన. ఫోన్ చేసి మాట్లాడాలని చెబుతుంది అనసూయ. దీంతో ఫోన్ చేస్తుంది కాంచన. నీ దగ్గర ఫోన్ లేదు కదా.. నీ కోసమే కాంచన చేసిందేమో అని సుమిత్రతో పారిజాతం అంటుంది. కాల్ కట్ చేయాలని కోపంగా అంటాడు శివన్నారాయణ. మళ్లీ కాల్ చేస్తుంది కాంచన. ఎందుకు ఫోన్ చేసిందో నువ్వు అడుగు అని సుమిత్రకు ఇస్తుంది పారిజాతం. పిన్ని ఒక్కసారి వదినకు ఇస్తావా అని కాంచన అడుగుతుంది. సుమిత్రనే మాట్లాడుతుంది. “ఎందుకు నీ కొడలు చేసిన పనికి ఎంత బాధపడుతున్నానో తెలుసుకునేందుకా” అని సుమిత్ర అంటుంది. అన్నయ్యకు ఎలా ఉంది వదినా అని కాంచన అడుగుతుంది. నీ కొడలు చేయాలనుకున్నది ఇంకా జరగలేదులే.. అని మాటలు అంటుంది సుమిత్ర.
Karthika Deepam 2 Serial Today Episode : జ్యోత్స్న కొత్త ప్లాన్.. దీపకు యావజ్జీవ శిక్షే అన్న శ్రీధర్
ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయవద్దని కాంచనకు సుమిత్ర చెబుతుంది. వదినా అని బాధగా అంటుంది కాంచన. “ఇంకెప్పుడు నువ్వు అలా పిలవొద్దు. ఎందుకంటే మన మధ్య ఉన్న వదినా అన్న బంధం చచ్చిపోయింది. మీరంతా కలిసే నా భర్తకు ఈ గతి పట్టించారు” అని సుమిత్ర అరుస్తుంది. వదినా కావాలంటే నా గొంతు నులిమి చంపెయ్.. కానీ ఇలా మాట్లాడుతుంటే ఊరిపి ఆడడం లేదని ఏడుస్తుంది కాంచన. ముందు అన్నయ్యకు ఎలా ఉందో చెప్పు అని కాంచన అడుగుతుంటే.. సుమిత్ర దగ్గరి నుంచి ఫోన్ లాక్కుంటుంది పారిజాతం. నీకు కొంచెమైనా సిగ్గు ఉందా అంటూ నోటికొచ్చినట్టు తిడుతుంది. అన్నయ్యను చూసేందుకైనా నువ్వు రాలేదు అని సూటిపోటి మాటలు అంటుంది పారిజాతం. అన్నయ్య పోతే పూర్తి ఆస్తి నీకే వస్తుందని అనుకుంటున్నావేమో అంటూ అక్కసుగా మాట్లాడుతుంది. దీంతో అస్తమానం ఆస్తి..ఆస్తి అని చస్తారే అని పారిజాతంపై కోప్పడతాడు శివన్నారాయణ.
ఫోన్ తీసుకొని కాంచనతో మాట్లాడతాడు శివన్నారాయణ. మా పరువు తీశారు.. ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారని కోప్పడతాడు. నాన్న అని కాంచన బాధగా అంటే.. “నిన్ను కన్న పాపానికి మీ అమ్మ చచ్చిపోయి సుఖంగా ఉంది. బతికి ఉంటే ఎందుకు కన్నానా అని ఏడ్చేది” అని శివన్నారాయణ అంటాడు. దీంతో తలబాదుకుంటూ ఏడుస్తుంది కాంచన. తండ్రిగా నా ఆఖరి కోరిక అని శివన్నారాయణ అంటే.. అలా మాట్లాడొద్దని కాంచన అంటుంది. “నువ్వు ఎప్పుడూ నాకు కనిపించకు” అని శివన్నారాయణ అంటాడు. దీంతో బోరున విలపిస్తుంది కాంచన. దశరథ్ కళ్లు తెరిస్తేనే నిజాలు బయటపడతాయి.. ఆయనే నన్ను కాపాడతారు అని జైలులో కూర్చొని ఆలోచిస్తుంటుంది దీప. “ఆయన గుండెకు తగిలిన బుల్లెట్ నేను పేల్చింది కాదని తెలుస్తుంది. ఆయన తొందరగా కోలుకోవాలి” అని మనసులో అనుకుంటుంది దీప.
కాంచన ఇంటికి కావేరి వస్తుంది. నన్ను క్షమించు అక్కా అని అడుగుతుంది. “దీపకు నేను జ్యోత్స్న గురించి చెప్పకపోయి ఉంటే ఆ ఇంటికి వెళ్లేది కాదు. ఇంత ఘోరం జరిగేది కాదు” అని అంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన శ్రీధర్ భార్యలందరూ మొగుళ్ల మాటలు వినడం మానేశారని కాంచన, కావేరి, అనూసయను ఉద్దేశించి వెటకారంగా అంటాడు. ఇంక కార్తీక్ గాడి భార్య అంటే అంటూ దీప గురించి ఎత్తబోతాడు. అంతటితో ఆగండి.. నా మేనకోడలి గురించి తప్పుగా మాట్లాడితే చీపురు కట్టలు విరిగిపోతాయంటూ అనసూయ వార్నింగ్ ఇస్తుంది. దీంతో విజిల్ వేసుకుంటూ లోపలికి వస్తాడు కార్తీక్. మీరు ఇంతకాలం ఇలా గట్టిగా మాట్లాడకనే ఈయన అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడని తండ్రి శ్రీధర్‌ను అంటాడు కార్తీక్.
శ్రీధర్ మాత్రం తన నోటిదూలతో మాటలు అంటూనే ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా జరిగితే వాలిపోతావని. నా ఉసురు తగులుతుందని చెప్పేందుకు వచ్చావా అని కార్తీక్ అంటాడు. ఆస్పత్రికి వెళ్లకపోయావా అని అడుగుతుంది. వెళితే మీ తాత ఆయనను ఇంటికి వరకు పరుగెత్తించి కొడతారని అనసూయ అంటుంది. తోడబుట్టిన అన్నయ్య ఆస్పత్రిలో ఉంటే మీ అమ్మ చూసేందుకు వెళ్లిందా అని కార్తీక్‍తో శ్రీధర్ అంటాడు. వెళితే తాత ఊరుకుంటాడా అని కార్తీక్ బదులిస్తాడు. ఎన్నిసార్లు తిట్టినా నేను రావట్లేదా అని శ్రీధర్ అంటే.. వీళ్లు అత్మాభిమానం ఉన్న మనుషులండి అంటూ పంచ్ వేస్తుంది కావేరి. నేను బరి తెగిలించిన మనిషినంటావ్ అంతేనా శ్రీధర్ అంటాడు. ఆస్పత్రిలో తెలిసిన నర్సు ఉంటే ఫోన్ చేసి కనుకున్నాను, దశరథ్ బావ బతకడం కష్టమేనంట అని శ్రీధర్ చెబుతాడు. దీంతో అందరూ కంగారు పడతారు. పొరపాటున బావకు ఏదైనా జరిగితే దీపకు ఉరిశిక్షే అంటాడు శ్రీధర్.
మామయ్యకు బుల్లెట్ తరిగిలినప్పుడు పక్కనే ఉన్నట్టు మాట్లాడకు అంటూ అరుస్తాడు కార్తీక్. దీప వల్ల ఏ తప్పు జరగలేదని నమ్ముతున్నానని చెబుతాదు. మన బంగారం మనకు మంచిదేనని, అవతలి వారు నమ్మాలి కదా అని శ్రీధర్ అంటాడు. దీప తప్పు చేయలేదని నిరూపించేందుకు ఒక్క సాక్ష్యమైనా ఉందా అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. ఆధారాలు ఉన్నా మీ తరఫున కోర్టులో వాదించి, దీపను బయటికి తీసుకొచ్చి మంచి లాయర్ కూడా మీ తరఫున లేరని శ్రీధర్ అంటాడు. వాళ్ల తరఫున లాయర్ భగవాన్ దాస్ ఉన్నాడని చెబుతాడు. పొరపాటున వాడు నీ భార్యకు వ్యతిరేకంగా కేసు వాదిస్తే దీపకు యావజ్జీవ శిక్షే అని శ్రీధర్ గట్టిగా చెబుతాడు. దీంతో కార్తీక్ కంగారుగా చూస్తాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.