Karthika Deepam 21 Feb Today Episode : అప్పారావు ద్వారా తన కొడుకు కార్తీక్ దగ్గరే ఉన్నాడని తెలుసుకున్న మోనిత.. ఆనంద్.. మోనిత కొడుకే అని కార్తీక్ కు తెలిసి షాకింగ్ నిర్ణయం

Karthika Deepam 21 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 1281 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ.. తనను అమెరికాకు తీసుకెళ్లండి అంటుంది సౌందర్య. అప్పట్లో మోనిత దూకుడుతనంతో ప్రవర్తించింది కానీ.. మోనితలో చాలా మార్పు వచ్చింది.. అంటాడు బాబాయి. మోనితకు నాటకాలు ఆడటం అత్యంత సహజమైన గుణం. మీరు తన వలలో పడకండి. మా అబ్బాయి మీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తాడు. అది అవగానే ఏదో ఒకటి చెప్పి తనను అమెరికాకు తీసుకెళ్లిపోండి అంటుంది సౌందర్య. మీరు మాటి మాటికి నన్ను తీసుకెళ్లిపో అంటున్నారు కానీ.. ఒక పెళ్లి అయిన స్త్రీ.. తల్లి అయిన స్త్రీ అత్తారింట్లో ఉండాలి కదా అంటాడు బాబాయి.

karthika deepam 21 february 2022 full episode

మోనితకు ఉన్న ఏకైక బంధం.. మీరే. తనను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది సౌందర్య. తను బాగుండాలి అని అనుకుంటే మీరు తనను వెంటనే అమెరికాకు తీసుకెళ్లిపోండి అంటుంది. ఇక మోనిత దగ్గర్నుంచి ఎలాంటి న్యూసెన్స్ ఉండకూడదు అంటుంది. ఇంతలో మోనిత వస్తుంది. ఎలాంటి న్యూసెన్స్ ఉండకూడదు ఆంటి అంటుంది. ఏంటి ఇలా వచ్చారు. చెబితే నేనే కారు పంపించేవాడిని కదా. స్వాగతం పలికేదాన్ని కదా అంటుంది మోనిత. ఏంటి మోనిత.. తను నీ గురించి అంటూ ఏదో చెప్పబోతాడు. దీంతో తన గురించి వదిలేయండి అంటుంది మోనిత. కార్తీక్ అంటే నాకు ఇష్టం.. కార్తీక్, నా కొడుకు అందరితో నేను కలుస్తాను. మీరేం టెన్షన్ పడకండి బాబాయి అని చెప్పి అతడిని లోపలికి పంపిస్తుంది.

మిమ్మల్ని ఇక విసిగించను ఆంటి. మీరు నా బాబాయికి ఏం చెప్పారో కూడా నేను అర్థం చేసుకోగలను అంటుంది మోనిత. బాబాయి ఆపరేషన్ కాగానే నేను కూడా మిమ్మల్ని ఇక నుంచి అస్సలు డిస్టర్బ్ చేయను అంటుంది మోనిత. దీంతో నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పి అక్కడి నుంచి సౌందర్య వెళ్లిపోతుంది.

కట్ చేస్తే దీప.. తాడికొండ నుంచి ఇంటికి వస్తుంది. అమ్మ.. తాడికొండలో విజయలక్ష్మి అత్తయ్యను కలిశావా అని అడుగుతారు పిల్లలు. ఆ కలిశాను అమ్మ అంటుంది దీప. వెంటనే ఆనంద్ ను ఎత్తుకుంటారు పిల్లలు. ఇంతలో సౌందర్య వస్తుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నారు అత్తయ్య అంటుంది దీప.

దీంతో  మీరు లోపలికి వెళ్లి ఆడుకోండి అని పిల్లలను పంపిస్తుంది సౌందర్య. నేను బస్తీకి వెళ్లి వచ్చాను దీప అంటుంది సౌందర్య. దీంతో బస్తీకి ఎందుకు వెళ్లారు అంటుంది దీప. ఆ మోనిత.. బాబాయి ఆపరేషన్ పేరుతో ఏ కుట్ర చేస్తుందోనని భయమేస్తోంది అంటుంది సౌందర్య.

అక్కడ జరిగిన విషయాలు అన్నీ చెబుతుంది సౌందర్య. మనం ఎంత టెన్షన్ పడ్డా ఏం లాభం అత్తయ్య. డాక్టర్ బాబు మోనితను ఎందుకు నమ్ముతున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడం లేదు అంటుంది దీప.

మరోవైపు మోనిత బాబాయి ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు కార్తీక్. ఇద్దరు డాక్టర్లను పిలిచి.. తనకు ఆపరేషన్ లో సాయం చేయాలని చెబుతాడు. ఆ తర్వాత మోనిత గురించే ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో మరో డాక్టర్ వచ్చి.. పేషెంట్ ఆపరేషన్ డేట్, టైమ్ ఫిక్స్ చేయమంటారా అంటాడు. దీంతో టైమ్ ఉంది కదా.. నేను చెబుతా లెండి అంటాడు కార్తీక్.

Karthika Deepam 21 Feb Today Episode : మోనిత బాబాయికి డౌట్ రావడంతో మళ్లీ అతడిని తన బుట్టలో వేసుకున్న మోనిత

కట్ చేస్తే.. మోనిత బాబాయి డల్ గా కూర్చొని ఉంటాడు. కార్తీక్ ఫోన్ చేయగానే ఆసుపత్రికి వెళ్లిపోదాం.. అంటుంది. ఆ హాస్పిటల్ మనదే. మీకెందుకు టెన్షన్ అంటుంది. ఆపరేషన్ ఇవాళ కాదు కదా. మీరెందుకు తొందరపడతారు. మనం పరాయివాళ్లం కాదు కదా. మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి అంటుంది మోనిత.

ఏమోనమ్మా.. నువ్వేమో అల్లుడు అంటున్నావు. వాళ్లేమో అలా అంటారు. అసలు నాకు ఆపరేషన్ జరుగుతుందా? నేను బతుకుతానా అంటాడు బాబాయి. సరే.. నాకు కొంచెం పని ఉంది. నేను బయటికి వెళ్లి వస్తాను. ఈలోపు మీరు న్యూసో.. పేపరో చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది మోనిత.

మరోవైపు వాడు మారడమ్మా.. అని దీపతో అంటాడు ఆనంద రావు. మోనిత ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తుందో  అందరికీ తెలిసిందే. తను ఇప్పుడు ఎటువంటి ప్లాన్ వేసిందో మనకు అర్థం కావడం లేదు. తీరా తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.. అంటుంది దీప.

అత్తయ్య మీరే ఏదో ఒకటి చేయాలి. డాక్టర్ బాబే ఈ ఆపరేషన్ చేయాలని ఎందుకు పట్టుబడుతుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అంటుంది దీప. ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే ఆపరేషన్ చేయొద్దని కోరుకోం కదా అంటుంది సౌందర్య.

అవును సౌందర్య.. ఆ వ్యక్తికి నువ్వు కాకుండా.. వేరే వాళ్లతో ఆపరేషన్ చేయించు అని చెప్పేంత సమయం కూడా కార్తీక్ ఇవ్వడం లేదు అంటాడు ఆనంద రావు. మరోవైపు మోనిత కారులో వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్లడానికి బాబాయి చాలా తొందరపడుతున్నాడు అని అనుకుంటుంది.

ఇంతలో అప్పారావు కారుకు అడ్డం వస్తాడు. ఒరేయ్ చూసుకొని నడవరా అంటుంది మోనిత. చూసి.. వీడు అప్పారావు కదా అనుకుంటుంది. మేడమ్ నన్ను గుర్తు పట్టారా అంటాడు. దీంతో తాడికొండ హోటల్ కదా అంటుంది. గుర్తు పట్టారా అంటాడు.

ఈమెను డాక్టర్ బాబు అడ్రస్ అడగాలా వద్దా అని అనుకుంటాడు. ఒక అడ్రస్ చెప్పండి అంటాడు కానీ.. నాకు పని ఉంది పోరా.. అంటుంది. ఇంతలో అప్పారావు చేతుల్లో ఉన్న సంచి కింద పడుతుంది. అ సంచిలో నుంచి కోటేశ్ ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటోను చూసి షాక్ అవుతుంది మోనిత.

వెంటనే కారు దిగి ఆ ఫోటో చూసి.. వీడు నీకు తెలుసా అని అప్పారావును అడుగుతుంది మోనిత. దీంతో వీడా.. వీడితో నీకేం పని మేడం. వీడు ఇప్పుడు మిమ్మల్ని కలవడు.. కలవలేడు కూడా అంటాడు. దీంతో అప్పారావు చెంప చెళ్లుమనిపిస్తుంది.

వీడు నీకు తెలుసా చెప్పు అంటుంది. దీంతో కోటేశ్ చనిపోయాడని చెబుతాడు అప్పారావు. వెంటనే తన ఫోన్ తీసుకొని అందులో కోటేశ్ వీడియోను చూస్తుంది. ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడో తెలుసా అని అడుగుతుంది మోనిత. దీంతో ఇంకెక్కడ ఉంటాడు మేడమ్. మా అక్క బావలతో ఉన్నాడు అంటాడు అప్పారావు.

శ్రీవల్లి, కోటేశ్ చనిపోయాక ఆ బాబు మా అక్కబావలతోనే ఉంటున్నాడు అని ఆనంద్ ను ఎత్తుకున్న కార్తీక్ ఫోటోను చూపిస్తాడు అప్పారావు. ఆ ఫోటోను చూసి షాక్ అవుతుంది మోనిత. అరేయ్.. నువ్వు చెబుతుంది నిజమేనా అని అడుగుతుంది మోనిత. దీంతో అవును మేడమ్ అంటాడు అప్పారావు. దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి…

9 hours ago

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…

10 hours ago

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

11 hours ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

12 hours ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

13 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

13 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

17 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

18 hours ago