Karthika Deepam 24 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1387 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక రోజు ఐస్ క్రీమ్ పార్లర్ లో శౌర్య.. నిరుపమ్ బావను ప్రేమిస్తున్నట్టు తెలిసింది. అప్పటి నుంచి నా మనసును మార్చుకున్నాను. అమ్మానాన్న చనిపోయేముందు చివరి సారిగా అన్న మాట ఏంటో తెలుసా? హిమ.. శౌర్య జాగ్రత్త.. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అలాంటిది శౌర్య.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మనందరం ఇక్కడ సంతోషంగా ఉంటే.. శౌర్య కష్టాల పాలు అయింది. వీటన్నింటికీ నేనే కదా కారణం అనిపించింది. అందుకే అమ్మడాడీలకు నా ప్రేమను త్యాగం చేస్తున్నట్టు చెప్పాను. ఎలాగైనా నిరుపమ్ బావతో పెళ్లి చేస్తా అని ప్రామీస్ చేశాను. ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను నానమ్మ. వాళ్లిద్దరికీ పెళ్లయ్యాక నీకు చెప్పాలనుకున్నాను. నేనెవరో తెలిస్తే శౌర్య గొడవ చేస్తుంది. మళ్లీ దూరం వెళ్లిపోతుంది. తనకు జరిగిన నష్టానికి, కష్టానికి ఈ విధంగా అయినా రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనుకున్నాను అంటుంది హిమ.
తన కోసం మనం ఇంత బాధపడుతున్నాం. నిన్నంటే తను గుర్తుపట్టలేదు. నన్ను గుర్తు పట్టి కూడా ఇంటికి రాకుండా నానమ్మ అని నోరారా పిలవకుండా ఉందంటే లోపల ఎంత కష్టపడుతుందో కదా పాపం. మనకెందుకు దూరంగా ఉంటోందే.. తన మనసులో ఏముంది అని అడుగుతుంది సౌందర్య. శౌర్యకు నామీద ఎంత కోపం ఉందో నీకు తెలియదు నానమ్మ. ఈ పచ్చబొట్టు చిన్నప్పుడు ఏ ముహూర్తాన వేసుకున్నామో కానీ.. తన ముందు పచ్చబొట్టు దాచలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. తనేమో ఆ పచ్చ బొట్టు చూస్తూ నా మీద ఇంకా కోపం పెంచుకుంటోంది అంటుంది హిమ. త్వరలోనే శౌర్య, నిరుపమ్ బావ ఒకటి కావాలని కోరుకుందాం అంటుంది హిమ.
మరోవైపు నిరుపమ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఈరోజు నాకు రిలీఫ్ గా ఉంది అనుకుంటాడు. పాపం జ్వాల బాగా ఫీల్ అయింది అనుకుంటాడు. కానీ.. అందులో నా తప్పేం లేదు కదా. తనకు నిజం చెప్పాను. అంతే చాలు అనుకుంటాడు. సారీ జ్వాల. అనవసరంగా నువ్వే ఏదేదో ఊహించుకున్నావు. నీకు నిజం చెప్పాలని చాలా ట్రై చేశాను కానీ.. కుదరలేదు.
హిమ తప్పు కూడా ఉంది. ఏదైతేనేం జ్వాలకు అసలు నిజం తెలిసింది. ఇక నాకు, హిమకు పెళ్లి మిగిలిఉంది.. అని అనుకుంటాడు. హిమ పిచ్చిది.. తనకు క్యాన్సర్ ఉందని హిమను పెళ్లి చేసుకోమని చెప్పింది. అయినా ఎవరైనా చివరకు చనిపోవాల్సిందే కదా. వెనుకా ముందు అంతే.. ఉన్నన్ని రోజులు హిమను జాగ్రత్తగా చూసుకుంటాను. హిమ నా జీవితం. ఇకపై తనే నా ప్రపంచం. తను నాతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందంగా మార్చాలి అని అనుకుంటాడు నిరుపమ్.
మరోవైపు జ్వాల ఇంటికి వెళ్తుంది సౌందర్య. ఏంటి సీసీ సడెన్ గా ఇలా వచ్చావు అని అంటుంది. ఏం లేదే.. నిన్ను ఆశ్రమంలో చూశాను అంటుంది సౌందర్య. ఆశ్రమంలోనా.. అక్కడికి నువ్వెందుకు వచ్చావు అంటుంది. దీంతో ఆ ఆశ్రమం నాదే. దానికి సంబంధించిన ఖర్చులు అవి నేనే చూసుకుంటాను అంటుంది సౌందర్య.
దీంతో ఆ అనాథాశ్రమం నువ్వు చూసుకుంటున్నావా.. దానికి ఖర్చులు నువ్వు పంపుతావా.. నువ్వు కట్టిన అనాథాశ్రమంలో నేను చేరానా.. నేను పెరిగానా అని అనుకుంటుంది. కూర్చో సీసీ అంటుంది. ఇంట్లో ఎవరూ లేరా అంటే ఊరెళ్లారు అంటుంది జ్వాల.
మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి.. ఎవరా అబ్బాయి అని అడుగుతుంది. నాకు చెప్పొచ్చు కదా.. పరాయిదాన్ని అయిపోయానా అంటుంది. మరి.. నాకేం అవుతావు నువ్వు అంటుంది. దీంతో నానమ్మను అనుకో అంటుంది. దీంతో చుట్టరికాలు నాకు ఎప్పుడూ అచ్చిరాలేదు అంటుంది జ్వాల.
నా గొడవ నీకెందుకు కానీ.. అంటుంది జ్వాల. నా కథ నీకెందుకు కానీ.. సినిమాకు వెళ్దామా అంటుంది. ఇంత బాధ పెట్టుకొని ఎలా నవ్వగలుగుతున్నావు అని అడుగుతుంది సౌందర్య. దీంతో కష్టాల్లో ఉన్నవాళ్లకు నవ్వడమే పరిష్కారం తెలుసా అంటుంది జ్వాల.
సీసీ.. ఈ ప్రేమ ఉంది చూశావూ.. మహా చెడ్డది కదా అంటుంది. మంచి మంచి వాళ్లనే ఆడిస్తుంది కదా అంటుంది జ్వాల. మీది లవ్ మ్యారేజా అని అడుగుతుంది. దీంతో ఎందుకలా అడిగావు అంటుంది సౌందర్య. ప్రేమలు, పెళ్లిళ్ల మీద నాకు విరక్తి పుట్టింది. నా లవ్ వన్ సైడ్ సీసీ అంటుంది.
నాకు ఏం మాట్లాడాలో.. ఏం చేయాలో తెలియట్లేదు అంటుంది జ్వాల. దీంతో కూర్చో అని అంటుంది సౌందర్య. నేనున్నాను కదా.. నీ బాధ నాకు చెప్పుకో అంటుంది సౌందర్య. బాధలు చెప్పుకోవడాలు మనకు పడవు. మనం ఆటైప్ కాదు. దెబ్బ తాకిందని కూర్చోవడం కాదు.. మరింత స్పీడ్ గా పరిగెడతాను అంటుంది జ్వాల.
తర్వాత నిరుపమ్ ను ఎంతలా ప్రేమిస్తుందో సౌందర్యకు చెబుతుంది జ్వాల. దీంతో సౌందర్య.. జ్వాలను హత్తుకుంటుంది. కట్ చేస్తే స్వప్న, శోభ.. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంటికి కోడలుగా ఎప్పుడు వస్తానా అని నా మనసు తహతహలాడుతోంది అంటుంది శోభ.
దీంతో ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు శోభ అంటుంది స్వప్న. దీంతో హిమకు నిరుపమ్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా.. అటువంటప్పుడు హిమకు బలవంతంగా పెళ్లి చేయడం అవసరమా ఆంటి. డైరెక్ట్ గా నన్నే పెళ్లి చేసుకోమని చెప్పొచ్చు కదా అంటుంది శోభ.
శోభలో ఆశలు రేకెత్తించొద్దు అని హిమ నాకు సలహా ఇచ్చింది.. అంటుంది స్వప్న. మరోవైపు జ్వాల ఇంట్లో వంట వండుతుంది సౌందర్య. తన చేత్తో శౌర్యకు వండిపెట్టాలని అనుకుంటుంది జ్వాల. నాకు దోసకాయ పచ్చడి వద్దు అది నాకు ఇష్టం లేదు అంటుంది జ్వాల.
మరోవైపు హిమను అడ్డంగా బుక్ చేస్తుంది శోభ. నేను హిమను మాట్లాడుతున్నాను.. దమ్ముంటే ఇక్కడికి రా అని అంటుంది శోభ. దీంతో జ్వాల ఆటో వేసుకొని అక్కడికి వస్తుంది. చూస్తే అక్కడ హిమ ఉంటుంది. తింగరిని చూసి.. నీ పేరేంటో చెప్పు అని అడుగుతుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.