Home » Entertainment » Karthika Deepam 25 June 2022 Full Episode
Entertainment

Karthika Deepam 25 June Today Episode : శోభకు సౌందర్య షాక్.. శోభ ప్లాన్ రివర్స్.. ఇంతలో తింగరే హిమ అని తెలుసుకున్న జ్వాల షాకింగ్ నిర్ణయం?

Authored By
Varun G
The Telugu News | Updated on: June 25, 2022, 10:39 am
Advertisement

Karthika Deepam 25 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 జూన్ 2022, శనివారం ఎపిసోడ్ 1388 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వంట రెడీ చేస్తుంది సౌందర్య. జ్వాలకు తినిపిస్తుంది. దీంతో జ్వాలకు తన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. ఏంటి సీసీ ఇది. వంట చేశావు కదా. నేను తింటాను కదా అంటుంది. దీంతో నేను వెళ్లిపోతే నువ్వు తింటావో తినవో అని.. అందుకే తిను అంటుంది సౌందర్య. దీంతో నానమ్మ నీ చేతులతో తినే అదృష్టం నాకు లేకుండా పోయింది అని అనుకుంటుంది జ్వాల. నువ్వు ఎవరు సీసీ అంటుంది జ్వాల. మీ రేంజ్ వేరు.. నా రేంజ్ వేరు. నువ్వు ఇలా తినిపిస్తుంటే అంటుంది జ్వాల. తినిపిస్తుంటే ఎవరైనా గుర్తొచ్చారా అంటుంది సౌందర్య. దీంతో నాకెవరు ఉన్నారు సీసీ. నాకు ఎవరూ లేరు. ఉన్న డాక్టర్ సాబ్.. నా అనుకున్న డాక్టర్ సాబ్ కూడా దూరం అయిపోయారు అంటుంది జ్వాల.

Advertisement

karthika deepam 25 june 2022 full episode

పోనీ మీ డాక్టర్ సాబ్ తో నీ తరుపున మాట్లాడమంటావా? అని అడుగుతుంది సౌందర్య. దీంతో నువ్వేం చేస్తావులే. అందరినీ పోగొట్టుకున్నాను. అందరినీ పోగొట్టుకోవడం నాకు బాగా అలవాటు అయింది అంటుంది జ్వాల. నువ్వు కూడా తినకపోయావా అని అంటుంది జ్వాల. దీంతో నువ్వు తిన్నావు కదా.. నాకు కడుపు నిండిపోయింది అంటుంది సౌందర్య. నువ్వు ఇక వెళ్లు. నీకోసం ఆ యంగ్ మ్యాన్ ఎదురు చూస్తుంటాడేమో పాపం అంటుంది. సరదాగా మా ఇంటికి రావచ్చు కదా అంటుంది సౌందర్య. దీంతో మీ ఇంటికా అంటుంది జ్వాల. రావే రౌడీ పిల్ల అంటుంది. కొన్నాళ్లు మా ఇంట్లో ఉండు అంటుంది. కొన్నాళ్లేనా అంటే.. ఎప్పటికీ ఉండిపో అంటుంది సౌందర్య. అక్కడికి రావాలని నాకూ ఉంది నానమ్మ. కానీ.. నా శత్రువును చూస్తే కోపంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని మనసులో అనుకుంటుంది. నాకు ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు శత్రువులు. ఒకరు హిమ.. మరొకరు తింగరి. ఆ తింగరి నన్ను మామూలుగా మోసం చేయలేదు. నా జీవితాన్నే లాగేసుకుంది అని అనుకుంటుంది.

Advertisement

మనుషులు ఎంత మోసం చేస్తారు కదా సీసీ. నా డాక్టర్ సాబ్ ను అది పెళ్లి చేసుకుంటుందట అని అంటుంది. అది మోసం కాదే.. నీ కోసమే తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. నీ బాధ్యత అది తీసుకుంది. నిజం చెప్పలేను. తింగరి హిమ అని తెలిస్తే దాని మీద కోపం పెరుగుతుంది నీకు అని మనసులో అనుకుంటుంది.

Karthika Deepam 25 June Today Episode : ముంబై వెళ్లిపోతున్న ప్రేమ్

ప్రేమిస్తే ఇంత బాధ ఉంటుందా సీసీ అంటుంది జ్వాల. తర్వాత సౌందర్య అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. శోభ ఫోన్ చేస్తుంది. అదే మేడమ్ నేను ఒక ఆలోచన చెప్పాను కదా. చెప్పింది ఏం చేశారు మీరు. నిరుపమ్ ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ మనవరాలు ఎవరో చెబుతా అన్నాను కదా అంటుంది శోభ.

Advertisement

దీంతో నువ్వు ఎక్కడుంటావో చెప్పు. నేనే అక్కడికి వస్తాను. మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది సౌందర్య. దీంతో సరే మేడమ్.. ఇప్పుడే లొకేషన్ పంపిస్తా అంటుంది. మరోవైపు ప్రేమ్.. హిమ గురించే ఆలోచిస్తూ డల్ గా ఉంటాడు.

ఇంతలో అక్కడికి నిరుపమ్ వస్తాడు. నువ్వు మళ్లీ ముంబై వెళ్తున్నావా అని అడుగుతాడు. దీంతో అవును అంటాడు ప్రేమ్. నా పెళ్లి నువ్వు మిస్ అయితే ఎలా అంటాడు నిరుపమ్. నువ్వే ఫోటోలు తీయాలి.. వీడియోలు తీయాలి. నువ్వు అందంగా ఫోటోలు తీస్తే తర్వాత మళ్లీ మళ్లీ ఆ ఫోటోలను చూసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అంటాడు నిరుపమ్.

మరోవైపు క్యాన్సర్ పేషెంట్ ను పెళ్లి చేసుకోవడం అవసరమా అంటాడు ప్రేమ్. దీంతో చావు అనేది ఎవరికైనా తప్పదు. ఎన్ని సంవత్సరాలు బతికాం అన్నది కాదు.. ఎంత ఆనందంగా ఉన్నాం అనేదే ముఖ్యం అంటాడు నిరుపమ్. మరోవైపు సౌందర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శోభ.

ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. సౌందర్య అక్కడికి వస్తుంది. ఇంతకీ ఏం ఆలోచించారు అని అడుగుతుంది శోభ. దీంతో ఏ విషయం గురించి శోభ అంటుంది సౌందర్య. దీంతో ఏంటి మేడమ్ అప్పుడే మరిచిపోయారా అంటుంది శోభ. మీకు డీల్ చెప్పాను కదా అంటుంది.

Advertisement

దీంతో శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. నువ్వేదో చెబితే వినడానికి నేను రాలేదు. ఇప్పుడు చెబుతున్నాను గుర్తుపెట్టుకో. నా ఫ్యామిలీ జోలికి కానీ.. నా మనవడు, మనవరాళ్ల జోలికి వచ్చావనుకో.. నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. అతి తెలివి చూపించకు. నోరు అదుపులో పెట్టుకో. నా మనవరాలిని, నా ఫ్యామిలీ వాళ్లను ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను అని వార్నింగ్ ఇస్తుంది సౌందర్య.

కట్ చేస్తే.. ఎలాగైనా హిమను బుక్ చేయాలని అనుకొని.. జ్వాలకు ఫోన్ చేసి హిమలా మాట్లాడుతుంది శోభ. నా దగ్గరికి రా అని హిమ ఉన్న అడ్రస్ చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి