
karthika deepam 27 september 2021 monday latest episode
karthika deepam 27 september 2021 monday latest episode
Karthika Deepam 27 Sep Tomorrow Episode Highlights: కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ సోమవారం రిలీజ్ కానుంది. ఆదివారం ఎపిసోడ్ ఉండదు. శనివారం రోజు ఏం జరిగిందో తెలుసు కదా. స్కూల్ లో షైనీ అన్నమాటలకు శౌర్య, హిమ బాగా బాధపడి తన తండ్రి కార్తీక్ తో మాట్లాడరు. కారు ఎక్కేటప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు. కారులోనూ మాట్లాడరు. చివరకు ఇంటికి వచ్చాక కూడా తనతో మాట్లాడుకుండా వెళ్లిపోతారు.
karthika deepam 27 september 2021 monday latest episode
పిల్లలు నాతో సరిగ్గా ప్రవర్తించడం లేదంటూ తల్లి సౌందర్య దగ్గరికి వెళ్లి కార్తీక్ మొర పెట్టుకుంటాడు. ఏమైంది పిల్లలకు. వెళ్లేటప్పుడు బాగానే ఉన్నారు కదరా. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. వెళ్లేటప్పుడు బాగానే ఉన్న పిల్లలు.. ఇప్పుడు నాతో మాట్లాడటానికి కూడా భయపడతున్నారు. చివరకు కారులో నా పక్కన కూడా కూర్చోవడం లేదంటూ బాధపడతాడు కార్తీక్.
karthika deepam 27 september 2021 monday latest episode
దీప మాత్రం ఇంకా వారణాసి చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి చెప్పిన విషయం గురించి, మోనిత గురించి ఆలోచిస్తుంటుంది. మీ అక్క మొగుడు పెద్ద గ్రంధమే నడిపాడట కదా అంటూ బస్తీలో అందరూ హేళన చేస్తున్నారక్క అంటూ వారణాసి దీప ముందు బోరుమన్న విషయం తెలిసిందే.
karthika deepam 27 september 2021 monday latest episode
ఇంటికి వచ్చాక ఆ విషయాన్ని సౌందర్యకు కూడా చెబుతుంది దీప. ఏంటి దీప నువ్వు.. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటామా? లోకం అన్నాక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటామా? వద్దు.. నువ్వు ముందు ఇవన్నీ వదిలేయ్. దీపను నేను ఎప్పుడూ ఇలా చూడాలనుకోలేదు. వద్దు.. నువ్వు అలా చేయకు. ధైర్యంగా ఉండు. నువ్వే ధైర్యంగా లేకపోతే ఎలా.. అని సౌందర్య దీపకు సర్ధి చెబుతుంది.
karthika deepam 27 september 2021 monday latest episode
పిల్లలు ఇంటికి వచ్చాక విచిత్రంగా ప్రవర్తించడం సౌందర్య కూడా గమనిస్తుంది. కార్తీక్, సౌందర్య.. ఇద్దరూ మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన రౌడీని చూసి.. సౌందర్య పిలుస్తుంది. దీంతో పట్టించుకోకుండా వెళ్లిపోతుంది శౌర్య. ఏమైంది వీళ్లకు అని సౌందర్య కూడా అనుకుంటుంది.
karthika deepam 27 september 2021 monday latest episode
మొత్తం మీద మోనిత పీడ విరగడ అయిందని అందరూ అనుకున్నారు కానీ.. మోనిత జైలులో కూర్చొని ప్లాన్లను బాగానే వర్కవుట్ చేస్తోంది. జైలులో కూడా మోనితకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. మోనితే దగ్గరుండి అన్ని ట్రీట్ మెంట్స్ చేస్తుండటంతో మోనితకు అక్కడున్న సిబ్బంది అందరూ మద్దతు ఇస్తున్నారు. ఏం కావాలన్నా చేసి పెడుతున్నారు. అందుకే.. తన ఫ్రెండ్ ను కలవాలని.. ఒకసారి ఇక్కడికి పిలవమని చెబుతుంది. దీంతో కానిస్టేబుల్ కూడా ఓకే చెబుతుంది.
karthika deepam 27 september 2021 monday latest episode
మరోవైపు కార్తీక్ కు టెన్షన్ మొదలవుతుంది. అసలు.. తన విషయంలో ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతుంటాడు. బయటికి వెళ్లలేకపోతున్నా అని తనలో తానే మధనపడిపోతాడు. ఎలాగైనా యూఎస్ వెళ్లిపోవాలని కార్తీక్ అనుకున్నప్పటికీ.. దీప, సౌందర్య ఒప్పుకుంటారో లేదో అనే విషయం మాత్రం తెలియదు.
karthika deepam 27 september 2021 monday latest episode
సౌందర్య ముందు పిల్లలు ఎందుకు అలా అయ్యారో తెలుసుకుందాం అని అనుకుంటుంది. పిల్లల దగ్గరికి వెళ్లే సరికి.. పిల్లలు తనకు జరిగిన విషయం మొత్తం చెబుతారు. షైనీ.. నాన్నకు, మోనితకు ఏదో ఉందని చెప్పిందని అంటారు. ఆ విషయం విన్న సౌందర్య షాక్ కు గురవుతుంది. వెంటనే వాళ్లను కార్తీక్, దీప దగ్గరికి తీసుకొస్తుంది.
karthika deepam 27 september 2021 monday latest episode
ఏంటే మీ బాధ. ఏంటి అసలు.. ఏం కావాలి మీకు. మా బాధలు మాకుంటే.. మీ బాధలు ఏంటి.. అని ప్రశ్నిస్తుంది దీప. కార్తీక్ కూడా ఏంటి బంగారం.. ఏమైంది చెప్పు అని హిమను అడుగుతాడు.
karthika deepam 27 september 2021 monday latest episode
అప్పుడు హిమ జరిగిన విషయం మొత్తం చెబుతుంది. స్కూల్ లో తన ఫ్రెండ్ షైనీ.. నువ్వు బ్యాడ్ బాయ్ వి అని చెప్పిందని చెబుతారు. దీంతో అందరూ షాక్ అవుతారు. నీకు, మోనిత ఆంటీకి మధ్య ఏదో ఉందంట కదా.. అసలు.. మోనిత ఆంటీ జైలుకు ఎందుకు వెళ్లింది అంటూ మళ్లీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు.
karthika deepam 27 september 2021 monday latest episode
పిల్లలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతాడు కార్తీక్. మరి.. పిల్లలకు జరిగిన విషయాన్ని కార్తీక్ చెబుతాడా? లేక మళ్లీ అబద్ధం చెబుతాడా? అబద్ధం చెబితే పిల్లలు నమ్ముతారా? అనే విషయాలు తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
karthika deepam 27 september 2021 monday latest episode
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.