
karthika deepam 28 june 2022 full episode
Karthika Deepam 28 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1390 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాలకు ఒక సర్ ప్రైజ్ ఇస్తుంది సౌందర్య. తనకు ఒక కవర్ ఇచ్చి ఓపెన్ చేసి చూడు అంటుంది. ఆ కవర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది జ్వాల. కోపంతో తను చింపి పడేసిన నిరుపమ్ ఫోటోను సౌందర్య అతికించి అందులో పెడుతుంది. ఏంటి సీసీ నువ్వు అతికించావా అని అడుగుతుంది జ్వాల. దీంతో అవును అంటుంది. దీంతో తను మోసం చేసింది నన్ను. మనం తెలివితక్కువ వాళ్లను చేసి ఆడుకున్నట్టు అంటే. మోసపోవడం అంటే ఓడిపోవడం కంటే ఘోరం అంటూ ఆవేశపడుతుంది జ్వాల. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి బాధలను దిగమింగుకోవాలి అంటుంది సౌందర్య. దీంతో ఎందుకు మోసపోవాలి. ఎందుకు భయపడాలి. ముందు ఆ తింగరి ఎలా ఉండేదో తెలుసా? ప్రతి విషయానికి భయపడేది. తనను నేను ప్రేమతో నాతో తిప్పుకున్నాను. మార్చాను. తను మారింది. నన్ను మోసం చేసేంత గొప్పగా మారింది అంటుంది జ్వాల.
karthika deepam 28 june 2022 full episode
సీసీ.. ఆ తింగరిని క్షమించేదే లేదు అంటుంది జ్వాల. ఈ జ్వాల ప్రేమించినా విపరీతంగానే.. ద్వేషించినా విపరీతంగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మానాన్నలను పొట్టన పెట్టుకున్న శత్రువు కంటే.. ఆ తింగరి చేసిన ద్రోహం, మోసం చాలా ఎక్కువ. దీని మీదే నా కోపం ఎక్కువగా ఉంది. కడుపు రగిలిపోతోంది సీసీ. నా ప్రేమ లాగేసుకుంది. నా జీవితాన్ని నా డాక్టర్ సాబ్ ను నా నుంచి దూరం చేసింది. క్షమించను.. వదిలేదే లేదు అంటుంది జ్వాల. దీంతో సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే.. శోభ దగ్గరికి వెళ్లి శోభ చెంప చెళ్లుమనిపిస్తుంది హిమ. ఏంటి చేయాల్సింది చేసి.. ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నావా? ఇంకోసారి జ్వాలకు.. నేను హిమను అని ఫోన్ చేశావనుకో మా బావ దగ్గరికి వెళ్లి నాకు క్యాన్సర్ లేదు.. ఇదంతా ఉత్తుత్తిదే అని చెబుతాను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ శోభకు వార్నింగ్ ఇస్తుంది హిమ. కానీ.. అదంతా కల. హిమ తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా కలగంటుంది శోభ.
హిమ రాలేదా.. నిజంగానే ఒకవేళ హిమ.. నిరుపమ్ కు చెబితే ఏంటి నా పని అని భయపడుతుంది. మరోవైపు సౌందర్య.. ఏంటే నీ ప్రేమకు పెద్దరికం చేయమంటావా అని అడుగుతుంది జ్వాలను. దీంతో ఏం మాట్లాడుతున్నావు సీసీ. పెళ్లికి పెద్దరికంతో పని ఉంటుంది కానీ.. ప్రేమకు పెద్దరికంతో ఏంటి పని అంటుంది.
దీంతో నీకు నేను హెల్ప్ చేస్తాను. ఆ అబ్బాయి నాకు తెలుసు. నేను మాట్లాడనా అంటుంది సౌందర్య. దీంతో ఏం మాట్లాడుతావు సీసీ. నువ్వు వెళ్తే నిన్నూ తిడతాడు. నా కోసం నువ్వు మాటలు పడాల్సిన అవసరం లేదు అంటుంది జ్వాల.
వాడు నా మనవడు.. నువ్వూ నా మనవరాలివే. ఏదో నీ తృప్తి కోసం అంటున్నాను కానీ.. నిరుపమ్ బాధ నేనెక్కడ తగ్గించగలను అని అనుకుంటుంది సౌందర్య. తర్వాత నేను నీ చేతికి గోరింటాకు పెట్టనా అని అడుగుతుంది సౌందర్య. ఏంటి సీసీ నన్ను పెళ్లి కూతురును చేయడానికి నువ్వు తహతహలాడుతున్నావు అని అంటుంది జ్వాల.
మరోవైపు జ్వాల నిరుపమ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన ఆటో తనకు ఇచ్చేస్తుంది. దీంతో స్వప్న తన చెంప చెళ్లుమనిపిస్తుంది. చెంప మీద కొట్టిన దానికంటే మనసు మీద కొట్టింది ఎక్కువ బాధపెడుతుంది. మేడమ్ ఇంకోసారి చెయ్యి ఎత్తితే మర్యాదగా ఉండదు అంటుంది జ్వాల.
ఇలాంటి అలగారి జనాలతో నీకేంట్రా అని అంటుంది స్వప్న. మేడమ్ అలగా అనకండి. అలాంటి దాన్నే అయితే ఆటో తిరిగి ఇచ్చేదాన్నే కాదు. డాక్టర్ సాబ్.. మీ మమ్మీ నన్ను కొట్టినా నేను ఓపిక పట్టాను. అలాగా.. ఏదైనా మాట అనేముందు ఆలోచించుకుంటే మంచిది అని అంటుంది జ్వాల.
మరోవైపు శోభ.. నిరుపమ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ జ్వాల ఆటోను చూసి షాక్ అవుతుంది శోభ. మరోవైపు నిరుపమ్.. పెళ్లి కార్డుల మీద అందరి పేర్లు రాస్తుంటాడు. హలో ఆంటి అంటుంది. పెళ్లి కార్డు చూసి షాక్ అవుతుంది శోభ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.