Karthika Deepam 28 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 1311 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ వెళ్దామా అంటుంది శౌర్య. దీంతో సత్యం.. నువ్వు వెళ్లమ్మా.. నీకు లేట్ అవుతుంది కదా.. నన్ను మా వాడు డ్రాప్ చేస్తాడు అంటాడు సత్యం. ఏంటి సార్.. మీకు ఆటో అంటే నచ్చదా అని అడుగుతుంది శౌర్య. దీంతో సరే.. వస్తానులే.. నీ ఆటోలోనే వస్తాను అంటాడు సత్యం. అదే సమయంలో రిసెప్షన్ దగ్గర సౌందర్య.. ఏదో చేస్తూ ఉంటుంది. అవును.. ఇద్దరూ మీ కొడుకులేనా అని అడుగుతుంది శౌర్య.
దీంతో అవును.. ఒకడేమో దూకుడు వ్యక్తిత్వం ఉన్నవాడు.. ఇంకొకరు చాలా సైలెంట్ అంటాడు సత్యం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అంటుంది దీంతో మా ఫ్యామిలీ స్టోరీ ఇప్పట్లో అయిపోదులే అంటాడు సత్యం. ఇంతలో సార్ ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి గుడికి వెళ్లాలి అనుకుంటుంది శౌర్య. మరో వైపు కారులో సౌందర్య వెళ్తూ.. మా కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏంటో ఇది.. అని అనుకుంటుంది. దీపా, కార్తీక్ పేరు మీద అన్నదానం చేయిద్దామనుకున్నాను. ఇంతలో ఆయన ఆసుపత్రిలో పడ్డారు అనుకుంటుంది సౌందర్య.
బతికున్నన్నాళ్లు కష్టాలు పడ్డారు. తీరా ఇప్పుడు అన్నదానం చేయిద్దామంటే ఎన్నో అడ్డంకులు.. అనుకుంటుంది సౌందర్య. కట్ చేస్తే.. శౌర్య గుడికి వెళ్తుంది. అన్నదానానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేశారా అని ఇంద్రుడు, చంద్రమ్మను అడుగుతుంది.
అయితే.. ఇద్దరూ బాధగా ఉండటం చూసి ఏమైంది అని అడుగుతుంది శౌర్య. గుడిలోకి వచ్చి దండం పెట్టుకుంటుంటే తాము తప్పు చేసినట్టుగా ఏదోలా ఉంది అటారు. దీంతో సరే.. నేను ఇప్పుడే వస్తాను. మీరు లోపలికి వెళ్లండి అని చెప్పి బయటికి వస్తుంది శౌర్య.
అక్కడే కాళ్లు కడుక్కుంటూ ఉంటుంది సౌందర్య. కానీ.. సౌందర్యను చూడదు. గుడి ఆఫీసుకు వెళ్లి అన్నదానానికి డబ్బులు ఇస్తుంది. దీంతో అతడు రిసీప్ట్ ఇస్తాడు. దాన్ని తీసుకొని పూజారికి ఇవ్వడానికి వెళ్తుంటుంది. అక్కడే ఉన్న సౌందర్యను గమనించదు.
పూజరి దగ్గరికి వెళ్లి చనిపోయిన మా అమ్మానాన్నల పేర్ల మీద అన్నదానం చేయించాలి అంటుంది. వాళ్ల పేర్లు చెప్పండి అంటే.. పేర్లు చెబుతుంది. ఆ పేర్లను బోర్డు మీద రాస్తాడు. తిరిగి ఆ రిసీప్ట్ ను శౌర్యకు ఇచ్చేస్తాడు పూజారి. బాబాయి.. ఇది సత్రంలో ఇచ్చి ఆ అన్నదాన కార్యక్రమం దగ్గరుండి చూసుకోండి అంటుంది శౌర్య.
కట్ చేస్తే.. అప్పుడే సౌందర్య పూజారి దగ్గరికి వచ్చి.. చనిపోయిన మా కొడుకు, కోడలు మీద అన్నదానం చేయించాలి అంటుంది. పేర్లు కోవెలమూడి కార్తీక్, కోవెలమూడి దీప అని పేర్లు చెప్పగానే.. ఇప్పుడే ఇవే పేర్లతో ఓ అమ్మాయి రసీదు ఇచ్చి వెళ్లింది అని చెబుతాడు పూజారి.
దీంతో షాక్ అవుతుంది సౌందర్య. శౌర్య వచ్చిందా అనుకుంటుంది. అంటే శౌర్య హైదరాబాద్ లోనే ఉందా అనుకుంటుంది. భగవంతుడా.. శౌర్య వచ్చిందా.. తను ఇక్కడే ఉందా. పూజారి గారు తన పేరు ఏమని చెప్పింది.. ఎలా ఉంది అని అడుగుతుంది సౌందర్య.
దీంతో తను ఎంత హైట్ ఉందో… ఏం డ్రెస్ వేసుకుందో అన్ని విషయాలు చెబుతాడు పూజారి. శౌర్యను వెతుక్కుంటూ గుడి బయటికి వస్తుంది సౌందర్య. ఇంతలోనే శౌర్య ఆటోలో వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి శౌర్య గురించి చెబుతుంది ఆనంద రావుకు.
కట్ చేస్తే.. నిరుపమ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. మరో వైపు ఆ ఆటో అమ్మాయిని చూస్తే మన శౌర్యను చూసినట్టు లేదు అని హిమతో అంటాడు నిరుపమ్. హిమ కూడా అదే అంటుంది. ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది. తనను చూసి షాక్ అవుతుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.