Karthika Deepam 28 Oct Today Episode : శౌర్యను దీప, కార్తీక్ కలుస్తున్నారని తెలిసి దీపను వాణితో చంపించేసిన మోనిత.. దీంతో కార్తీక్ షాక్.. శౌర్యకు ఈ విషయం తెలుస్తుందా?

Advertisement
Advertisement

Karthika Deepam 28 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1495 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్వాల గురించే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంద్రుడు. మాకు పిల్లలు లేకున్నా మేము మా సొంత బిడ్డలా చూసుకున్నాం. ఇప్పుడు పాపను నేను ఎలా వాళ్లకు అప్పగిస్తాను. అసలు.. చంద్రమ్మ బతుకుతుందా అని ఇంద్రుడు టెన్షన్ పడతాడు. మరోవైపు రేపు నా బిడ్డను చూస్తానని చాలా సంతోషంగా ఉంది అని కార్తీక్ తో అంటుంది దీప. నువ్వు శౌర్య కోసం పడే బాధను చూశాక అతడు వద్దన్నా అతడి ఆటో వెనుక వెళ్లాలని అనిపించింది కానీ.. అతడికి తెలిసిపోతే.. నువ్వే శౌర్య తల్లివని తెలిస్తే ఎలా అంటాడు కార్తీక్. దీంతో తెలిస్తే ఏంటి డాక్టర్ బాబు. శౌర్య నా బిడ్డ. తనను నాకు ఇవ్వడానికి సమస్య ఏంటి అంటుంది దీప. అయినా శౌర్య నిన్ను చూడగానే అమ్మ అని నీ దగ్గరికి వస్తుంది అంటాడు కార్తీక్.

Advertisement

karthika Deepam 28 october 2022 full episode

మరి అలా ఎందుకు అన్నారు డాక్టర్ బాబు అంటుంది దీప. మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. దీంతో ఆ అమ్మాయి పెద్దమనిషి అయిందని, తనకు ఫంక్షన్ చేయాలని ఆరాటపడుతున్నారు అంటాడు కార్తీక్. ఒకవేళ కన్న బిడ్డలా పెంచినా కూడా ఇన్నాళ్లు కన్న బిడ్డలా పెంచిన అమ్మాయిని నీకు ఇవ్వడానికి ఆలోచిస్తారేమో అంటాడు కార్తీక్. శౌర్య నా దగ్గరికి రావాలని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటుంది దీప. దీంతో నా కూతురు గురించి నేనెందుకు ఆలోచించను అంటాడు కార్తీక్. మరోవైపు ఈ వాణి ఏదో చేస్తుందని ఆశపడితే ఇప్పటి వరకు ఏం చేయలేకపోయింది అని టెన్షన్ పడుతుంది మోనిత. ఇంతలో మోనిత.. కావేరికి ఫోన్ చేస్తుంది. వాణి గురించి అడుగుతుంది. దాన్ని తక్కువ అంచనా వేయకు.. అంటుంది కావేరి. దీంతో ఏం నమ్మకమో ఏమో నాకు ఇక్కడ టెన్షన్ ఎక్కువయిపోతోంది అంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి టెన్షన్ ఎందుకు మోనిత అంటాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది.

Advertisement

నా ఫ్రెండ్ కావేరీతో మాట్లాడుతున్నా అంటుంది మోనిత. కావేరీ ఎవరు.. తనతో ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు. తను నీ ఊరి ఫ్రెండ్ కదా అంటాడు. కావేరీతో మాట్లాడినా తప్పేనా కార్తీక్. నువ్వు దీపతో కలిసి తిరుగుతున్నా కూడా నేను అడగడం లేదని ఇదంతా చేస్తున్నావా అంటుంది.

అవును.. నువ్వు దుర్గతో కలిసి తిరిగేది నిజమే కదా. నిరూపించు అంటాడు కార్తీక్. దీంతో వెళ్లి వాళ్లిద్దరి ఫోటో చూపిస్తుంది. దీంతో మరి ఇదేంటి అని ఫోన్ లో కార్తీక్, దీప కలిసి దిగిన పాత ఫోటోను చూపిస్తాడు. మరి ఇదేంటి అంటాడు. ఇద్దరం కలిసి దిగాం కదా.. అంటే మేము కూడా భార్యాభర్తలమే కదా అంటాడు. దీంతో మోనితకు ఏం మాట్లాడాలో అర్థం కాదు.

Karthika Deepam 28 Oct Today Episode : సంతోషంలో స్వీట్లు పంచిన దుర్గ

మరోవైపు ఇంద్రుడు ఆటోలో ఇంటికి తిరిగి వస్తాడు. ఉత్త చేతులతోనే వచ్చావా అంటుంది. ఉదయం నుంచి అమ్మ కావాలి అని శౌర్య ఏడుస్తోంది అంటుంది చంద్రమ్మ. దీంతో ఇంద్రుడుకు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్లు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు జ్వాలమ్మను చూపిస్తే అది మన దురదృష్టం అవుతుంది అని అనుకుంటాడు ఇంద్రుడు.

ముందు అమ్మాయికి బట్టలు, నగలు తీసుకొనిరా. డబ్బులు ఇస్తాను అంటుంది. దీంతో అవసరం లేదు అని దీప, కార్తీక్ ఇచ్చిన వాటిని చంద్రమ్మకు ఇస్తాడు. ఓహ్.. తెచ్చావా అంటుంది చంద్రమ్మ. ఆటో తాకట్టు పెట్టి తెచ్చాను అంటాడు. కానీ.. వినదు. నిజం చెప్పు గండ. ఇంత డబ్బు ఎక్కడిది. దొంగతనం చేశావా అని అంటుంది చంద్రమ్మ.

దొంగతనం చేసిన డబ్బులతో ఇవి తెస్తే జ్వాలమ్మ తట్టుకోలేదు అంటుంది చంద్రమ్మ. దీంతో నేను ఏ దొంగతనం చేయలేదు.. తప్పుడు పని చేయకుండా తీసుకొచ్చాను అని చెప్పి ఆటోలో వెళ్లిపోతాడు ఇంద్రుడు. మరోవైపు శౌర్య కోసం పిండి వంటలు చేస్తూ ఉంటుంది దీప.

ఇప్పటికైనా అత్తమ్మ ఆచూకీ తెలిసింది. మిగితా కార్యక్రమం అయినా నా చేతులతో చేయిస్తాను అని అనుకుంటుంది. నిజంగా అక్కడ ఉంది శౌర్య యేనా. అక్కడ శౌర్య లేకపోతే.. అని అనుకుంటుంది దీప. ఎందుకు అన్ని రకాలుగా ఆలోచిస్తున్నావు. అక్కడ ఉన్నది నీ అత్తమ్మే అని అనుకుంటుంది దీప.

ఇంతలో అక్కడికి వాణి వస్తుంది. వదిన ఇప్పుడు ఇన్ని పిండి వంటలు చేస్తున్నారేంటి.. ఎవరి కోసం అని అడుగుతుంది. దీంతో ఇవి నాకూతురు కోసం అంటుంది. దీంతో కూతురా.. నీ కూతురు ఇక్కడే ఉందా వదిన అంటుంది. దీంతో అవును వాణి.. నాకూతురు ఇక్కడే ఉంది అంటుంది.

వాళ్లు చిక్ మగళూర్ వచ్చినప్పుడు ఏం జరిగిందో అంతా చెబుతుంది దీప. ఇన్నాళ్టికి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోగలిగాను కానీ.. తెలిసే సరికి తను పుష్పవతి అయింది. అందుకే ఇవన్నీ చేస్తున్నాను అంటుంది దీప. తను నిజంగా నీ కూతురు అనిపిస్తోందా అంటుంది వాణి. దీంతో అవును.. నాకూతురే అంటుంది దీప.

ఇంతలో దుర్గ వచ్చి స్వీట్ తీసుకో అంటాడు. వాణి నువ్వు కూడా తీసుకో అంటాడు. ఏమైంది అని అడుగుతుంది దీప. ఇప్పుడే కార్తీక్ సార్ మోనిత దుమ్ము దులిపాడు. ఇప్పటి వరకు మోనిత ఏమన్నా పడ్డ కార్తీక్ సార్ ను చూశా. మొట్టమొదటి సారి మోనిత దుమ్ముదులిపే కార్తీక్ సార్ ను చూశా అంటాడు.

సార్ కు గతం గుర్తొస్తే ఉంటది.. అది ఊహాతీతం అని చెప్పి దుర్గ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయం వెంటనే మోనితాకు చెప్పాలని అనుకుంటుంది వాణి. వెంటనే అక్కడికి వెళ్లి అసలు విషయం చెబుతుంది మోనితకు. అలా జరగడానికి వీలు లేదు. వాళ్లు వాళ్ల కూతురును కలిస్తే ఆగిపోయింది అని అనుకున్న వాళ్ల జీవితం మొదలవుతుంది. మొదలైంది అని అనుకున్న నా జీవితం ఆగిపోతుంది అంటుంది.

అందుకే వాళ్లు సూర్యోదయం చూడకూడదు అని చెబుతుంది మోనిత. దీంతో ప్లాన్ రెడీ. మీరు డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పి దీప, దుర్గ పడుకున్న ఇంటికి నిప్పు పెడుతుంది వాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Box Office 2026 : టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం .. 10 రోజులు, 5 సినిమాలు, 800 కోట్లు..!

Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…

27 minutes ago

Home Remedies: ఇంట్లో కీటకాల బెడదకు చెక్: రసాయనాలు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే పరార్..!

Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…

1 hour ago

Blue Berries : బ్లూ బెర్రీ తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అసలు వదులరు అవేంటో తెలుసా?

Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…

2 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 21 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

3 hours ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…

11 hours ago

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!

Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…

12 hours ago

Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ల‌పై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుంది..?

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…

13 hours ago

KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…

14 hours ago