Karthika Deepam 30 Aug Monday Episode Highlights : కార్తీక దీపం సీరియల్ ఆదివారం ప్రసారం కాదు. మళ్లీ సోమవారమే ప్రసారం అవుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే కార్తీక దీపం సీరియల్ ప్రసారం అవుతుంది. అయితే.. సోమవారం ఎపిసోడ్ 30 ఆగస్టు 2021 ఎపిసోడ్ 1131 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఎపిసోడ్ ఇప్పటికే చూసేశాం.
శనివారం ఎపిసోడ్ లో కార్తీక్, రోషిణి మధ్య ముఖ్యమైన విషయాలు చోటు చేసుకుంటాయి. అవును.. మోనిత క్రిమినలే.. అయినంతమాత్రాన.. తనను చంపేస్తావా? తనను చంపే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. మోనిత.. అంజికి గురి పెట్టి బెదిరించే వీడియోను నేను ఎప్పుడో చూశా. తను చనిపోయాక.. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. మోనిత శవాన్ని ఎక్కడ దాచావు.. అనేదే ఇప్పుడు తెలుసుకోవాల్సింది.. అంటూ కార్తీక్ పై ఏసీపీ రోషిణి సీరియస్ అవుతుంది.
మోనిత ఫోటోకు దండ వేసి ఉన్న ఫోటోను తన ఫోన్ లో చూపిస్తూ.. మోనిత హాస్పిటల్ కు వెళ్లి వచ్చా. మోనితను చంపింది నువ్వే అని అక్కడి వారంతా బలంగా నమ్ముతున్నారు. అంతే కాదు.. భాగ్య అక్కడికి వెళ్లి మోనిత గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడిందంట. ఇదేనా మీ సంస్కారం.. అంటూ రోషిణి.. కార్తీక్ ను నిలదీస్తుంది.
కట్ చేస్తే ఆదిత్య ఫోన్ లో బిజీగా మాట్లాడుతుంటే.. తన భార్య శ్రావ్య అక్కడికి వచ్చి.. ఏంటి మీరు.. మీ అన్నయ్యను పట్టించుకోరా? ఎప్పుడూ ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంటున్నారు. అసలు.. ఈ ఇంట్లోని వాళ్లకు బావ గారి గురించి ఆలోచించే సమయమే లేదా. ఎందుకు ఇలా చేస్తున్నారు.. అంటూ ప్రశ్నిస్తుంది.
ఎక్కువగా మాట్లాడుతున్నావు.. అంటూ తనను కొట్టబోతాడు ఆదిత్య. వద్దని వారిస్తారు సౌందర్య, తన భర్త. మొత్తానికి ఆదిత్య.. ఇంట్లోని వాళ్లందరికీ ఓ క్లాస్ పీకుతాడు. అన్నయ్యను తీసుకురావడానికి తాను కూడా ప్రయత్నిస్తున్నానని.. శ్రావ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే.. మోనిత ఇంటికి దీప వెళ్తుంది. అక్కడ చూస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది. పక్కనే ఉన్నవాళ్లను అడిగితే.. మోనిత చనిపోయింది కదండి.. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదండి.. అని చెబుతారు. మోనితను ఎవరో చంపేసి.. శవం కూడా దొరకకుండా దాచారట.. అంటూ వాళ్లు విన్నది చెబుతారు. మరి.. అక్కడ పనిచేసే ప్రియమణి ఏమైంది.. అని అడిగితే.. మోనిత చనిపోయినప్పటి నుంచి తను ఇక్కడికి రావడం లేదంటూ చెబుతారు వీళ్లు. దీంతో దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక.. శౌర్య మళ్లీ నాన్నా.. నాన్నా.. అంటూ మారం చేస్తుంది. తనకు జ్వరం వచ్చినా పట్టించుకోదు. నాన్న వస్తేనే ఆసుపత్రికి వెళ్తా అంటూ మారాం చేస్తుంది. సమయానికి.. ఇంట్లో దీప కూడా ఉండదు. హిమ కూడా నాన్న ఎప్పుడొస్తారు.. అంటూ సౌందర్యను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తుంది.
మీ అమ్మ అంటే నీకు అంత అలుసు అయిపోయిందా? దానికి చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సుఖం లేకుండా పోయింది. చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో సవితి తల్లి పోరు ఎక్కువైంది. పెళ్లయ్యాక నేను, ఆ తర్వాత కార్తీక్.. తనకు ఎప్పుడూ సుఖం లేదు.. సంతోషం లేదు. చివరకు మీరు కూడా తనను అర్థం చేసుకోవడం లేదు.. అంటూ సౌందర్య పిల్లలపై సీరియస్ అవుతుంది.
కట్ చేస్తే.. దీప ఇంటికి వచ్చి.. శౌర్యకు జ్వరం రావడంతో ట్యాబ్లెట్లు తెచ్చి వేసుకోమని చెబుతుంది. నాన్న ఎప్పుడు వస్తారు.. అంటూ అడుగుతుంది శౌర్య. వస్తారు అమ్మా.. త్వరలోనే వస్తారు.. అని శౌర్యకు సర్ది చెబుతుంది దీప. వద్దమ్మా.. ఇక నుంచి అయినా అబద్ధాలు చెప్పకు. నీకన్నా మా నాన్నే మంచోడు అమ్మా. నువ్వంటే నాకు ఇష్టం పోయింది.. అని దీపకు చెబుతుంది శౌర్య. దీంతో దీప గుక్కపెట్టి మరీ ఏడుస్తుంది.
పోలీస్ స్టేషన్ లో సెల్ లో పడుకున్న కార్తీక్ కు కడుపులో నొప్పి వస్తుంది. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో తట్టుకోలేకపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. కార్తీక్ మెలికలు తిరిగిపోవడం చూసిన.. రత్నసీత.. ఏమైంది సార్.. అని అడుగుతుంది. కడుపులో నొప్పి అని చెబుతాడు. హాస్పిటల్ కు తీసుకెళ్దాం.. అని వేరే పోలీస్ తో చెబుతుంది రత్నసీత. సీరియస్ గా ఉన్నట్టుంది.. చూడు.. ఎలా మెలికలు తిరిగిపోతున్నాడో.. అని అంటుంది.
వెంటనే మోనితకు ఫోన్ చేస్తుంది రత్నసీత. దీంతో మోనిత భయపడుతూ వెంటనే హాస్పిటల్ కు బయలు దేరుతుంది. నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన నా కార్తీక్ ని నా చేతులతో నేనే కష్టపడేలా చేస్తున్నాను. కార్తీక్.. వస్తున్నా.. ఇక నిన్ను.. నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు.. అంటూ బాధపడుతూ వెళ్తుంది మోనిత. దీప కూడా వెంటనే ఆటోలో హాస్పిటల్ కు బయలు దేరుతుంది. ఏడుపు ఆపుకోలేక తెగ ఏడ్చేస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇస్కాన్ కోల్కతా తిలకం తుడిచివేయాలని మరియు తులసి పూసలను దాచుకోవాలని, తలలు…
Hemant Soren : జార్ఖండ్లో ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజుల తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాత్రమే మంత్రిగా…
Donald Trump : తాను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా…
Rashmika Mandanna : ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే రష్మిక ఇప్పుడు దారుణంగా అందాలు ఆరబోస్తుంది. స్కిన్ షో విషయంలో…
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం…
Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట…
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు…
This website uses cookies.