Karthika Deepam 4 Oct Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారం కాదు. సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. గత శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. మోనిత.. పేపర్ లో ఇంటర్వ్యూ ఇవ్వడంతో వెంటనే జైలుకు వెళ్లిన దీప.. మోనితతో మాట్లాడుతుంది.
ఇలాంటివి ఇక ఆపేయ్.. అంటూ హెచ్చరిస్తుంది. ఇలాంటి పనులు చేయొద్దంటూ చెబుతుంది. ఇలాంటివి చేసి కార్తీక్ ను చేరాలని అనుకున్నా అది నీకు సాధ్యం కాదు. నేను బతికి ఉన్నంత కాలం నువ్వు డాక్టర్ బాబును చేరుకోలేవు.. అని ఖరాఖండిగా చెప్పేస్తుంది దీప.
దీపక్క.. నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను జైలులో ఉన్నా నా ప్లాన్లు అమలు అవుతూనే ఉన్నాయి.. అని చెబుతుంది మోనిత.
నువ్వు ఏ ప్లాన్స్ వేసినా.. వేస్ట్. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావు. ఇక్కడితో ఇవన్నీ ఆపేయ్.. నీకే మంచిది అని హితబోధ చేస్తుంది దీప.
సరే.. నువ్వు చెప్పినట్టే చేస్తా దీపక్క. ఇక్కడితో ఇవన్నీ ఆపేస్తా.. కానీ నువ్వు నాకో సాయం చేయాలి. కార్తీక్ తో నా మెడలో ఓ తాళి కట్టించు చాలు.. అంటుంది. దీంతో దీపకు ఇంకా కోపం వస్తుంది. ఓకేనా.. ఈ డీల్ నీకు ఓకేనా దీపక్క.. అని మోనిత అంటుంది. ఒకవేళ ఈ డీల్ కు నువ్వు ఒప్పుకున్నా సంతోషమే.. ఒప్పుకోకున్నా సంతోషమే.. అంటుంది. ఎందుకంటే.. నా పని నేను చేసుకుంటూ వెళ్తా అంటుంది మోనిత.
కట్ చేస్తే.. హిమ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు. మన డాడీ మంచోడా.. చెడ్డోడా.. ఆ మోనితతో.. డాడీకి ఉన్న సంబంధం ఏంటి? ఆ షైనీ చెప్పిన మాటలు నిజమా కాదా. పేపర్ లో వచ్చింది నిజమేనా కాదా.. అనేవి మనకెందుకు హిమ. ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా కలిసే ఉంది కదా. అందరం హ్యాపీగా ఉన్నాం కదా.. అలాగే ఉందా అని హిమకు.. శౌర్య చెబుతుంది కానీ.. హిమ మాత్రం.. తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. సౌందర్య ఇంట్లో దీనంగా కూర్చొని ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందమ్మా.. అంత డల్ గా ఉన్నావు అంటే.. ఏం అర్థం కావడం లేదు అంటుంది. స్వప్న అక్క గురించేనా నీ దిగులు అంటాడు ఆదిత్య.
అవునురా.. దానికి ఇంకా నామీద కోపం పోలేదు. ఇంకా నన్ను ఒక శత్రువును చూసినట్టే చూస్తుంది అంటుంది సౌందర్య. ఇప్పుడిప్పుడే అన్నయ్య బాధలన్నీ పోతున్నాయి. త్వరలోనే అక్క కూడా అర్థం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుంది అని ఆదిత్య తనకు ధైర్యం చెబుతాడు.
ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. పిల్లలు ఏరి.. కనిపించడం లేదు అంటాడు. ఇక్కడే ఎక్కడో ఉంటారులే అని సౌందర్య చెబుతుంది. అయితే.. గదిలో ఒంటరిగా ఏడుస్తున్న హిమను చూసిన దీప.. ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది.
అమ్మా.. డాడీ మంచోడే కదా.. అని అడుగుతుంది. దీంతో దీప షాక్ అవుతుంది. మోనిత ఆంటి మంచిదా.. చెడ్డదా అని అడుగుతుంది హిమ.. చెప్పమ్మా అని అడిగినా.. దీప ఏం మాట్లాడదు.
కట్ చేస్తే.. దీప.. కార్తీక్ దగ్గరికి వెళ్లి.. పేపర్ కనిపించడం లేదు అని చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. పేపర్ కనిపించడం లేదా.. ఎందుకు అని అడుగుతాడు. పూజ సమయంలో బెడ్ కింద పెట్టి వచ్చాను. తీరా.. ఇప్పుడు వెళ్లి చూస్తే పేపర్ కనిపించడం లేదు అని చెబుతుంది దీప.
ఒకవేళ పిల్లలు ఏమైనా తీశారా.. అని అంటుంది సౌందర్య. దీంతో దీప, కార్తీక్ షాక్ అవుతారు. దీప.. ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. కార్తీక్ కూడా బాధపడతాడు. ఏం చేయాలో అర్థం కాదు.
పిల్లలకు నిజం తెలిసిపోయిందా? అందుకే మళ్లీ నాతో మాట్లాడటం లేదా అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.