Karthika Deepam 4 Sep Today Episode : కార్తీక దీపం 4 సెప్టెంబర్, 2021 లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. శనివారం ఎపిసోడ్ 1136 హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. మోనిత తనను బెదిరించి వెళ్లాక.. కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఏం చేయాలి? అని తెగ ఆలోచిస్తుంటాడు. తనకు చాలా కోపం వస్తుంది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు.
తన ఫ్యామిలీని మోనిత ఏం చేస్తుందోనని తెగ భయపడతాడు. మోనిత పీడ ఎలా విరగడ చేయాలా? అని తెగ ఆలోచిస్తాడు. దీంతో తనకు చాలా చిరాకు వస్తుంది. నో… అస్సలు కాంప్రమైజ్ కాను. ఆ మోనిత ఎన్ని నాటకాలు ఆడినా లొంగను. దీపకు అన్యాయం చేయను. ఇన్నాళ్లు దీప అనుభవించింది చాలు. మోనిత బెదిరింపులకు భయపడి.. పొరపాటున కూడా తప్పుడు నిర్ణయం తీసుకోను.. అని అనుకుంటాడు కార్తీక్.
కట్ చేస్తే.. మోనిత తన రూమ్ కు వెళ్తుంది. రత్నసీత కూడా అక్కడే ఉంటుంది. మీరు ఏం అనుకోకుంటే మీకు ఓ విషయం చెప్పనా మేడమ్.. అని అడుగుతుంది రత్నసీత. నువ్వు నా మనిషివి రత్నసీత.. అడుగు.. అని అంటుంది మోనిత.
ఇన్ని రోజులు మీరు కార్తీక్ సర్ ను పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా ఉన్నారు. పైగా ఇప్పుడు కడుపుతో ఉన్నారు. ఇక ముందు కూడా కార్తీక్ సార్ అవసరం లేకుండా మీ బిడ్డతో సంతోషంగా ఉండొచ్చు కదా. అప్పుడు ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు కదా.. ఏమంటారు మేడమ్.. అని రత్నసీత అనే సరికి.. మోనితకు చాలా కోపం వస్తుంది.
ఈ మాట నువ్వు కాకుండా వేరే వాళ్లు అని ఉంటే.. ఈపాటికి షూట్ చేసి పారేసేదాన్ని. భయపడకు. నేను నిన్ను ఏం చేయనులే. అసలు నన్ను ఇంత దగ్గరగా చూసి కూడా నేనంటే ఏంటో కూడా నీకు అర్థం కాలేదా. నేను బతుకుతున్నదే నా కార్తీక్ కోసం. అటువంటిది నేను కార్తీక్ ను వదిలి నేను ఎలా బతకగలను. కార్తీక్ లేకుంటే నేను బతికి కూడా వేస్ట్. నా జీవితం కార్తీక్ కోసమే అంతే.. అంటుంది మోనిత.
మీరేమో.. పట్టు పట్టుకొని కూర్చున్నారు. అక్కడ సారేమో.. ఆయన పంతం వదలడం లేదు. ఇదంతా జరుగుతుందా? అంటే.. జరుగుతుంది. కార్తీక్ కు తన కన్నా.. తన ఫ్యామిలీ అంటేనే ఎక్కువ ఇష్టం. తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు. కార్తీక్ ఫ్యామిలీ సెంటిమెంట్ తోనే నా దారికి తెచ్చుకోవాలి.
ఇప్పుడు ఎక్కువ టైమ్ లేదు కాబట్టి.. లాకప్ లోనో లేదంటే.. కోర్టుకు తీసుకెళ్లే దారిలోనో కార్తీక్ ను నా వైపునకు తిప్పుకోవాలి. అప్పుడే కార్తీక్ నేను చెప్పినట్టు వింటాడు. అది చాలు కదా.. నేను అనుకున్నది సాధించడానికి. ఈ విషయంలో నేను చెప్పినట్టు నువ్వు చేయి చాలు. మిగితాది అంతా నేను నడిపిస్తాను.. అని చెబుతుంది మోనిత.
కట్ చేస్తే.. భాగ్య.. మళ్లీ దేవుళ్లకు పూజలు చేస్తుంటుంది. స్వామీ ఒక పూట తిని.. ఇంకో పూట ఉపవాసం ఉంటున్నాను. అసలే ఆకలికి ఆగలేని ప్రాణాన్ని. ఆకలికి ఆగలేకపోతున్నాను. కార్తీక్ బాబు.. నాలో అమ్మతనం కనిపించింది అన్నాడు. కానీ.. నేను కసాయితనం చూపించి కార్తీక్ బాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. డాక్టర్ బాబు బాగుండాలి.. క్షేమంగా తిరిగి రావాలి.. అని దేవుడిని కోరుకుంటుంది భాగ్య.
కట్ చేస్తే.. దీప.. ఆసుపత్రిలోనే ఉంటుంది. కార్తీక్ మాత్రం ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని ఉంటాడు. మోనిత వచ్చిన విషయం గురించే ఆలోచిస్తుంటాడు. డాక్టర్ బాబు.. ట్యాబ్లెట్లు వేసుకోండి.. అని దీప ఇస్తుంది. దీంతో వాటిని వేసుకొని మంచినీళ్లు తాగుతాడు కార్తీక్.
ఇప్పుడు చెప్పండి.. అని దీప అడుగుతుంది. ఏం చెప్పాలి.. అని అంటాడు కార్తీక్. కారణం.. కడుపులో నొప్పికి.. కలవరపాటుకు తేడా ఉంటుంది డాక్టర్ బాబు. మీరు ఎందుకు మునుపటిలా లేరు. ఎందుకు భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.. అని అడుగుతుంది దీప. నీకు అలా అనిపించిందేమో.. అంటాడు కార్తీక్.
నా మనసు మనసులో లేదు.. అని దీపకు చెప్పి తనలో తానే మాట్లాడుకుంటాడు కార్తీక్. ఒకవేళ దీపకు మోనిత గురించి చెబితే.. మోనితను పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయదు.. అని ఆలోచిస్తాడు కార్తీక్.
నాకు కూడా చెప్పరా? నీ భార్యనైన నామీద కూడా.. అని దీప ఏదో అనబోతే.. దీప.. ఆ మాట నువ్వు ఎప్పుడూ అనకూడదు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నీకు సోది చెప్పే ఆవిడ రూపంలో మోనిత కనిపిస్తే.. నాకు టీ తెచ్చి ఇచ్చిన మూగ అమ్మాయి రూపంలో నాకు మోనిత కనిపించింది.. అని చెబుతాడు కార్తీక్.
మోనిత బతికే ఉంది అనేది నిజం. నా మనసు చెబుతోంది. నా కళ్లు కూడా నన్ను మోసం చేయవు. కానీ.. మోనిత అంత ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కు కూడా వస్తుందా? అని అడుగుతుంది దీప. అంటే.. నిజమే.. మోనిత అయి ఉండకపోవచ్చు. మోనిత.. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చే ధైర్యం చేసి ఉండకపోవచ్చు.. అంటూ మాట మారుస్తాడు కార్తీక్. దీంతో మీరు ప్రశాంతంగా పడుకోండి.. అని చెబుతుంది దీప. కార్తీక్ మాత్రం అదే విషయం గురించి ఆలోచిస్తుంటాడు. నాది పిరికితనమా? లేక నా కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆరాటమా? అని అనుకుంటాడు.
కట్ చేస్తే.. శ్రావ్య ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తుంటుంది. ఏమ్మా.. వాడు ఇంకా రాలేదా.. అని అడుగుతాడు ఆనంద రావు. అవును మామయ్యా.. ఇంకా రాలేదు. లాయర్ దగ్గరికి వెళ్తా అన్నాడు. టెన్షన్ గా ఉంది అని చెబుతుంది శ్రావ్య.
వస్తాడులే అమ్మా.. ఎందుకు టెన్షన్ పడటం అంటాడు ఆనంద రావు. వాడు.. మందు పార్టీలు అన్నీ మానేశాడు కదా.. అనగానే ఇంతకుముందు ఫోన్ చేస్తే ఎప్పుడో బయలుదేరా అన్నాడు. ఇంకా రాకపోయేసరికి.. ఎదురు చూస్తున్నా.. అంటుంది శ్రావ్య. దీపు పడుకున్నాడా? అని ఆనందరావు అడుగుతాడు. వాడెక్కడ పడుకోవాలి.. రెండు మూడు అవుతుంది. హిమ, శౌర్య.. వాడితో ఆడుకుంటున్నారు.. అని చెబుతుంది శ్రావ్య.
రేపు బావగారిని కోర్టుకు తీసుకెళ్తారంట కదా. బెయిల్ దొరుకుతుందా మామయ్య అని అడుగుతుంది శ్రావ్య. ఆదిత్య వెళ్లింది ఆ లాయర్ దగ్గరికే. బెయిల్ గురించి మాట్లాడటానికే అని చెబుతాడు ఆనంద రావు. పాపం అక్క పిచ్చిది అయిపోయింది.. అని అంటుంది శ్రావ్య. బావ గారికి బెయిల్ దొరికితే అయినా కాస్త రిలీఫ్ గా ఉంటుంది మామయ్య.. అని చెబుతుంది శ్రావ్య. ఆదిత్య వస్తే నా దగ్గరికి రమ్మను.. అని చెప్పి ఆనంద రావు వెళ్లిపోతాడు.
కట్ చేస్తే.. ఆదిత్య.. బైక్ మీద వస్తుంటాడు. కొంత దూరం వచ్చాక రోడ్ క్లోజ్ అయినట్టు అక్కడ కనిపిస్తుంది. దీంతో డైవర్షన్ తీసుకొని వెళ్తుంటాడు. కానీ.. ఆదిత్యను ఎవరో ట్రాప్ చేస్తారు. రోడ్డుకు అడ్డంగా ఓ తాడు కడతారు. అది చూసుకోకుండా.. అలాగే ముందుకు వెళ్లిన ఆదిత్య.. బండి అదుపుతప్పి కింద పడుతుంది. దీంతో ఆదిత్య చేతికి బలంగా గాయం అవుతుంది. వెంటనే కార్తీక్ ఉలిక్కి పడతాడు. నో.. అంటూ లేచి అరుస్తాడు. తీరా చూస్తే అది కల. కలగన్నారా? ఏమైంది.. అని అడుగుతుంది దీప.
ఇంతలోనే వార్డు బాయ్ వచ్చి.. రీనా మేడమ్ లైన్ లో ఉన్నారు సార్.. అని చెబుతాడు. దీంతో ఫోన్ తీసుకుంటాడు కార్తీక్. పక్కనే దీప కూడా ఉంటుంది.
హలో.. అనగానే.. నీకు బ్యాడ్ న్యూస్ కార్తీక్ అంటుంది మోనిత. వెంటనే కార్తీక్ లేచి కొంచెం ముందుకు వెళ్తాడు. ఏమైంది డాక్టర్.. అనగానే ఇప్పుడే ఆదిత్యకు బైక్ యాక్సిడెంట్ అయింది. పాపం.. నీ వల్ల మరిది గారికి యాక్సిడెంట్ చేయించాల్సి వచ్చింది.. అని చెబుతుంది మోనిత. ఇక ఆలోచించకు.. ఆలోచించే కొద్దీ గాయాలవ్వడం మానేసి.. ప్రాణాలే తీయాల్సి వస్తుంది. అంతదాకా రానివ్వకు డియర్. రేపు మన పెళ్లి జరగాలి.. లేదంటే నీ కుటుంబం.. నువ్వు తెలివైన వాడివి. ఫ్యామిలీ పట్ల ప్రేమాభిమానాలు ఉన్నవాడివి. అటు ఫ్యామీలని రిస్క్ లో పెట్టి జైలుకు వెళ్లడం కరెక్ట్ కాదు. ఆలోచించు.. ఉంటాను.. లవ్యూ.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మోనిత.
మోనిత అలా మాట్లాడేసరికి.. కార్తీక్ కు చాలా కోపం వస్తుంది కానీ.. అక్కడ దీప ఉండటంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతాడు. డాక్టర్ గారు మీకెందుకు కాల్ చేశారు.. అని అడుగుతుంది దీప. నేను బతికే ఉన్నానో లేదో తెలుసుకోవడానికి దీప.. అని అంటాడు కార్తీక్. ఖైదీని కదా.. ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటున్నారు. నాకు ఏదైనా అయితే వాళ్ల ఉద్యోగాలు పోతాయి.. అందుకు.. అని అబద్ధం చెబుతాడు కార్తీక్.
ఇంతలోనే శౌర్య.. దీపకు కాల్ చేస్తుంది. అమ్మ.. బాబాయ్ కి బైక్ యాక్సిడెంట్ అయింది అని చెబుతుంది. ఏంటి.. అని అంటుంది దీప. అవును అమ్మా.. దెబ్బలు తగిలాయంట.. డ్రైవర్ ను తీసుకొని పిన్ని వెళ్లింది. నువ్వు తొందరగా రా అమ్మా.. మాకు భయంగా ఉంది.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు పిల్లలు.
మీకు ముందే ఎలా తెలిసిపోయింది డాక్టర్ బాబు.. అని అడుగుతుంది దీప. ఏ విషయం అంటాడు కార్తీక్. మనవాళ్లలో ఎవరికో ఏదో జరిగినట్టు అనిపించింది అన్నారు.. అనగానే ఎందుకు నిజంగానే ఎవరికైనా ఏదైనా జరిగిందా? అని అడుగుతాడు. అవును.. ఆదిత్యకు బైక్ యాక్సిడెంట్ అయిందట.. మన ఇంటికి ఏదో పట్టింది.. అనగానే దాని పేరు మోనిత దీప.. అని అనుకుంటాడు కార్తీక్. నువ్వు వెంటనే వెళ్లు దీప.. ఆదిత్యకు ఎలా ఉందో.. అని చెప్పి పంపిస్తాడు కార్తీక్. దీప వెళ్లగానే.. మోనిత నిన్ను.. అంటూ తీవ్రంగా కోపంగా ఉంటాడు కార్తీక్.
కట్ చేస్తే.. ఆదిత్యకు చేయి, కాలుకు దెబ్బ తాకుతుంది. శౌర్య.. బ్యాండేజ్ వేస్తుంది. కారు తీసుకెళ్లొచ్చు కదా.. బైక్ ఎందుకు వేసుకెళ్లారు.. అని ప్రశ్నిస్తుంది శౌర్య. ఆ లాయర్ ఇంటి సందులో కారు పట్టదు. ఆయనే రోడ్డు మీద పార్క్ చేస్తుంటారు.. అని చెబుతాడు ఆదిత్య. నొప్పిగా ఉందా బాబాయ్ అని అడుగుతుంది శౌర్య. అంత దెబ్బ తాకితే నొప్పిగా ఉండదా అని అంటుంది హిమ.
మనం హాస్పిటల్ కు వెళ్దాం బాబాయ్ అనగానే.. చిన్నదెబ్బలే కద అమ్మా.. తగ్గిపోతాయి.. అని ఆదిత్య అంటాడు. ఇంతలోనే దీప వస్తుంది. అమ్మా.. అమ్మా.. అంటూ తన దగ్గరికి వెళ్తారు పిల్లలు. ఆదిత్య ఏంటిది.. ఏం జరుగుతోంది.. అని అంటుంది దీప. రాను రాను.. ఎవరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు.. అని అంటుంది దీప. బైక్ మీద ఎందుకు వెళ్లావు.. అని అనగానే.. ఏం కాలేదులే వదిన.. నువ్వు బాధపడకు.. అని అంటాడు ఆదిత్య. మన అదృష్టం బాగుండి.. చిన్న దెబ్బలతోనే బయటపడ్డాడు.. అని అంటుంది శ్రావ్య. హెల్మెట్ ఉండటం వల్ల తలకు దెబ్బ తగల్లేదు.. అని శ్రావ్య అంటుంది.
ఇంతకీ ఆ లాయర్ ఏమన్నాడురా.. అని అడుగుతాడు ఆనంద రావు. ఏమంటాడు.. తర్వాత మాట్లాడుతాను లేండి.. అని చెబుతాడు ఆదిత్య. నాన్న ఎలా ఉన్నాడమ్మా.. అని అడుగుతుంది శౌర్య. మిమ్మల్ని బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు.. అని అంటుంది దీప. రేపు వచ్చేస్తాడా.. అని అడుగుతుంది హిమ. దీంతో ఏం సమాధానం చెప్పాలో దీపకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.