Karthika Deepam 5 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జనవరి, 2022 బుధవారం 1241 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ దీప గురించి.. తన పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఆనంద్ కు విపరీతంగా జ్వరం వస్తుంది. దీంతో ఆనంద్ కు చన్నీళ్లతో కాపురం పెడతాడు. ఆ తర్వాత ఆనంద్ ను పడుకోబెట్టి.. దీప కోసం వెయిట్ చేస్తుంటాడు కార్తీక్. దీప ఎక్కడికి వెళ్లింది. దాదాపు ఊరంతా గాలించాను కదా.. ఎక్కడికి వెళ్లింది అని టెన్షన్ పడుతుంటాడు కార్తీక్. ఇంతలో దీప వస్తుంది. ఏమైంది ఇంత లేట్ ఎందుకు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు కార్తీక్. నువ్వు రాకపోతే ఏమనుకోవాలి.. ఏమైందో.. అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటాడు కార్తీక్.
ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రాకు. ప్లీజ్. నాకు ఊపిరి ఆగిపోతుంది అని చెబుతాడు. పిండి వంటలు అమ్మడం కోసం కాస్త సమయం పట్టింది అని చెబుతుంది దీప. మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటే.. రుద్రాణి వచ్చి వెళ్లింది. తను బెదిరించింది అని చెబుతాడు కార్తీక్. ఇంతలో అమ్మా.. అంటూ పిల్లలు దీప దగ్గరికి వస్తాడు. ఇంత ఆలస్యంగా వచ్చావేంటమ్మా.. మేము ఈరోజు స్కూల్ కు త్వరగా వచ్చేశాం.. అని చెబుతారు పిల్లలు. ఆ రుద్రాణి.. అక్కడికి వచ్చి మమ్మల్ని తిను అంటూ చాలా ఇబ్బంది పెట్టింది అని చెబుతారు పిల్లలు. దీంతో తెలిసినావిడ కదా.. తీసుకొచ్చి ఉంటుంది లే అమ్మా. మీరు ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. వెళ్లి పడుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను అని చెబుతాడు కార్తీక్.
మరోవైపు మహేశ్.. కార్తీక్ కోసం తాడికొండ గ్రామంలో తెగ వెతుకుతుంటాడు. ఆనంద్ కు జ్వరం వస్తుంటే మరోసారి కాపురం పెడతాడు కార్తీక్. ఇంతలో దీప వచ్చి ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. బాబుకు చన్నీళ్లతో కాపురం పెడుతున్నాను అని చెబుతాడు కార్తీక్.
ఇది మీకెలా తెలుసు అంటే.. ఇది ఎవరికైనా తెలుసు. అందులోనూ నేను డాక్టర్ ను అని చెప్పబోయి ఆగిపోతాడు కార్తీక్. చెప్పండి.. మీరు డాక్టర్ కదా. ఆ విషయం ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా.. పది మందికి ఉపయోగపడే వృత్తిని ఎందుకు ఎవరికోసమో వదిలేస్తున్నారు అని అడుగుతుంది దీప.
ఎవరో ఏదో అన్నారని.. మీరు అలా చేయకండి. 10 మందికి ఉపయోగపడండి అని చెప్పగానే.. బాబు కోసం మందుల ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అవి తీసుకురా అని చెబుతాడు కార్తీక్. మరోవైపు మోనిత వచ్చి ఆ ఫోటో తీసుకెళ్లిందని ఆదిత్యకు చెబుతుంది సౌందర్య.
తను అడుగడుగునా అడ్డు తగులుతోంది. తను అసలే బస్తీలో హాస్పిటల్ పెట్టిందట.. అని చెబుతుంది. మరోవైపు వారణాసి మోనిత ఇంటికి వస్తాడు. నర్సమ్మను పంపించేశాం. నర్సమ్మ ఇక రాదు. ఎవరిని తీసుకొచ్చినా వాళ్లు అందరూ వెళ్లిపోతారు.. అని చెబుతాడు వారణాసి.
మీకు మా బస్తీ వాళ్ల గురించి త్వరలోనే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు వారణాసి. మరోవైపు పిల్లాడితో కాసేపు ఆడుకుంటారు పిల్లలు. అమ్మా.. తమ్ముడికి కూడా అన్నం తినిపిద్దామా.. అంటే వద్దమ్మా.. వాడు ఇప్పుడే అన్నం తిని అరిగించుకోలేడు అని అంటుంది దీప.
పాపం.. ఈ వయసులోనే వీడు తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు అని అంటుంది దీప. వీడు మనవాడు. వీడిని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. వీడు ఇప్పుడు మన ఇంటి సభ్యుడు అంటూ చెబుతుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.