Karthika Deepam 8 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 1399 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఆటో ఎందుకు అలా ఉంది. ఏమైంది అని ఇంద్రుడు, చంద్రమ్మ.. జ్వాలను అడుగుతారు. కానీ.. తాను మాత్రం ఏం చెప్పదు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు కారులో ఆనందరావు, సౌందర్య, హిమ ఇంటికి వెళ్తుంటారు. హిమ వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. జ్వాలను ఎలా మార్చాలో తనకు అర్థం కాదు. కట్ చేస్తే తెల్లవారుతుంది. తెల్లవారగానే జ్వాల ఇంటికి వస్తాడు ఆనంద రావు. తనను చూసి జ్వాల షాక్ అవుతుంది. తాతయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. దీంతో ఏదైనా పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాం. ఎవరి ప్రేమనైనా పోగొట్టుకుంటే ఎవరిని అడగాలి. ఎవరికి కంప్లయింట్ ఇవ్వాలి. ఆ దేవుడికి రోజూ మొక్కుతున్నాను. రోజూ కోరుకుంటున్నాను. నా రెండో మనవరాలిని చూపించమని. దేవుడు వరమిచ్చాడు. కానీ.. నువ్వే కాదంటున్నావు. వెళ్దాం పదరా బంగారం. నీ కోసం మీ నానమ్మ ఎదురు చూస్తోంది అంటాడు ఆనంద రావు. దీంతో నా శత్రువు కూడా నాకోసం ఎదురు చూస్తోంది. నేను ఇంటికి రాను అంటుంది జ్వాల.
ఈ వయసులో దేవుడు మిమ్మల్ని ఎంత ఏడిపించాలో అంత ఏడిపించాడు. నువ్వు కూడా మిమ్మల్ని ఏడిపిస్తే ఎలా అంటాడు. దీంతో ఏడిస్తేనే కష్టాలు పోతాయంటే.. 24 గంటలు ఏడుస్తూనే ఉండేదాన్ని తాతయ్య అంటుంది జ్వాల. కన్నీళ్లు పెట్టకుండా మౌనంగా ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అంటుంది జ్వాల. ఇక్కడి దాకా వచ్చావు. లోపలికి రా తాతయ్య. కాఫీ తాగి వెళ్దువు కానీ అంటుంది జ్వాల. దీంతో నేను కాఫీ తాగడానికి రాలేదమ్మా. నా మనవరాలిని తీసుకెళ్లడానికి వచ్చాను అంటాడు ఆనంద రావు. దీంతో అది జరగని పని తాతయ్య అంటుంది జ్వాల. నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అంటుంది జ్వాల. పెద్దవాడిగా.. నీ తాతయ్యగా చెబుతున్నా. ఇన్ని బాధలు మనసులో పెట్టుకొని మీ నానమ్మను సీసీ అన్నావు.. నన్ను యంగ్ మాన్ అన్నావు. మేము ఎన్నాళ్లు బతుకుతామో మాకు తెలియదు. బతికిన కొన్నాళ్లు అయినా మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వు అంటాడు.
దీంతో తాతయ్య.. దయచేసి నన్ను ఎక్కువ బతిమిలాడొద్దు. నేను రాను రాలేను అంటుంది జ్వాల. దీంతో రాకుండా ఉండి ఎవరిని సాధిస్తావు అంటాడు. దూరంగా ఉండటం వల్ల నువ్వు ఏమైనా ఆనందంగా ఉన్నావా. చూడమ్మా.. జీవితం ఒక్కసారే వచ్చే అవకాశం. దాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది అంటాడు.
అందరినీ క్షమించి నీకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న మాకోసం రా అమ్మ.. అంటాడు ఆనంద రావు. కానీ.. మీరు ఎన్ని చెప్పినా వచ్చే ఆలోచన నాకు లేదు తాతయ్య అంటుంది జ్వాల. మరోవైపు శౌర్య, నిరుపమ్ కు ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తుంటుంది హిమ.
తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు ఆనంద రావు. తను రానన్నది అని చెబుతాడు. మనసు బండరాయిలా మార్చుకుంది అని చెబుతాడు. కట్ చేస్తే ఆటో నడిపి ఇంటికి తిరిగి వస్తుంది జ్వాల. ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి షాక్ అవుతుంది జ్వాల. ఇంట్లో చూస్తే హిమ ఉంటుంది. గుత్తి వంకాయ కూర వండుతూ ఉంటుంది.
నువ్వేంటి ఇక్కడ అంటుంది. దీంతో వంట చేస్తున్నా శౌర్య అంటుంది జ్వాల. దీంతో మనిద్దరం అక్కాచెల్లెళ్లమే కదా అంటుంది హిమ. దీంతో ఆ బంధం అంటేనే నాకు చిరాకు. ఆ మాట వింటేనే కంపరం. ఇంకోసారి ఆ మాట అనకు అంటుంది జ్వాల. దీంతో శౌర్య నా మీద కోపం ఎందుకు చెప్పు. నీకు ఇష్టం అని గుత్తి వంకాయ కూర చేస్తున్నాను అంటుంది హిమ.
శౌర్య నా మాట విను. డాక్టర్ సాబ్ తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటుంది హిమ. దీంతో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటుంది. నాకు డాక్టర్ సాబ్ తో పెళ్లి చేస్తావా.. ఎలా కనబడుతున్నా నీకు నేను. ఇంకేం మోసం చేస్తావు చెప్పు అంటుంది.
ఒక్క రెండు నిమిషాలు టైమ్ ఇస్తే.. జరిగింది ఏంటో.. నువ్వు నన్ను ఎలా తప్పుగా అర్థం చేసుకున్నావో నేను చెబుతాను అంటుంది హిమ. దీంతో అవన్నీ చెప్పే ఓపిక నీకు ఉన్నా.. వినడానికి నాకు ఓపిక లేదు. నడు బయటికి అంటుంది జ్వాల. ఆ తర్వాత హిమను బయటికి వెళ్లగొట్టి డోర్ వేస్తుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.