karthika deepam 8 october 2021 episode
Karthika Deepam 8 Oct Today Episode : కార్తీక దీపం 8 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాన్న మంచోడు కాదు. బ్యాడ్ బాయ్ అని శౌర్యతో చెబుతుంది హిమ. దీంతో శౌర్య షాక్ అవుతుంది. డాడీ.. మోనిత ఆంటీతో మాట్లాడటం చూశా. డాడీ అస్సలు మంచోడు కాదు. మోనిత ఆంటీని పెళ్లి చేసుకుంటా అని కూడా డాడీ అన్నాడట.. అంటూ హిమ చెబుతుంది. అవన్నీ అబద్ధం కావచ్చు.. పేపర్ లో వచ్చింది కూడా అబద్ధం అని నానమ్మ చెప్పింది అని శౌర్య చెప్పినా కూడా హిమ వినదు. మమ్మీ ఉండగానే మోనితను ఎందుకు పెళ్లి చేసుకుంటా అని డాడీ అన్నాడు.. అంటూ హిమ ప్రశ్నిస్తుంది. మొత్తానికి పిల్లలు ఇద్దరూ కార్తీక్ మంచోడు కాదని అనుకుంటారు.
karthika deepam 8 october 2021 episode
కట్ చేస్తే ఇంట్లో దీప.. పరద్యానంగా ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దీప అలా ఉండటం చూసిన సౌందర్య.. ఏంటే అలా ఉన్నావు. ఏమైంది.. అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య.. ఆ మోనిత గురించే ఆలోచిస్తున్నా. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తున్నా అంటే.. నువ్వే ఇంతలా ఆలోచించి మనసు పాడు చేసుకుంటే.. పెద్దోడి సంగతి ఏంటి. వాడు ఎలా ఉన్నాడో.. ఆసుపత్రిలో ఆపరేషన్లు ఎలా చేస్తున్నాడో అని అంటుంది సౌందర్య.ఒకసారి తన క్యాబిన్ కు రావాలంటూ భారతిని పిలుస్తాడు కార్తీక్. తన క్యాబిన్ లోకి వెళ్లాక.. మోనిత తనను చాలా ఇబ్బంది పెడుతుంది అంటాడు. మోనితతో వేగలేకపోతున్నా అంటాడు కార్తీక్. దీంతో.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎలాగైనా తండ్రివి నువ్వే కార్తీక్ అంటుంది భారతి. అలా.. ఎలా అంటున్నావు నువ్వు. నీకు కూడా అన్నీ తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడటం ఏంటి.. అని భారతితో అంటాడు కార్తీక్. ఇప్పుడు ఏం అనుకొని ఏం లాభం లేదు కార్తీక్… అవన్నీ ఆలోచించే స్టేజ్ దాటిపోయావు నువ్వు.. అని భారతి అంటుంది.
కట్ చేస్తే.. మోనిత జైలులో ఉండి.. కార్తీక్ బొమ్మను గీసిన పేపర్ ను పట్టుకొని సంతోషంగా ఉంటుంది. ఇంతలో సుకన్య వచ్చి టిఫిన్ ఇస్తుంది. మేడమ్.. టిఫిన్ తినండి అంటుంది. టిఫిన్ చాలా బాగుంది అనగానే.. టిఫిన్ బాగుండటమే కాదు.. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెబుతా మేడమ్ అంటుంది. మీరు చెప్పిన పని ఈరోజు అయిపోతుంది అని అంటుంది. అలాగే నువ్వు ఇంకో పని కూడా చేయాలి అని మరోపని చెబుతుంది సుకన్యకు.
కార్తీక్ పుట్టిన రోజు అని తెలిసి కూడా పిల్లలు కార్తీక్ కు విష్ చేయరు. ఏంట్రా ఈరోజు డాడీ బర్త్ డే కదా.. విష్ చేయరా.. అని అడుగుతాడు కార్తీక్. హ్యాపీ బర్త్ డే డాడీ అని శౌర్య అనబోతుంది కానీ.. పక్కనే హిమ ఉండటంతో బర్త్ డే విషెస్ చెప్పదు. అలాగే.. హిమ దగ్గరికి వెళ్లి కార్తీక్ కూర్చోగానే.. హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో కార్తీక్ చాలా బాధపడతాడు.
karthika deepam 8 october 2021 episode
తన మనసు ఏం బాగోలేదని గుడికి వెళ్తుంది దీప. గుడికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుంటుంది. గుడికి వెళ్లినా కూడా మనసు అస్సలు బాగుండటం లేదు అనుకుంటూ నడుచుకుంటూ వస్తుంటుంది. ఇంతలో వెనుక నుంచి ఓ కారు వేగంగా వస్తుంటుంది. ఆ కారును చూసుకోకుండా.. ఏదో పరద్యానంలో నడుచుకుంటూ వెళ్తుంది దీప. స్పీడ్ గా వచ్చిన కారు దీపను గుద్దుతుంది. దీంతో దీప కింద పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరరుగుతుందో తెలియాలంటే మాత్రం తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.