Karthika Deepam 9 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 అక్టోబర్, 2021 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా దీప గుడికి వెళ్తుంది. గుడికి వెళ్లినా కూడా తనకు మనశ్శాంతి లభించదు. నడుచుకుంటూ కార్తీక్, మోనిత గురించే ఆలోచించుకుంటూ వెళ్తుంది. ఏం చేయాలి అని రోడ్డు మీద పరధ్యానంగా ఆలోచించుకుంటూ వెళ్తుంది దీప. ఇంతలో వెనుక నుంచి స్పీడ్ గా కారు వస్తుంటుంది. కారును దీప గమనించదు. స్పీడ్ గా వచ్చిన కారు.. దీపను ఢీకొనబోతుంది. ఇంతలో ప్రియమణి వచ్చి దీపను కాపాడుతుంది. దీంతో దీప… ప్రియమణిని చూసి షాక్ అవుతుంది. దీపమ్మ మీకు ఏం కాలేదు.. సంతోషం.. అని అనగానే.. థ్యాంక్స్ ప్రియమణి నన్ను కాపాడావు అని అంటుంది.
మీరు బాగున్నారా… అమ్మ. మా రాక్షసి నిన్ను అల్లకల్లోలం చేసింది కదా అమ్మ. తన పాపం పండింది. శిక్ష పడింది. ఉరి శిక్ష పడితే బాగుండు. ఏంటి దీపమ్మ అలా చూస్తున్నారు.. నా మీద కోపం పోలేదా.. అప్పుడు మోనిత మేడం మాటలు విని మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నా మీద మీకు పీకలదాకా కోపం ఉందని నాకు తెలుసు. నన్ను క్షమించరని కూడా నాకు తెలుసు. తప్పంతా నాదే.. మిమ్మల్ని మళ్లీ కలుస్తానో లేదో.. దేవతలాంటి మిమ్మల్ని చాలామాటలు అన్నాను. మీ కాళ్లు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అమ్మా అని దీప కాళ్లు పట్టుకుంటుంది ప్రియమణి. సరే.. క్షమించానులే వదులు అంటుంది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అమ్మ. ఆ మాయలేడి మాటలు విని మిమ్మల్ని అన్నాను కానీ.. మిమ్మల్ని అనే తాఖతు నాకెక్కడిది అమ్మ.. అని అంటుంది ప్రియమణి. సరే అమ్మా నేను వెళ్లొస్తాను.. పిల్లలు, కార్తీక్ అయ్య, మీరు అందరూ బాగుండాలి అని చెప్పి వెళ్లబోతూ ఏదో చెప్పబోతుంది ప్రియమణి.
కడుపు నిండా అన్నం తిని చాలా రోజులు అయింది. మిగిలిన డబ్బులతో మా ఊరు వెళ్తాను.. అంటుంది ప్రియమణి. అయ్యో ఎక్కడా పని చేయడం లేదా నువ్వు అంటే.. ఎక్కడా పని దొరకడం లేదమ్మా.. ఎక్కడ పని అడిగినా.. గదికి వస్తావా? ఇస్తాను అంటుంది ప్రియమణి. నేను మీ ఇంట్లో పని చేస్తాను అమ్మా.. నాకు మూడు పూటలా తిండి పెట్టి బట్టలు పెడితే చాలు అమ్మా.. నేను పనిచేస్తాను అని చెబుతుంది ప్రియమణి. నాకు ఓకే కానీ.. మా అత్తయ్య గారు ఒప్పుకుంటేనే నిన్ను పనిలో పెట్టుకుంటాం అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్తుంది దీప.
కట్ చేస్తే.. హిమ తన తండ్రి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు నాన్న పుట్టిన రోజు కదా.. అని శౌర్య.. హిమను అడుగుతుంది. నాన్న పుట్టిన రోజుకు నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లేను. మీరు ఇదివరకు నాన్న బర్త్ డేను ఎలా సెలబ్రేట్ చేసేవాళ్లు హిమ అని అడుగుతుంది శౌర్య. డాడీ బర్త్ డే అంటే.. అందరికంటే ఎక్కువగా నేను సంతోషించేదాన్ని కానీ.. ఇప్పుడు నాకు డాడీ బర్త్ డే సెలబ్రేట్ చేయాలని అనిపించడం లేదు.. అంటుంది హిమ.
ఇంతలో కార్తీక్.. హిమ తనకు బర్త్ డే విషెస్ చెప్పినట్టు కల కంటాడు. కానీ.. అది నిజం కాదు. వెంటనే హిమ దగ్గరికి వెళ్తాడు. హిమ, శౌర్య.. ఇద్దరూ ఒకచోట కూర్చొని ఉంటారు. కార్తీక్ వెళ్లి.. ఈరోజు డాడీ హ్యాపీ బర్త్ డే కదా.. విష్ చేయరా.. అని అడుగుతాడు కార్తీక్. హిమ బర్త్ డే విషెస్ చెప్పకుండానే వెళ్లిపోతుంది. కేవలం శౌర్య మాత్రమే కార్తీక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది. కిందికి వెళ్లగానే అందరూ కార్తీక్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెబుతారు.
ఇంతలో ప్రియమణి ఇంటికి వస్తుంది. అందూ చూసి షాక్ అవుతారు. దీప.. ప్రియమణిని తీసుకురావడం ఏంటి.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్లు.. బయటికి అంటాడు కార్తీక్. దీప తను కనిపించడం లేదా నీకు మెడ పట్టుకొని బయటికి గెంటేయ్ అంటాడు కార్తీక్. తనను నేనే రమ్మన్నాను అని చెబుతుంది.
వెంటనే ఏడ్చుకుంటూ వెళ్లి సౌందర్య కాళ్లు పట్టుకుంటుంది. దీంతో సరే.. వెళ్లు బుద్ధిగా ఉండాలి అని చెప్పి ప్రియమణిని ఇంట్లోకి పంపిస్తుంది సౌందర్య.
కట్ చేస్తే మోనిత జైలులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో సుకన్య వచ్చి.. మేడమ్ ప్రియమణి మీరు చెప్పినట్టే చేసిందట.. అని చెప్పగానే మోనిత సూపర్ అంటుంది. నాకు ఒక గంపెడు యాపిల్స్ కావాలి.. తెప్పించు అని సుకన్యకు చెబుతుంది మోనిత. ఆ తర్వాత హిమ ఆసుపత్రికి వచ్చిన విషయం కార్తీక్ కు దీప చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.