Karthika Deepam : కార్తీకదీపం అందాల అత్తమ్మ.. సౌందర్య లేటెస్ట్ పిక్స్ వైరల్…!
Archana Ananth: ఈ మధ్యకాలంలో బుల్లితెర మీద పాపులర్ సీరియల్ కార్తీక దీపంకి భారీ స్థాయిలో అభిమాలు పెరిగిపోతున్నారు. గత ఏడాది నుంచి కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో జనాలు ఓటీటీలతో పాటు టీవీ షోస్ కి సీరియల్స్ కి బాగా అలవాటు పడిపోయారు. ఓవైపు ఇదేంట్రా బాబూ ఈ సీరియల్ ఇంతగా సాగదీస్తున్నారని కామెంట్స్ చేస్తూనే మరొకవైపు అంతే ఆసక్తిగా చూస్తున్నారు.
karthika deepam archana ananth Latest Saree saree pics
దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా భారీ స్థాయిలో నమోదు అవుతోంది. ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్‌కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు మగవాళ్ళు కూడా ఫ్యాన్స్ అయ్యారు.ఇందులో నటిస్తున్న నటీ నటులకి ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇందులో నటిస్తున్న వంటలక్కకి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
karthika deepam archana ananth Latest Saree saree pics
అలాగే కార్తీక దీపం లో నటిస్తున్న మరో ఫెమీలియర్ నటి అత్తమ్మ పాత్రలో నటిస్తున్న అర్చన అనంత్ కి మంచి పాపులారిటీ ఉంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పాజిటివ్ రోల్ ఏదైనా అర్చన అనంత్ తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటోంది. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న అర్చన అనంత్ షూటింగ్ గ్యాప్‌లో ఫొటో షూట్స్ కూడా చేస్తోంది. చక్కగా చీరలో ఆకట్టుకునే లుక్ ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెంచుతున్నాయి.
karthika deepam archana ananth Latest Saree saree pics
Archana Ananth: అర్చన అనంత్ కుర్రభామలకి గట్టి పోటీ ఇచ్చేలా తన ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటోంది.
అర్చన అనంత్ తాజాగా కొత్త ఫొటో షూట్ పిక్స్‌ని అభిమానులతో పంచుకుంది. పింక్ కలర్ శారిలో దానికి తగ్గ మ్యాచింగ్ లిప్ స్టిక్ పెదాలకి అద్ధుకొని చిరు నవ్వులు చిందిస్తూ రక రకాల ఫోజులిచ్చి తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవైపు శారీలో గంభీరంగా కనిపిస్తూనే మరికొన్ని ఫొటోస్‌లో క్యూట్ లుక్స్ ఇచ్చి కవ్విస్తోంది.
karthika deepam archana ananth Latest Saree saree pics
చెప్పాలంటే అర్చన అనంత్ కుర్రభామలకి గట్టి పోటీ ఇచ్చేలా తన ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటోంది. కొత్తగా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన మోడల్ మాదిరిగా, క్రేజీ హీరోయిన్ యాడ్స్ లో కనిపిస్తున్నట్టు మెడలో బరువైన జువెల్లరీ ధరించి తెలుగందం అనిపించేలా కొప్పు పెట్టి అందులో పూలు పెట్టుకొని ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే ఈ లేటెస్ట్ పిక్స్‌లో అర్చన అనంత్‌ని చూస్తే రెండు కళ్ళు చాలవంటున్నారు.
