Home » Entertainment » Karthika Deepam Fame Nirupam Romance With Manjula Satires On Sreemukhi
Entertainment

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబు మామూలోడు కాదు.. రొమాన్స్, పంచ్‌లు వేయడంలో రెచ్చిపోయిన నిరుపమ్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 30, 2022 3:47 pm
Advertisement

Karthika Deepam Nirupam : బుల్లితెరపై కార్తీక దీపం ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే ఈ సీరియల్ అంతగా ట్రెండ్ అవ్వడం లేదు. అందరూ కొత్త వాళ్లు రావడంతో కథ మారిపోయింది.. మనుషులు మారిపోయారు. కారెక్టర్లు ఎగిరిపోయాయి. వంటలక్క, డాక్టర్ బాబులు లేరు. దీంతో వారి అభిమానులు ఈ సీరియల్‌ను పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఇది టీఆర్పీల్లో వెనక్కి వెళ్తోంది. అయితే కార్తీక దీపం సీరియల్‌లో కనిపించకపోయినా.. నిరుపమ్ మాత్రం సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటాడు. బుల్లితెరపై, సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానెల్‌లో నిరుపమ్ సందడి చేస్తుంటాడు.

Advertisement

నిరుపమ్ భార్య మంజుల సైతం నెట్టింట్లో సందడి చేస్తుంటుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసే యూట్యూబ్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఈ ఇద్దరూ యూట్యూబ్‌లో తెగ హల్చల్ చేస్తున్నారు. పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తుండటంతో ఈ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్‌లో దుమ్ములేపుతుంటారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ ఓ షోకి వచ్చారు. ఈ వర్షం సాక్షిగా అంటూ చేసిన ఈ ఈవెంట్‌లో సీరియల్, రియల్ జంటలు వచ్చారు. హనీమూన్ ఫ్రీ ట్రిప్ వస్తుందని ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఎంత రొమాన్స్ పండిస్తారో.. అందులో బెస్ట్ ఎవరు వస్తారో వారికే ఈ ట్రిప్ ఫ్రీ అని శ్రీముఖి చెబుతుంది.

Karthika Deepam Fame Nirupam Romance With Manjula Satires on Sreemukhi

Advertisement

అందులో నిరుపమ్, మంజుల కూడా రొమాన్స్‌లో రెచ్చిపోతారు. హగ్స్‌తో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేస్తారు. అయితే ఈ డాక్టర్ బాబు రొమాన్స్ కంటే.. సెటైర్లు ఎక్కువగా వేశారు. చెట్టు మీద ఉండేది నెస్ట్.. శ్రీముఖి ఇచ్చింది ట్విస్ట్ అని కౌంటర్ వేశాడు. ఆది, భాను అలియాస్ మహేష్ కీర్తి జోడి కాకుండా.. కీర్తి, మానస్ ఇందులోకి వచ్చారు. దీంతో అవినాష్, శ్రీముఖి కౌంటర్లు వేశారు. నీ మదిలో ఎవరున్నారు.. మహేషా? మానసా? అని శ్రీముఖి అడిగింది. మదిలో ఒకరు గదిలో ఒకరు ఉండకూడదా? ఏంటి అని డాక్టర్ బాబు నోరుజారాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. మంజుల అయితే చటుక్కున గిల్లేసింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి