
Jabardasth Avinash Satires on Navya Swamy And Ravikrishna
Jabardasth Avinash : నవ్యస్వామి రవికృష్ణ జోడికి బుల్లితెరపై ఉన్న డిమాండ్ అండ్ క్రేజ్ అందరికీ తెలిసిందే. స్టార్ మా సీరియల్‌లో ప్రసారమైన ఆమె కథ సీరియల్‌తో ఈ జోడి పాపులర్ అయింది. అంతకు ముందు నవ్యస్వామి, రవికృష్ణలకు అంతగా పరిచయం ఉండేది కాదు. ఆమె తన సీరియల్స్‌తో బిజీగా ఉండేది. అతగాడు బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్‌తో దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో ఈ సీరియల్ వచ్చింది. ఈ జోడి ఒక్క చోటకు వచ్చింది. ఆ సీరియల్ బాగానే క్లిక్ అవ్వడంతో ఈ జోడి రొమాన్స్ మరింతగా ముదిరింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో ఈ జోడి రొమాన్స్ అదిరిపోయింది. ఇక ఈ ఇద్దరికీ ఒకే సారి కరోనా రావడంతో అందరి దృష్టిలో పడిపోయారు.
ఫస్ట్ వేవ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా బారిన పడ్డది వీరే అనుకుంటా. అలా మొత్తానికి ఈ ఇద్దరూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. మొదటి సారిగా క్యాష్ షోలోకి వచ్చినప్పుడు వీరు చేసిన రొమాన్స్, హగ్స్, కిస్సులతో మరింతగా పాపులర్ అయ్యారు. అలా మొత్తానికి ఈ జోడికి స్క్రీన్ మీద మంచి పేరు వచ్చింది. ఇక ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారనే రూమర్లు స్టార్ట్ అయ్యాయి. వాటిని వారిద్దరూ కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆ తరువాత వాటిని సున్నితంగా ఖండిస్తూ వస్తున్నారు. కానీ నవ్యస్వామి పోస్టులకు రవికృష్ణ పెట్టే కామెంట్లు చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది.
Jabardasth Avinash Satires on Navya Swamy And Ravikrishna
మొత్తానికి ఈ జోడి మాత్రం ఈటీవీ, స్టార్ మా అంటూ బాగానే మ్యానేజ్ చేస్తోంది. ఈటీవీలో ఢీ షో చేస్తోంది. మధ్యమధ్యలో పండుగ ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. మరో వైపు స్టార్ మా ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది ఈ జోడి. ఇదే విషయాన్ని తాజాగా అవినాష్ స్టేజ్ మీద అనేశాడు. ఈ వర్షం సాక్షిగా అంటూ చేసిన ఈ ఈవెంట్‌లో సీరియల్, రియల్ జంటలు వచ్చారు. హనీమూన్ ఫ్రీ ట్రిప్ వస్తుందని ఒక్కొక్కరు రెచ్చిపోయారు. అయితే మాటల్లో భాగంగా.. ఈ బస్సు దేశాల్ని దాటిస్తుందా? అని రవి అంటాడు. మీ జోడి చానెళ్లలను దాటేస్తున్నారు కదా? అని అందరి ముందు బుక్ చేస్తాడు. ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు.. ఎవరు వస్తారో రారో గానీ రవికృష్ణ వస్తాడని ముందే అనుకున్నా అని అవినాష్ అందరి ముందు పరువుతీసేస్తుంటాడు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
This website uses cookies.