Karthika Deepam Fame Premi Viswanath has a rare disease
Karthika Deepam Premi Viswanath ; బుల్లితెరపై మోస్ట్ పాపులర్ సీరియల్ కార్తీకదీపం. స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ అత్యధిక టిఆర్పి రేటింగ్స్ ను దక్కించుకుంది. ఏ సీరియల్ కి దక్కని అరుదైన గౌరవం ఈ సీరియల్ కి లభించింది. 2017లో మొదలైన కార్తీక దీపం సీరియల్ 2023 జనవరిలో ముగిసింది. ఇక ఈ సీరియల్లో పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. డాక్టర్ బాబు, వంటలక్క, సౌందర్య, మోనిత ఇలా కొన్ని పాత్రలు ప్రేక్షకులలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా వంటలక్క పాత్రకి ఫుల్ ఫాన్స్ ఉన్నారు. దీప పాత్ర చేసిన నటి పేరు ప్రేమీ విశ్వనాథ్. ఈమె కేరళకు చెందినది అయినా తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
Karthika Deepam Fame Premi Viswanath has a rare disease
అయితే ప్రేమీ విశ్వనాథ్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త నిజంగా గుండె బద్దలయ్యేలా ఉంది. ప్రేమీ విశ్వనాథ్ అరుదైన వ్యాధి బారిన పడ్డారట. ఆమెకు చర్మవ్యాధి సమస్యలు వచ్చాయట. ముఖం మీద మచ్చలు ఏర్పడ్డాయట. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకున్నట్లు సమాచారం. అయితే కార్తీకదీపం సీరియల్ లో ప్రేమీ విశ్వనాథ్ వంటలక్క పాత్ర కోసం నలుపు మేకప్ వేసుకునేవారు. సహజంగా ఉండే ఆమె కలర్ కనిపించకుండా పాత్ర కోసం నలుపు మేకప్ వేసుకున్నారు. దీనికోసం ఆమె హెవీగా మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమెకు స్కిన్ సమస్యలు వచ్చాయని సమాచారం.
Karthika Deepam Fame Premi Viswanath has a rare disease
ప్రేమీ విశ్వనాథ్ కి అనారోగ్యమని తెలిసి ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఆమె ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రేమీ విశ్వనాథ్ కేరళకు చెందిన నటి. ఆమెకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయట. ప్రేమీ విశ్వనాథ్ కి ఒక స్టూడియో ఉందని, అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయని అంటున్నారు. మలయాళం లో పలు సీరియల్, సినిమాలలో నటించింది. ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమాలో ప్రేమీ విశ్వనాధ్ నటించబోతున్నట్లు సమాచారం. అలాగే కార్తీకదీపం సీరియల్ కి రెండో పార్ట్ ఉంటుందని అంటున్నారు ఇదే కనుక నిజమైతే వంటలక్క అభిమానులకు పండగే.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.