Home » Entertainment » Karthika Deepam Nirupam Paritala Funny Post
Entertainment

Nirupam Paritala : మహేష్ బాబు లెవెల్‌‌లో బిల్డప్.. చివరకు గాలిదీసేసిన డాక్టర్ బాబు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 6, 2021, 7:10 pm
Advertisement

Nirupam Paritala : కార్తీకదీపం సీరియల్ తెలుగు బుల్లితెరపై ఎంతటి సంచలనాలు నమోద చేస్తోందో అందరికీ తెలిసిందే. ఈ ధారావాహికలోని ప్రతీ ఒక్క క్యారెక్టర్ ఇప్పుడు ఫేమస్. ఆ పాత్రలను అంత చక్కగా గుర్తుండిపోయేలా నటీనటులు రక్తి కట్టిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా డాక్టర్ బాబు, కార్తీక్‌గా నిరుపమ్.. దీప, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్.. మోనితగా శోభా శెట్టి అదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు కథ అంతా కూడా ఈ ముగ్గురి చుట్టే తిరుగుతోంది. మోనిత ఆడుతున్న కడుపు నాటకం రోజురోజుకూ మలుపు తిరుగుతోంది.

Advertisement

Karthika Deepam Nirupam Paritala Funny Post

అంజి కోసం దీప, మోనితలు వెతుకుతున్నారు. అంజిని కనిపెట్టి మోనిత అసలు రూపాన్ని బయటపెట్టాలని దీప చూస్తోంది. ఇక మోనిత సైతం అంజి పని పట్టేయాలని కాచుకుని కూర్చుంది. ఈ సీన్లలో గన్స్ బాగానే వాడుతున్నారు. మోనిత్ గన్‌తో అంజిని భయపెట్టాలని చూస్తోంది. అయితే గన్నులను ఇప్పుడు నిరుపమ్ వాడేశాడు. మామూలుగానే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే నిరుపమ్ ఎప్పుడూ పంచ్‌లు వేస్తుంటాడు. ఆయన వేసే సెటైర్లు, పెట్టే పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి.

Advertisement

గాలిదీసేసిన డాక్టర్ బాబు

తాజాగా షూటింగ్ లొకేషన్‌లో గన్నులు పట్టుకుని మహేష్ బాబు లెవెల్‌లో డైలాగ్ కొట్టేశాడు. గన్ను చూడాలనుకునో తప్పు లేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు అంటూ అతడు సినిమాలో మహేష్ బాబులా చెప్పేశాడు. కానీ చివరకు వచ్చే సరికి గాలి దీసేశాడు. ఇందులో బుల్లెట్లు లేవు.. అందుకే మీరు చూడలేరు అన్నట్టుగా సెటైర్ వేసేశాడు. ఇక నిరుపమ్ వేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మోనితను ఏసేయడానికి గన్ను వాడుతారా? అని అంటున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి