Home » Entertainment » Karthika Deepam Nirupam Paritala Punch Dialogue
Entertainment

Karthika Deepam: కార్తీకదీపం డాక్టర్ బాబు పంచ్ డైలాగ్.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 29, 2021, 8:46 pm
Advertisement

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్‌ది బుల్లితెరపై సపరేట్ ట్రెండ్. మీమ్స్, ట్రోల్స్‌లో ఎక్కువగా వాడే సీరియల్, క్యారెక్టర్స్ కూడా అవే. కార్తీకదీపం సీరియల్, అందులోని వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను సోషల్ మీడియాలో విరివిగా వాడేస్తుంటారు. కార్తీక దీపం సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాలకు వచ్చినంత క్రేజ్ మరెవ్వరికీ వచ్చి ఉండదు. ఈ సీరియల్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

Advertisement

Karthika Deepam Nirupam Paritala Punch Dialogue

అలా డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో నిరుపమ్ ఓ రేంజ్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. కార్తీక్ డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ డబ్బింగ్ వినిపించకపోయినా అభిమానులు తట్టుకోలేరు. ఓ పది రోజులు సీరియల్‌లో కనిపించకపోయినా ఆందోళన చెందుతుంటారు. అలా నిరుపమ్ క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. ఇక నిరుపమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సీరియల్స్, తనపై వచ్చే మీమ్స్‌ను షేర్ చేస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు.

Advertisement

తాజాగా నిరుపమ్ అదిరిపోయే ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలే కాకుండా అతను కింద పెట్టిన క్యాప్షన్ మరింత హైలెట్ అవుతోంది. డాక్టర్ బాబులో ఈ యాంగిల్ కూడా ఉందా? అనే అనుమానం వచ్చేలా ఉంది. పొలానికి కంచె.. పెయింటైర్‌కి కుంచె… తెలుగోడికి పంచె అందం.. ఆనందం.. సౌకర్యం అంటూ ప్రాసతో చంపేశాడు. ఇక నిరుపమ్ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏం టైమింగ్ అంటూ సలామ్ కొట్టేస్తున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి